జ్యోతిష శాస్త్రంలో లగ్నం ప్రధాన మైనది. లగ్నం శిశువు పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించ బడుతుంది. ఒక రాత్రి ఒక పగటి సమయంలో మొత్తం పన్నెండు లగ్నాలు ఆవృత్తం ఔతాయి. సాధారణంగా సూర్యుడు మేషరాశి ప్రవేశ కాలం అయిన మేష సంక్రాంతి నుండి ఉదయకాలమున మేష లగ్నంతో ప్రారంభం ఔతాయి. ఒక లగ్న కాలం రెండున్నర ఘడియలు. ప్రస్తుత కాలంలో రెండు గంటల సమయం. అంటే నూట ఇరవై నిముషాలు. ఒక రోజు అనగా సూర్యోదయము మొదలు మరల సూర్యోదయము వరకు గల కాలము. ఒక రోజుకు 24 గంటలు లేదా 60 ఘడియలు. ఒక్కోరోజుకు ఈ లగ్నం నాలుగు నిముషాలు వెనుకకు జరిగి తిరిగి ఒక మాస కాలానికి వృషభ సంక్రాంతి నాటికి వృషభ లగ్నంతో మొదలౌతుంది. దానికి కారణము ప్రతి దేశ అక్షాంశముల సహాయముతో మేషాది సాయన లగ్న ప్రమాణములు తెలుసుకొనవచ్చును. ఈ సాయన లగ్న ప్రమాణములు యెన్ని యుగములు అయిననూ ఏ విదమైన మార్పు చెందవు. ఒక భూప్రదక్షిణ కాలానికి పన్నెండు లగ్నాల ఆవృత్తం పూర్తి ఔతుంది. పన్నెండు లగ్నాలకు పన్నెండు రాశులు అధిపత్యం వహిస్తాయి. ఒక రోజు 12 రాశులు లేదా లగ్నముల వలన యేర్పడినది. అందువలన ఒక రోజునకు 24 గంటలు లేదా 60 ఘడియలు లేదా 12 లగ్నములు అని భావించ వలయును. ఒక రోజులో 12 లగ్నములును ఒకే ప్రమాణము కలిగి వుండవు. కానీ ఈ 12 లగ్నములు ప్రమాణము మొత్తము కలసిన 60 ఘడియలు లేదా 24 గంటలు ఔతుంది. సాధారణంగా లగ్నం నుండి వ్యక్తి జాతక గణన జరుగుతుంది. లగ్నం నుండి పన్నెండు స్థానములకు లేక భావములకు పన్నెండు కారకత్వములు ఉంటాయి. లగ్నం మొదటి (తను) స్థానం లగ్నాధిపతి, అందు ఉండే గ్రహాలను అనుసరించి వ్యక్తి గుణగణాలను గణిస్తారు. రెండవ (ధన) స్థానముకు ధనస్థానం, మూడవది (భ్రాతృ) సోదర స్థానం. నాలుగవ (మాతృ) స్థానం గృహం, సుఖం, తల్లి స్థితిని తెలుపుతుంది. అయిదవ (పుత్ర) స్థానం పూర్వపుణ్య స్థానం. ఆరవ (శత్రు) స్థానం శత్రువులు, రోగముల స్థానం. ఏడవ (కళత్ర) స్థానం. ఎనిమిదవ (ఆయువు) స్థానం మారక స్థానం. తొమ్మిదవ (భాగ్య) స్థానం తండ్రి పితరులు, పిత్రార్జితం సూచిస్తుంది. పదవ (రాజ్య) స్థానం కర్మస్థానం ఇది వ్యక్తి చేయు వృత్తిని సూచిస్తుంది. పదకొండవ (లాభ) స్థానం. పన్నెండవ (వ్యయ) స్థానం.

