మాఘ మాసం కృష్ణ పక్షం, చతుర్దశి తిథి రాత్రివేళ లింగోద్భవం జరిగినట్లు స్కాంద తదితర పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. చతుర్దశి పగటివేళ ముగిసినప్పటికీ ఆ నాటి అర్ధరాత్రి లింగోద్భవ వేళగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగా పాటించడం సంప్రదాయం. బ్రహ్మ విష్ణువులకు తన ఆధిక్యాన్ని తెలియజేయడం కోసం శివుడు జ్యోతి రూపంలో ఒక స్తంభంగా అంతు తెలియనంతగా, ఆద్యంతాలు కనిపించ నంతగా పైకీ, క్రిందికీ వ్యాపించాడనీ, బ్రహ్మ విష్ణువులు లింగం ఎక్కడ మొదలో ఎక్కడ చివరో తెలుసుకొన లేనప్పుడు శివుడు అగ్ని స్తంభం మధ్యలో వారికి దర్శనం ఇచ్చాడనీ పురాణ గాథ.