లాల్‌రెమ్సియామి
లాల్‌రెమ్సియామి (జననం 2000 మార్చి 30) మిజోరాంకి చెందిన ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి, భారత జాతీయ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్ కూడా.[1] 2018 ప్రపంచ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 18 మంది సభ్యుల జట్టులో లాల్‌రెమ్సియామి ఒకరు. ఆ తరువాత జరిగిన ఆసియా క్రీడల్లో, భారత జట్టు రజత పతకం సాధించింది. అలా మిజోరాం నుండి ఆసియాడ్ పతకం సాధించిన మొదటి క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.[2]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జాతీయత | భారతదేశం |
జననం | జననం 30 మార్చి 2000 మిజోరాం, ఇండియా |
ఎత్తు | 1.57 మీ (5 అడుగులు 2 అంగుళాలు) |
బరువు | 52కి.గ్రా |
క్రీడ | |
క్రీడ | ఫీల్డ్ హాకీ |
సాధించినవి, పతకాలు | |
ప్రపంచస్థాయి ఫైనళ్ళు | రజత పతకం - రెండవ స్థానం 2018 బ్యూనస్ ఎయిర్స్
రజత పతకం - రెండవ స్థానం 2018 జకార్తా రజత పతకం - రెండవ స్థానం 2018 డోంగ్హే సిటీ |
ఆమెకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2019 రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేసింది. ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళ లాల్‌రెమ్సియామి.[3]
వ్యక్తిగత జీవితం, నేపథ్యం
మార్చులాల్రెమ్సియామి మిజోరాంలోని ఐజ్వాల్ నుండి సుమారు 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న కోలాసిబ్ పట్టణంలోని వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి, లాల్తాన్సంగ జోట్, ఒక సాధారణ రైతు కాగా తల్లి లాజర్‌మావి, గృహిణి. 10 మంది తోబుట్టువులలో లాల్ రెమ్సియామీ ఒక్కత్తి, లాల్‌రెమ్సియామి బాల్యం నుంచే హాకీ ఆడటం మొదలుపెట్టింది. ఆమె 11 ఏళ్ళ వయసులో సెర్చ్‌షిప్‌లోని తెన్జాల్‌లోని మిజోరాం ప్రభుత్వం నిర్వహిస్తున్న హాకీ అకాడమీకి ఎంపికయ్యింది. 2016 లో, ఆమె న్యూ దిల్లీ లోని నేషనల్ హాకీ అకాడమీలో చేరింది. ఆ సమయంలో హిందీ నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టమయ్యింది. అప్పుడు తనను 'సియామి' అని పిలిచే సహచరుల సహాయంతో భాషను నేర్చుకుంది. [2][3]
వృత్తిపరమైన విజయాలు
మార్చు2016 లో ఆసియా కప్‌లో ఆడిన అండర్ -18 ఇండియన్ జట్టులో సియామి సభ్యురాలు. ఆసియా యూత్ ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫైయర్‌లో ఆమె అండర్ -18 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు భారత జట్టు రెండవ స్థానంలో నిలిచింది.[2] ఆ తరువాత సీనియర్ జట్టులో చేరిన ఆమె 2017 ఆసియా కప్‌లో స్వర్ణం సాధించారు. 13 ఏళ్ల తరువాత ఆసియా కప్‌లో పాల్గొన్న భారతీయ మహిళల హాకీ జట్టుకు ఈ విజయం అప్పట్లో చాలా చాలా అవసరం.