లగ్నం కొన్ని విశేషాలు మార్చు

  1. లగ్నం నుండి 1,5,9 కోణస్థానములు 5, 9 స్థానములను త్రికోణ స్థానములని అంటారు.
  2. లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానములు కేంద్ర స్థానములు. వీటిని కంటక స్థానములు, చతుష్టయములు అంటారు. కేంద్రములో ఉన్న గ్రహములు బలమైనవి. లగ్నంలో ఉన్న గ్రహం కంటే 4 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైనది 4 స్థానంలో ఉన్న గ్రహం కంటే 7 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది. 7 వ స్థానంలో ఉన్న గ్రహం కంటే 10 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది.
  3. చంద్రుడి నుండి 3, 6, 10, 11 స్థానాలు ఉపజయ స్థానాలు. 1,2,4,5,7,8,9,12 స్థానములు అనుపజయ స్థానములు.
  4. లగ్నము కంటే పంచమ స్థానం పంచమ స్థానం కంటే నవమ స్థానం బలమైనది.
  5. 2, 5, 8, 11 స్థానములు పణపర స్థానములు. ఇవి పూర్వ జన్మలో చేసిన పుణ్యకార్యములు తెలియజేస్తాయి.
  6. 3, 6, 9, 12 స్థానములు అపోక్లిమ స్థానములు. ఇవి విచక్షణ, హేతు బుద్ధిని తెలియజేస్తుంది.
  7. 6, 8, 12 స్థానములు మరుగు స్థానములు దుస్థానములు.
  8. 3, 6, 12 స్థానాధిపతులు త్రిషడాయన స్థానములు అంటారు. వీటి అధిపతులు శుభగ్రహాలే అయినా అశుభమే చేస్తారు.
  9. 1, 2, 4, 5, 7, 9, 10, 11 శుభ స్థానములు. ఈ స్థానంలో ఉన్న గ్రహాలు శుభఫలితాలు ఇస్తాడు. ఈ స్థానాధి పతులు శుభం కలిగిస్తారు.
  10. 2, 7, 11 స్థానములు మారక స్థానములు.
  11. 3, 6, 8, 12 స్థానములు పాప స్థానములు. ఈ స్థానములో ఉన్న గ్రహములు గ్రహాధిపతులు శుభాన్ని కలిగిస్తారు.
  12. ఉపజయ స్థానములో ఉన్న పాపగ్రహములు కూడా శుభఫలితాలు ఇస్తాయి.

