లింగ పురాణం

lingapuranam

లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది. [1][2]

లింగ పురాణంలోని ఒక పుట

దీని రచించినది వేదవ్యాస మహర్షి. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. [3]

విషయాలు

మార్చు

లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం,, ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. [1][3] ఈ పురాణంలో చాలా విస్తృతమైన విషయాల గురించి సోదాహరణంగా వివరించారు.

సృష్టి నిర్మాణ శాస్త్త్రం
మొదటి అధ్యాయాలలో ఇది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా సృష్టి నిర్మాణాన్ని వివరించింది. అధ్యాయం 1.70 ఇది సాంఖ్యయోగ దర్శనంలో పేర్కొన్న విశ్వ సృష్టిని ప్రస్తావించింది.[4]
ఖగోళ శాస్త్త్రం
అధ్యాయం 1.55 నుంచి 1.61వరకు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వాటి వెనుక గల పురాణ కథల్ని వివరిస్తుంది.[5]
భూగోళ శాస్త్త్రం
ఈ భూమ్మీద ఏడు ఖండాలున్నాయని వాటిలో ఉన్న పర్వతాలను, నదులను, అక్కడ ఏమేమి పెరుగుతాయో ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది.[6]

గమనికలు

మార్చు
  1. 1.0 1.1 Dalal 2014, p. 223.
  2. Rocher 1986, pp. 187–188.
  3. 3.0 3.1 Rocher 1986, p. 187.
  4. Tracy Pintchman (2015). The rise of the Goddess in the Hindu Tradition. State University of New York Press. p. 242 with footnote 150. ISBN 978-1-4384-1618-2.
  5. Linga Purana, Chapter 1.55-1.61 JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 215-238
  6. Linga Purana, Chapter 1.46 JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 181-209

మూలాలు

మార్చు