లష్కరే తోయిబా దక్షిణాసియాలో ప్రాబల్యం ఉన్న ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధ. హఫీజ్ మహమ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్ లు కలిసి ఈ సంస్ధను స్ధాపించారు.

లష్కరే తోయిబా
క్రియాశీలంగా ఉన్న సమయం1990 - ప్రస్తుతం
అధ్యక్షుడుహఫీజ్ మహమ్మద్ సయీద్
లక్ష్యాలుజమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతంచేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం[1]
క్రియాశీలంగా ఉన్న ప్రాంతాలుభారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్[1]
సిద్ధాంతాలుఇస్లామిజం,
ఇస్లామిక్ ఫండమెంటలిజం,
పాన్ ఇస్లామిజం
వహ్హబిజం,
జమ్ము కాశ్మీర్ స్వాతంత్ర్యం
ప్రముఖ చర్యలుఆత్మాహుతి దాడులు, ముస్లిమేతరుల వధ, భద్రతా దళాలపై దాడులు[1]
ప్రముఖ దాడులుజమ్ము కాశ్మీర్ దాడులు; 2008 ముంబై దాడులు
స్థితిఅమెరికా గుర్తించిన విదేశీ ఉగ్రవాద సంస్థ (26 Dec 2001); యు. కె లో నిషేధం. (2001); పాకిస్థాన్ లో నిషేధం (2002); అమెరికాలో అనుబంధ జమాత్ ఉద్దవా పార్టీ నిషేధం (2006), యు. ఎన్ లో నిషేధం. (2008)
2001 సెప్టెంబరు 11.లో అమెరికాపై జరిగిన దాడి తర్వాత ఇస్లామిక్ తీవ్రవాద దాడులు జరిగిన దేశాలు.

2001 లో భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడులు, 2019లో పుల్వామాలో భారత సైనిక దళాలపై జరిగిన దాడికి ఈ సంస్థ కారణమంటూ భారతదేశం ఆరోపణలు చేసింది.[2] కాశ్మీర్ ను భారతదేశం నుంచి విడదీసి పాకిస్థాన్ లో కలపడం ఈ సంస్థ ఉద్దేశ్యంగా పేర్కొంది.[3]

ఈ సంస్థను పాకిస్థాన్ లో నిషేధించినా దీని అనుబంధ రాజకీయ సంస్థ జమాత్ ఉద్దవా మాత్రం అప్పుడప్పుడు నిషేధాలకు గురైంది. అయినా ఇది తన గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ముఖ్య నాయకులు

మార్చు
  • హఫీజ్ మహమ్మద్ సయీద్ - లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు, ఇంకా దీనికి అనుబంధ రాజకీయ సంస్థ జమాత్ ఉద్దవా కు అధ్యక్షుడు కూడా.
  • అబ్దుల్ రెహమాన్ మక్కి - పాకిస్థాలో నివాసం. లష్కరే తోయిబాకు రెండో కమాండింగ్ అధికారి. హఫీజ్ కి బావమరిది.


మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Encyclopedia of Terrorism, pp 212-213 , By Harvey W. Kushner, Edition: illustrated, Published by SAGE, 2003, ISBN 0-7619-2408-6, 9780761924081
  2. European Foundation for South Asian Studies. "David Coleman Headley: Tinker, Tailor, American, Lashkar-e-Taiba, ISI Spy". www.efsas.org.
  3. "Who is Lashkar-e-Tayiba". Dawn. 3 December 2008. Archived from the original on 6 July 2017. Retrieved 3 December 2008.