భావాలు కారకత్వాలు మార్చు

  1. లగ్నం :- లగ్నం తనూభావాన్ని సూచిస్తుంది. శరీరం, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావం, సుఖదుఃఖాలు మొదలైన వివరాలు తనూభావం నుండి తెలుసుకోవచ్చని పరాశరుని శ్లోకం వివరిస్తుంది. ఉత్తరకాలామృతం దేహమూ, కాళ్ళు, చేతులూ, అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనం, జ్ఞానం, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము లగ్నం వివరిస్తుందని చెప్తుంది.
  2. ద్వితీయ భావం :- ఇది ధన భావం, కుటుంబ భావంగా భావించబడుతుంది. ధనార్జన, ఆహారం స్వీకరించుట, కంఠ ద్వని, మాట తీరు, కంఠ వ్యాధులు, నాలుక. ముఖము, జీవనం, ఉపన్యాసం, వాక్కు, వాగ్ధాటి, విద్య. ఐశ్వర్యము, ఆభరణములు, భోగము, దుస్తులు, ఆచారం, దాతృత్వం, వజ్రము, మారకము, మణులు, ధనధాన్యము, వ్యాపారం. నాసిక, సుగంధ ద్రవ్యములు, నివయము, కోమలత్వం. కుటుంబం, పాండిత్యం, స్నేహం, స్నేహితులు, స్థిరభావం.
  3. త్రీతీయ భావం :- ఇది పరాక్రమ భావం, కనిష్ఠ సోదర భావంగా భావించ బడుతుంది. తమ్ముళ్ళు, ధైర్య సాహసాలు, కార్య భారం వహించుట, రౌద్రము, కనిష్ఠ సోదరులు, ఆభరణములు, సత్ప్రవర్తన, వర్ణాశ్రమ ధర్మం, పెద్దలు, యుద్ధము, గురువులు, చెవులు, వాహన సౌక్యము, కాళ్ళు, శారీరక బలం, చిత్త చాంచల్యం, మృష్టాన్న భోజనం, సామర్ధ్యం, శారీరక పుష్టి, సర్వసౌఖ్యము, సంపన్న జన్మ, స్వల్ప ప్రయాణములు, సామర్ధ్యము, కోపము, లాభము, శాంతం, దాసదాసీలు, కార్య సంధానం మొదలైనవాటికి కారకత్వం వహిస్తాడు.
  4. చతుర్ధభావం మాతృభావం. తల్లి సౌఖ్యం, వాహనం, సుఖం గురించి తెలియజేయును. అనేక విధ వాహన సంపద, కష్టార్జితం, శీలము, తల్లి బంధువులు, భూమి, గృహములు, చెరువులు, నూతులు, సాధన మొదలైనవి తెలియజేయును.
  5. పంచమ భావమనే సంతాన భావము. మంత్ర స్థాన, పూర్వపుణ్య స్థానం, బుద్ధి స్థానం కూడా ఔతుంది. వ్యాపారము, బుద్ధిబలం, వివేకము, ఉన్నత విద్య, సంతానం, పితృధనం, సత్కథా పఠనం, వినయము, గౌరవం, స్త్రీ మూలక భాగ్యము, అన్నప్రధానం, మంత్రోపాసన, మంత్ర జపం, పాప పుణ్యములు, గ్రంథరచన, వార్తాలేఖనం, ఆలోచన, వంశపారంపర్య అధికారం, సంతృప్తి, తండ్రి చేసిన పుణ్యము, మనసు, ఛత్రము, గర్భము, శుభలేఖలు, కోరికలు సిద్దించుట, దూరదృష్టి, రహస్యము, క్షేమము, కార్యాచరణ వైభవము, ప్రతిభ, పాండిత్యము, సంగీత వాద్యములు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
  6. షష్టమ భావము శత్రువు, రుణం, రోగ స్థానం. రోగములు, ఋణబాధలు, తగాదాలు, పేచీలు, కౄర కార్యములు, పిసినారితనం, అపవాదులు, యాచకత్వం, అకాల భోజనం, జైలు, అన్నదమ్ములతో వైషమ్యాలు, దొంగతనం, మేనమామలు, ఆపదలు, ప్రేగులు, జీర్ణాశయం మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
  7. సప్తమ భావము కళత్ర స్థానం. వ్యాపారములో భాగస్వాములు, భార్య, ద్వికళత్రం, దాంపత్య సుఖం, దొంగతనం, బుద్ధి మాంద్యము, వస్త్రములు, అలంకారములు, సుగంధద్రవ్యములు, పానీయములు, విదేశీ ప్రయాణములు, ధనార్జన, మూత్రము, మర్మస్థానముల మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు.
  8. అష్టమ స్థానం ఆయుర్భావం. మరణము, మరణకారణము, వారసత్వము గురించి తెలియ జేయును. ఇంకా సుఖము, ఆపద, తగాదాలు, సోమరితనం, ధనవ్యయం, దురదృష్టం, మానసిక స్వభావం, అవమానం, పరధనము మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
  9. నవమభావాన్ని భాగ్యభావం అంటారు. పూర్వజన్మ పుణ్యం కారణంగా కలుగు అదృష్టం, స్థితిగతులు, దూరప్రయాణాలు, ఆధ్యాత్మిక స్థితి, మంత్రోపాసన, గురువులను గౌరవించుట, విద్యార్జన, పిత్రార్జన, సంతానం, ఐశ్వర్యం, ఆచార సంప్రదాయాలు, దైవభక్తి, ఊరువుల మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
  10. దశమభావం రాజ్యభావం అంటారు. ఉద్యోగం, వ్యాపారం, పేరు ప్రఖ్యాతులు, అధికారం, వృత్తి గురించి తెలియజేస్తుంది. దయాగుణం, యంత్రము, మంత్రము, అభిమానము, మాతృ దేవత, పదవి స్థానం, ఔషధము, బోధన, ముద్రాధికారం, సన్మానం, దేవతలు, పుణ్యము, దత్త పుత్రుడు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
  11. ఏకదశ భావమును లాభభావం అంటారు. అగ్ర సోదరులు, స్నేహితుల గురించి తెలియజేస్తుంది. వివిధ ఆదాయములు, వివిధలాభములు, తండ్రి సోదరులు, అలంకారములు, నగలు, కార్యసిద్ధి, ఆశయసిద్ధి, చిత్రలేఖనం, లలిత కళలు, మంత్రోపాసన, విద్య, బంగారం గురించి తెలియ జేయును.
  12. ద్వాదశ భావం వ్యయభావం అంటారు. ధనవ్యయం, సమయ వ్యయం, పూర్వజన్మలు, రహశ్య శ్త్రువులు గురించి తెలియ జేస్తుంది. అది బంధనం, ఋణ విమోచనం, స్త్రీలోలత్వం, కళత్రహాని, విదేశప్రయాణం, ఉద్యోగ విరమణ, అధికార పతనం, మనోచంచలం, అహంకారం, శరీర అనారోగ్యం, మారకం మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.

లగ్నపాదాలు నవాంశ చక్రం మార్చు

జ్యోతిష శాస్త్రంలో నవాంశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక రాశిని తొమ్మిది సమ భాగాలుగా విభజించి ఆ రాశిలో ఉన్న గ్రహం ఏ నక్షత్రపాదంలో ఉందో నిర్ణయిస్తారు. నవాంశ ఆధారిత ఫలితాలు కచ్చితంగా ఉంటాయని పలు జ్యోతిషశాస్త్ర పండితులు అభిప్రాయపడతారు. ఉత్తర భారతంలో జ్యోతిష పండితులు నవాంశ చక్కటి ఆధారంగా చాలా నిర్దుష్ట ఫలితాలు చెప్పగలరని ప్రతీతి. జ్యోతిష శాస్త్రంలో నవాంశకు చాలా ప్రాధ్యనత ఉంది.

