లతా భగవాన్ కరే

(లతా భగవాన్‌ కరే నుండి దారిమార్పు చెందింది)

లతా భగవాన్‌ కరే 2020లో విడుదలైన మరాఠీ సినిమా. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త ప్రాణాలు కాపాడుకోవాలనే లక్ష్యం మారథాన్‌ లో పాల్గొన్ని విజేతగా నిలిచిన లతా కరే జీవిత కథ ఆధారంగా ఆమె పేరుతోనే మరాఠీలో ఈ సినిమాను నిర్మించారు. నవీన్‌ దేశబోయిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలుల ఉత్తమ చిత్రం (స్పెషల్‌ మెన్షన్‌) అవార్డు దక్కింది.[2]

లతా భగవాన్‌ కరే
లతా భగవాన్‌ కరే
దర్శకత్వంనవీన్‌ దేశబోయిన
రచననవీన్ దేశబోయిన
స్క్రీన్ ప్లేనవీన్ దేశబోయిన
నిర్మాతఅర్రబోతు కృష్ణ
తారాగణం
 • అజయ్ షిండే
 • భగవాన్‌ కరే
 • లతా కరే
ఛాయాగ్రహణంఆదిత్య సంఘరే, కమలేష్ సంఘరే
కూర్పుబొడ్డు శివ కుమార్
సంగీతంప్రశాంత్ మహాముని
నిర్మాణ
సంస్థ
పరం జ్యోతి క్రియేషన్స్
విడుదల తేదీs
17 జనవరి, 2020[1]
సినిమా నిడివి
154 నిముషాలు
దేశం భారతదేశం
భాషమరాఠీ

మహారాష్ట్రలోని బుల్దాన జిల్లా పింప్లీ గ్రామానికి చెందిన లతా భగవాన్‌ కరే దంపతులకు నలుగురు కూతుళ్లు. ఏళ్ల తరబడి కూలీనాలీ చేసి కూడబెట్టిన డబ్బుతో కూతుళ్ల పెళ్ళిళ్లు జరిపించారు. అందుకోసం చేసిన అప్పులు ఆమె కుటుంబానికి భారంగా మారాయి. అప్పులు తీర్చేందుకు భార్యాభర్తలు కష్టపడుతున్న సమయంలో అనుకోని ఆపద వచ్చి పడింది. భర్త భగవాన్‌ కరే ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో లతా కరే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఏదో ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉంటుందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే బాగుపడుతాడని చెప్తాడు.

రెండు రోజుల్లోనే భర్త నడవలేని స్థితికి చేరుకున్నారు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక తనలో తాను మదనపడింది. భర్తను ఎలాగైన కాపాడుకోవాలనే ఆరాటంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్ల దగ్గరకెళ్లి సాయం అందించాలని వేడుకుంది. ఎంతో కొంత అందిన సాయంతో భర్తను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు చేయాలంటే రూ.5వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తారు.

భర్త ఆకలిగా ఉందని చెప్పడంతో లతా కరే ఆస్పత్రి బయట రోడ్డు చివరన ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్న కొద్దిపాటి చిల్లరతో రెండు సమోసాలు తీసుకువచ్చి తినమని భర్తకు ఇస్తుంది. సమోసాలు చుట్టిన పేపరులో మరాఠీలో పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన ప్రకటన లతా కరే కంట పడింది. ‘బారామతి మారథాన్‌లో పాల్గొనండి.. రూ.3వేలు నగదు గెలుచుకోండి’ అనేది ఆ ప్రకటన సారాంశం. రాత్రంతా తెగ ఆలోచించి... మారథాన్‌లో పాల్గొని రూ.3వేలు గెలుచుకోవాలనుకుంది. ఆ డబ్బుతో భర్తకు వైద్యం చేయించాలని గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు (2013 డిసెంబర్‌ 17న) బారామతి మారథాన్‌ ప్రారంభం కావడానికి సిద్ధమైంది. పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తుంది... అయితే ఆమెకు నిర్వాహకులు ఏమి చెప్పారు ?? తనకు అవకాశం తనకు అవకాశం ఇచ్చారా లేదా అనేది మిగతా సినిమా కథ. [3][4]

నటీనటులు

మార్చు
 • అజయ్ షిండే
 • భగవాన్‌ కరే
 • లతా కరే

సాంకేతికవర్గం

మార్చు
 • రచన, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: నవీన్‌ దేశబోయిన
 • నిర్మాత: అర్రబోతు కృష్ణ[5]
 • సంగీతం: ప్రశాంత్ మహాముని
 • ఛాయాగ్రహణం: ఆదిత్య సంగారే, కమలేష్‌ సంగారే
 • కూర్పు: బొడ్డు శివ కుమార్
 • నిర్మాణ సంస్థ: పరం జ్యోతి క్రియేషన్స్

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం ఫలితం గమనిక
2020 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (స్పెషల్‌ మెన్షన్‌) అవార్డు గెలిచింది

మూలాలు

మార్చు
 1. Deb, Rishabh (2020-01-17). "Lata Bhagwan Kare Movie Review: Inspiring journey of Lata Bhagwan Kare". The Times of India. Retrieved 2021-04-16.
 2. Andhrajyothy (3 February 2020). "భర్త కోసం మారథాన్‌ పరుగు!". www.andhrajyothy.com. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
 3. Sakshi, హోం » ఫ్యామిలీ (26 March 2021). "తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు". Sakshi. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
 4. The Times of India (17 January 2021). "Lata Bhagwan Kare Movie Review: Inspiring journey of Lata Bhagwan Kare". Retrieved 18 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 5. Andhrajyothy (24 March 2021). "యువకుల కష్టానికి దక్కిన ఫలితం". www.andhrajyothy.com. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.

బయటి లంకెలు

మార్చు