2018 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ పడిన జట్టులో లాల్‌రెమ్సియామిని చేర్చారు, అప్పుడు జట్టు రెండవ స్థానంలో నిలిచింది. ఫైనల్ రౌండ్-రాబిన్ మ్యాచ్‌లో ఈక్వలైజర్‌తో సహా ఐదు మ్యాచ్‌ల్లో మైదానంలో మొత్తం 31 నిమిషాల్లో ఆమె రెండు గోల్స్ సాధించారు. ఫలితంగా ఆమె టోర్నమెంట్‌లో 'U-21 రైజింగ్ స్టార్ అవార్డు' గా ఎంపికయ్యారు.[4]
లాల్‌రెమ్సియామి అతి పిన్న వయసులోనే అంటే 18 ఏళ్లకే 2018 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు.[4] లీగ్ పోటీల్లో తిరుగులేని ప్రదర్శన తరువాత, ఇటలీతో జరిగిన క్రాస్ఓవర్ మ్యాచ్లో లాల్‌రెమ్సియామి టోర్నమెంట్లో తన మొదటి, ఏకైక గోల్ సాధించారు. భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ఆపై ఓటమి పాలై ఎనిమిదో స్థానంలో నిలిచింది. చివరిసారిగా భారత మహిళల హాకీ జట్టు 1974 లో ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.[5]
ప్రపంచ కప్ తరువాత జరిగిన జకార్తా ఆసియా క్రీడలలో లాల్‌రెమ్సియామి నాలుగు గోల్స్ చేశారు. ఇండోనేషియాతో జరిగిన గ్రూప్ స్టేజ్ గేమ్ యొక్క 24 వ నిమిషంలో మొదటి గోల్ వచ్చింది, భారత జట్టు 8-0తో విజయం సాధించింది. తరువాతి గేమ్‌లో కజకిస్థాన్‌పై ఆమె హ్యాట్రిక్ సాధించింది; 21–0 తేడాతో భారత్ విజయం సాధించింది. అంత భారీ మార్జిన్‌తో విజయం సాధించడం భారత మహిళా హాకీ జట్టుకు అది రెండోసారి మాత్రమే.[6] అద్భుతమైన ప్రదర్శనల తరువాత, భారత జట్టు ఫైనల్లో 1-2 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయి, రజత పతకం సాధించింది. అలా లాల్‌రెమ్సియామి మిజోరాం నుండి ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి అయ్యింది.[7]
ఆ సంవత్సరం బ్యూనస్ ఎయిర్స్ యూత్ ఒలింపిక్స్‌లో జరిగిన భారత్ రజత పతకం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భారత మహిళా హాకీ చరిత్రలో బ్యూనస్ యూత్ ఒలంపిక్స్‌లో పతకం సాధించడం అదే మొదటి సారి.[8] ఈ యూత్ ఒలంపిక్స్‌లో లాల్‌రెమ్సియామి ఆస్ట్రియా, ఉరుగ్వే, వనౌతూ దేశాలపై తొమ్మిది గోల్స్ చేసింది.[9]
జనవరి 2019 లో స్పెయిన్ పర్యటనలో భారత జట్టు 5-2 తేడా విజయం సాధించగా అందులో లాల్‌రెమ్సియామి రెండు గోల్స్ చేసింది.[10]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "International Hockey Federation". tms.fih.ch. Retrieved 2021-02-18.
- ↑ 2.0 2.1 2.2 "Lalremsiami first Mizo sportsperson to win an Asiad medal". web.archive.org. 2018-09-03. Archived from the original on 2018-09-03. Retrieved 2021-02-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 Feb 11, TIMESOFINDIA COM / Updated:; 2020; Ist, 09:56. "lalremsiami: India's Lalremsiami named FIH Rising Star of 2019 | Hockey News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ 4.0 4.1 "'As long as they're talking about hockey I can catch up'". ESPN (in ఇంగ్లీష్). 2018-05-22. Retrieved 2021-02-18.
- ↑ "Women's Hockey World Cup: Indian Women Lose To Ireland In Quarter-Finals Via Shoot Off | Hockey News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Asiad hockey: Indian women's team mauls Kazakhstan 21-0 - Sportstarlive". web.archive.org. 2018-09-03. Archived from the original on 2018-09-03. Retrieved 2021-02-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Ganesan, Uthra (2018-08-31). "Asian Games: India women claim silver in hockey after 1-2 loss to Japan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-18.
- ↑ Service, Tribune News. "Maiden Youth Olympic silver medals for Indian hockey teams". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Youth Olympics: Indian women's hockey team thrash Vanuatu 16-0". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Hockey: Lalremsiami brace helps India defeat Spain 5-2". web.archive.org. 2019-02-06. Archived from the original on 2019-02-06. Retrieved 2021-02-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)