లగ్నం మేషరాశి వృషభరాశి మిధునరాశి కర్కాటకరాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృశ్చికరాశి ధనసురాశి మకరరాశి కుంభరాశి మీనరాశి
మేషం అశ్విని 1 అశ్విని 2 అశ్విని 3 అశ్విని 4 భరణి 1 భరణి 2 భరణి 3 భరణి 4 కృత్తిక 1 - - -
వృషభం రోహిణి 1 రోహిణి 2 రోహిణి 3 రోహిణి 4 మృగశిర 1 మృగశిర 2 - - - కృత్తిక 2 కృత్తిక 3 కృత్తిక 4
మిధునం పునర్వసు1 పునర్వసు2 పునర్వసు3 - - - మృగశిర 3 మృగశిర 4 ఆరుద్ర 1 ఆరుద్ర 2 ఆరుద్ర 3 ఆరుద్ర 4
కటకం - - - పునర్వసు4 పుష్యమి 1 పుష్యమి 2 పుష్యమి 3 పుష్యమి 4 ఆశ్లేష 1 ఆశ్లేష 2 ఆశ్లేష 3 ఆశ్లేష 4
సింహం మఖ 1 మఖ 2 మఖ 3 మఖ 4 పూర్వాఫల్గుణి1 పూర్వఫల్గుణి2 పూర్వఫల్గుణి3 పూర్వఫల్గుణి4 ఉత్తరఫల్గుణి1 - - -
కన్య హస్త 1 హస్త 2 హస్త 3 హస్త 4 చిత్త 1 చిత్త 2 - - - ఉత్తరఫల్గుణి2 ఉత్తరఫల్గుణి3 ఉత్తరఫల్గుణి4
తుల విశాఖ 1 విశాఖ 2 విశాఖ 3 - - - చిత్త 3 చిత్త 4 స్వాతి 1 స్వాతి 2 స్వాతి 3 స్వాతి 4
వృశ్చికం - - - విశాఖ 4 అనూరాధ 1 అనూరాధ 2 అనూరాధ 3 అనూరాధ 4 జ్యేష్ట 1 జ్యేష్ట 2 జ్యేష్ట 3 జ్యేష్ట 4
ధనసు మూల 1 మూల 2 మూల 3 మూల 4 పూర్వాషాఢ1 పూర్వాషాఢ2 పూర్వాషాఢా3 పూర్వాషాఢా4 ఉత్తరాషాఢ1 - - -
మకరం శ్రవణం 1 శ్రవణం 2 శ్రవణం 3 శ్రవణం 4 ధనిష్ఠ 1 ధనిష్ఠ 2 - - - ఉత్తర్రాషాడ2 ఉత్తరాషాఢ3 ఉత్తరాషాఢ4
కుంభం పూర్వాభద్ర1 పూర్వాభద్ర2 పూర్వాభద్ర3 - - - ధనిష్ఠ 3 ధనిష్ఠ 4 శతభిష 1 శతభిష 2 శతభిష 3 శతభిష 4
మీనం - - - పూర్వాభద్ర4 ఉత్తరాభద్ర1 ఉతారాభద్ర2 ఉత్తరాభద్ర3 ఉత్తరాభద్ర 4 రేవతి 1 రేవతి 2 రేవతి 3 రేవతి 4

విశ్లేషణ మార్చు

పైన ఉన్న నవాంశచక్రానికి విశ్లేషణ.

  1. మేషం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల మొదటి పాదం మేషరాశిలో ఉంటాయి.
  2. వృషభం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల రెండవ పాదం వృషభరాశిలో ఉంటాయి.
  3. మిధునం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల మూడవ పాదం మిధున రాశిలో ఉంటాయి.
  4. కటకం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల నాల్గవ పాదం కటకరాశిలో ఉంటాయి.
  5. సింహం రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన మొదటి పాదం సింహ రాశిలో ఉంటాయి.
  6. కన్య రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన రెండవ పాదం కన్యారాశిలో ఉంటాయి.
  7. తుల రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన మూడవ పాదం వృశ్చిక రాశిలో ఉంటాయి.
  8. వృశ్చిక రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటాయి.
  9. ధనుర్రాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల మొదటి పాదం ధనసు రాశిలో ఉంటాయి.
  10. మకర రాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల రెండవ పాదం మకర రాశిలో ఉంటాయి.
  11. కుంభరాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల మూడవ పాదం పాదం కుంభరాశిలో ఉంటాయి.
  12. మీన రాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల నాలుగ పాదం మీన రాశిలో ఉంటాయి.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=లగ్నం&oldid=3988592" నుండి వెలికితీశారు