లినక్స్ మింట్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
లినక్స్ మింట్ అనేది లినక్స్ ఆధారిత కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ, ఇది వాడుకకు, సరళ స్థాపన, ఇంతకుముందు లినక్స్ అనుభవం లేని వాడుకరులు వాడేదిగా పేరుపొందినది.ఇది వివిధ కోడ్ ఆధారిత ప్రతులలో లభ్యమవుతుంది, ఇందులో దాదాపు ఉబుంటుకు చెందినవే. ఉబుంటు కూడా డెబియన్ పై ఆధారపడి ఉన్నది.
![]() | |
![]() లినక్స్ మింట్ 12 ("లీస") | |
అభివృద్ధికారులు | లినక్స్ మింట్ జట్టు |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ వంటిది (ఉబుంటు ఆధారితం) |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | Free and open source software |
తొలి విడుదల | 27 ఆగష్టు 2006 |
ఇటీవల విడుదల | Linux Mint 11 ("Katya") / మే 26, 2011 |
Latest preview | Linux Mint 11 ("Katya") RC / మే 9, 2011 |
విడుదలైన భాషలు | బహుళ భాషలలో |
తాజా చేయువిధము | APT |
ప్యాకేజీ మేనేజర్ | dpkg |
ప్లాట్ ఫారములు | IA-32, x86-64 |
Kernel విధము | Monolithic (లినక్స్) |
అప్రమేయ అంతర్వర్తి | GNOME, KDE Plasma Desktop, Fluxbox, LXDE, Xfce |
లైెసెన్స్ | సాధారణముగా జిపియల్, కొన్నిటికి వేరేవి |
అధికారిక జాలస్థలి | http://www.linuxmint.com |
లినక్స్ మింట్ చాలా సాఫ్టువేర్ ప్యాకేజీలతో కూర్చబడింది, ఇందులో చాలా వరకూ ఫ్రీ సాఫ్టువేర్ లైసెన్స్(ఓపెన్ సోర్సు) క్రింద పంపిణీ చేయబడుతున్నాయి. గ్నూ లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్సుతో పాటుగా, గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు ప్రధాన లైసెన్సుగా వాడబడింది, అందువలన వాడుకరులు ఉచితంగా నడుపుట, నకలుచేయుట, పంచుట, చదువట, మార్చుట, అభివృద్ధి చేయవచ్చని స్పష్టంగా తెలుస్తున్నది. అడోబ్ ఫ్లాష్ పొడిగింత, బైనరీ బ్లాబ్స్ తో కూడిన లినక్స్ కెర్నల్ వంటి యాజమాన్య సాఫ్టువేర్ కూడా లినక్స్ మింట్ అందుబాటులో ఉంచుతుంది. లినక్స్ మింట్ వాడుకరుల సంఘం ద్వారా నిర్వహణ వ్యవస్థను వాడుతున్న వ్యక్తిగత వాడుకరులు, సంస్థలు పంపకం యొక్క చందాదారులు, భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.
ఆవిర్భావం, అభివృద్ధి ప్రక్రియ మార్చు
లినక్స్ మింట్ ప్రాథమికంగా ఒక ఉచిత (స్వేచ్ఛా) సాఫ్టువేర్, ఇది కొన్ని అధినాయకత్వ హార్డువేర్ డ్రైవర్లకు, కొన్ని అడోబ్ ఫ్లాష్ ప్లగిన్, రార్ వంటి అధికంగా వాడే కొన్ని సాఫ్టువేర్లకు మాత్రమే మినహాయించింది. ఇతర పంపకాల వలె కాకుండా, లినక్స్ మింట్ దానంతట అదే FLOSS కు పరిమితం చేయదు కాని అధినాయకత్వకు బదులుగా ఉచిత సాఫ్టువేరుకు ప్రాముఖ్యమిస్తుంది.
విశిష్టతలు మార్చు
This distro is very good for beginners.
రూపాంతరం | కోడ్ పేరు | విడుదల తేదీ |
---|---|---|
1.0 | అదాస్ | 2006-08-27 |
2.0 | బార్బరా | 2006-11-13 |
2.1 | బీ | 2006-12-20 |
2.2 | బియంకా | 2007-02-20 |
3.0 | కస్సాంద్ర | 2007-05-30 |
3.1 | సెలీన | 2007-09-24 |
4.0 | డరీన | 2007-10-15 |
5 | ఎలిస్సా | 2008-06-08 |
6 | ఫెలిసియా | 2008-12-15 |
7 | గ్లోరియా | 2009-05-26 |
8 | హెలెనా | 2009-11-28 |
9 | ఇసడోరా | 2010-05-18 |
10 | జూలియా | 2010-11-12 |
11 | కాట్య | 2011-05-26 |
12 | లీసా | 2011-11-26 |
13 | మాయ | 2012-05-23 |
14 | నదియా | 2012-11-20 |
15 | ఒలీవియా | 2013-05-29 |
16 | పెట్రా | 2013-11-30 |
వ్యవస్థ కనీస అవసరాలు మార్చు
ప్రస్తుతం లినక్స్ మింట్ ఇంటెల్ x86, AMD64 నిర్మాణాలకు సహకరిస్తున్నది.
కనీసం | సిఫారసుచేయబడినవి | |
---|---|---|
ప్రోసెసర్ (x86) | 600 MHz | 1 GHz |
మెమొరీ | 256 మెబై | 512 మెబై |
హార్డుడ్రైవ్ (ఖాళీ స్థలం) | 5 గిబై | 10 గిబై |
మానిటర్ విభాజకత | 800×600 | 1024×768 |
గమనిక: ఒకవేళ విజువల్ ప్రభావాలు కోరుకున్నట్లయితే, ఒక సహకారమున్న GPU అవసరం.
స్థాపనలో LVM లేదా డిస్కు ఎన్క్రిప్షన్కు సహకారం లేదు.