లినక్స్ ఫౌండేషన్

లినక్స్ ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సాంకేతిక సంఘం.[2] లినక్స్ కు చెందిన ప్రామాణికాల పెరుగుదలను, వాణిజ్య స్వీకరణనూ ప్రోత్సహించడానికి ఓపెన్ సోర్స్ డెవలప్మెంట్ ల్యాబ్స్, ఉచిత స్టాండర్డ్స్ గ్రూప్ కలిసి 2000లో లినక్స్ ను స్థాపించాయి. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులకు సహకరించడమే కాకుండా వాటి అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది.[2][3][4]

లినక్స్ ఫౌండేషన్
ముందువారు
స్థాపన2000
కార్యస్థానం
సభ్యులు1,000+ కార్పొరేట్ సభ్యులు[1]
ముఖ్యమైన వ్యక్తులు
ముఖ్యమైన వ్యక్తులు
ఉద్యోగులు150
లినక్స్ కాన్ ప్రారంభొత్సవం వద్ద జిమ్ జెమ్లిన్ యురప్ 2014
లినక్స్ కాన్ వద్ద లినస్ టోర్వాల్డ్స్ నార్త్ అమెరికా 2016

ఇది ఓపెన్ సోర్స్ డెవలప్‌మెంట్ ల్యాబ్స్ క్రింద 2000 సం.లో ప్రారంభమైంది. తరవాత ఫ్రీ స్టాండర్డ్స్ గ్రూప్ తో విలీనమై లినక్స్ ఫౌండేషన్ గా మారింది. లైనెక్స్ సృష్టికర్త లైనస్ టోర్వాల్డ్స్, ప్రధాన నిర్వాహకుడు గ్రెగ్-క్రోహ్-హార్ట్మన్ మిగతా సభ్యులు కలిసి రుాపొందించే కెర్నలు (కంప్యూటరు) కు ఇది ఆర్ధిక సహాయ సహకారం ఇస్తుంది. లినక్స్ ఫౌండేషనుకు మద్దతుగా ఎటి&టి, సిస్కో , ఫేస్బుక్[5], ఫుజిట్సు, గూగుల్ , హిటాచీ , హువావే , ఐబియమ్ , ఇంటెల్ , మైక్రోసాఫ్ట్[6] , ఒరాకిల్ ,ఆరెంజ్ ఎస్‌ఏ , క్వాల్‌కామ్ , శామ్‌సంగ్,[7] టెన్సెంట్ , విఎమ్‌వేర్ లతో పాటు ప్రపంచవ్యాప్తంగా డెవెలపర్లు ఉన్నారు. ఇటీవలి కాలంలో, ఈవెంట్స్, శిక్షణ, ధృవీకరణ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల ద్వారా లైనక్స్ ఫౌండేషన్ తన సహాయ కార్యక్రమాలను విస్తరించింది. లైనక్స్ ఫౌండేషన్‌లో హోస్ట్ చేయబడిన ప్రాజెక్టులలో లైనక్స్ కెర్నల్ ప్రాజెక్ట్, కుబెర్నెట్స్ , ఆటోమోటివ్ గ్రేడ్ లైనక్స్ , ఓపెన్ నెట్‌వర్క్ ఆటోమేషన్ ప్లాట్‌ఫాం, హైపర్‌లెడ్జర్ , క్లౌడ్ నేటివ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ , క్లౌడ్ ఫౌండ్రీ ఫౌండేషన్ వంటి అనేక ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.

అంకురార్పణాలు మార్చు

లినక్స్.కామ్ మార్చు

మార్చి 3, 2009 న లినక్స్.కామ్ నిర్వాహణ, లినక్స్ ఫౌండేషన్ సోర్స్ ఫోర్జ్ నుంచి తీసుకున్నట్లుగా ప్రకటించింది. మార్చి 13, 2009 న ఈ సైట్ ని లైనక్స్ ట్యుటోరియల్స్, సమాచారం, సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్, డెస్క్‌టాప్ / నెట్‌బుక్, మొబైల్ ఎంబెడెడ్ వంటి విషయాలకు కేంద్రంగా మళ్ళీ విడుదల చేసింది. దీనిలొ లినక్స్ కు చెందిన సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్ సంబంధించిన ఫైల్స్ కలిగి ఉన్న జాబితా కూడా ఉంది.

సభ్యులు మార్చు

జూన్ 2018 నాటికి వెయ్యికి పైగా సభ్యులు లినక్స్ ఫౌండేషన్ వాటి ప్రాజెక్టులలో ఉన్నారు.[1] లినక్స్ ఫౌండేషన్ సభ్యులు ఇచ్చిన నిధుల ప్రకారంగా వారిని ప్లాటినం, గోల్డ్, సిల్వర్ సభ్యులుగా వర్గికరణ చేయడినారు.

నిధులు మార్చు

లినక్స్ ఫౌండేషన్‌కు నిధులు ప్రధానంగా దాని ప్లాటినం సభ్యుల నుండి వస్తాయి. లినక్స్ ఫౌండేషన్ ఛట్టంలోని షెడ్యూల్ A నిబంధనల ప్రకారం ఒక్కొక్కరి నుండి. US$500,000 చొప్పున వీరినుంచి సంవత్సరానికి US$4 మిలియన్ల వరకు నిధులు సమకూరతాయి. గోల్డ్ సభ్యులు మొత్తం US $1.6 మిలియన్లు, మిగతా సభ్యులు అంతకన్నా తక్కువ సమకుారుస్తారు. 2014 ఏప్రిల్ నాటికి, ఫౌండేషన్ కనీసం US$6,245,000 వార్షిక ఫీజును వసూలు చేసింది.

ముాలాలు మార్చు

  1. 1.0 1.1 "Corporate Members – The Linux Foundation". The Linux Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-12-06. Retrieved 2018-06-24.
  2. 2.0 2.1 "About The Linux Foundation". The Linux Foundation. Retrieved 30 October 2018.
  3. "Linux Foundation Projects". The Linux Foundation. Retrieved 30 October 2018.
  4. "Jim Zemlin Named Executive Director of New Linux Foundation". The Linux Foundation. Archived from the original on 2007-02-02.
  5. Than 1, More; Members, 000; Software, Is the World’s Leading Home for Collaboration on Open Source; St, Open; ards; Data, Open; Linux, open hardware Linux Foundation’s projects are critical to the world’s infrastructure including; Kubernetes; Node.js (2020-08-13). "Facebook's Long History of Open Source Investments Deepens with Platinum-level Linux Foundation Membership". The Linux Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-13. {{cite web}}: |first2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  6. "Microsoft—yes, Microsoft—joins the Linux Foundation". 2016-11-16. Retrieved 22 June 2017.
  7. Latif, Lawrence (2012-06-06). "Samsung takes a seat with Intel and IBM at the Linux Foundation". The Inquirer. Archived from the original on 2019-12-24. Retrieved 2013-11-13.

అదనపు లింకులు మార్చు