లియోనెల్ మెస్సి

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు

లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ    1987 జూన్ 24 లో జన్మించారు[1] అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ  కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు మరియు ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు[2][3], ఒక  రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం[4][5]. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ చరిత్రలో పన్నెండు క్లబ్ లీగ్ టైటిల్‌లు, నాలుగు UEFA ఛాంపియన్స్ లీగ్‌లు, రెండు కోపా అమెరికాలు మరియు ఒక FIFA ప్రపంచ కప్‌తో సహా 46 టీమ్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక ఆటగాడు[6]..

మెస్సీ తన ప్రొఫెషనల్ క్రీడా జీవితం లో ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్నాడు. తన పేరిట అత్యధిక యూరోపియన్ గోల్డెన్ షూస్ (6), ఒకే క్లబ్ కోసం అత్యధిక గోల్స్ (672, ఎఫ్ సి బార్సిలోనాతో), అత్యధిక గోల్స్ (474), హ్యాట్రిక్‌లు (36) మరియు లా లిగా(స్పెయిన్ యొక్క జాతీయ ఫుట్బాల్ క్రీడావిభాగము )లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డులు (192) ఉన్నాయి. కోపా అమెరికా(సౌత్ అమెరికన్ ఇంటర్-కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ ) లో అత్యధిక మ్యాచ్‌లు (39) ఆడటం, అత్యధిక అసిస్ట్‌లు (18) మరియు అత్యధిక గోల్ భాగస్వామ్యాలు(34) అందజేసిన క్రీడాకారుడు మెస్సి. అదే విధంగా ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడి మరియు గోల్ భాగస్వామ్యాలు (21) అందించాడు.  దక్షిణ అమెరికా పురుషుల విభాగములో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు (189) మరియు అంతర్జాతీయ గోల్‌ల (112) రికార్డు కూడా స్వంతం చేసుకున్నాడు. మెస్సీ ఒక గొప్ప గోల్‌స్కోరర్ మరియు సృజనాత్మక ప్లేమేకర్. క్లబ్ మరియు దేశం కోసం 850 సీనియర్ కెరీర్ గోల్‌లు చేసిన ఆటగాడు.[7][8]

స్పానిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో, మెస్సీ ఎప్పుడూ అర్జెంటీనా తరపున ఆడాడు[9]. క్లబ్ స్థాయిలో, అతను అర్జెంటీనాలోని న్యూవేల్స్ ఓల్డ్ బాయ్స్, స్పెయిన్‌లోని FC బార్సిలోనా, ఫ్రాన్స్‌లోని ప్యారిస్ సెయింట్ జర్మైన్ కు ఆడాడు.[10] ప్రస్తుతం అమెరికా దేశం లోని ఇంటర్‌మియామి తరపున ఆడుతున్నాడు.[11] చాలా కాలం పాటు, మెస్సీ యొక్క ఎడమ-పాదపు  డ్రిబ్లింగ్ ఆట శైలి తన స్వదేశీయుడైన  డియెగో మారడోనాతో పోల్చబడింది. ఫుట్‌బాల్‌లో మెస్సీనె  తన వారసుడని  మారడోనా స్వయంగా ప్రకటించాడు.[12][13]

మెస్సి

ప్రారంభ జీవితం

మార్చు

మెస్సీ 1987 జూన్ 24 న అర్జెంటీనాలోని సాంటా ఫె ప్రాంతపు రాజధాని రోసారియో నగరంలో జన్మించాడు.[14] జార్జి మెస్సి మరియు సెలియా మరియా కుచిట్టిని దంపతులకు తాను మూడవ సంతానము. మెస్సీకి ఇద్దరు అన్నలు రోడ్రిగో మరియు మతియాస్ ఇంకా మారియా సోల్ అనే చెల్లెలు ఉన్నారు. జార్జ్ మెస్సీ ఒక ఉక్కు ఫ్యాక్టరీ మేనేజర్, మరియు అతని భార్య సెలియా కుసిట్టిని మాగ్నెట్ తయారీ వర్క్‌షాప్‌లో పని చేసి కుటుంబాన్ని పోషించేవారు. అతని తండ్రి వైపు, అతను ఇటాలియన్, స్పానిష్ సంతతికి చెందినవాడు. తన పూర్వికులు ఇటలీ మరియు కాటలోనియా యొక్క ఉత్తర కేంద్ర అడ్రియాటిక్ మార్చే ప్రాంతం నుండి వలస వచ్చిన వా మరు. అతని తల్లి వైపు, ప్రధానంగా ఇటాలియన్ పూర్వీకులు ఉన్నారు. [15]ఫుట్‌బాల్‌ను ఇష్టపడే సన్నిహిత కుటుంబం అతని చుట్టూ ఉన్నందున మెస్సీ చిన్నప్పటి నుండి క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. అతని అమ్మమ్మ, సెలియా ఒలివెరా, అతనిని చిన్న వయస్సులోనే ఫుట్‌బాల్ శిక్షణ మరియు మ్యాచ్‌లకు తీసుకెళ్లడం ద్వారా అతన్ని ప్రోత్సహించింది. అమ్మమ్మ ప్రభావం ఎంతటిదంటే, తన పదకొండవ ఏట ఆవిడ చనిపోయినా నేటికీ గోల్ చేసిన తరువాత  ఆకాశం వైపుకు చూసి తన వెళ్ళాను ఆకాశం దిశగా చూపించి ఆ గోల్ ను  అమ్మమ్మకు నివాళిగా అందిస్తాడు.[16][17][15]            నాలుగు సంవత్సరాల వయస్సులో, అతను స్థానిక క్లబ్ గ్రాండోలీలో చేరాడు, అక్కడ తన తండ్రిచే శిక్షణ పొందాడు. ఆ తరువాత ,మెస్సీ ఆరేళ్ల వయసులో రోసారియో క్లబ్ న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్‌లో చేరాడు. అతను న్యూవెల్స్ కోసం ఆడిన ఆరు సంవత్సరాలలో, దాదాపు 500 గోల్స్ చేశాడు. 10 సంవత్సరాల వయస్సులో, అతనికి గ్రోత్ హార్మోన్ లోపం ఉందని డాక్టర్లు నిర్ధారించారు. తండ్రి ఆరోగ్య భీమా అతని గ్రోత్ హార్మోన్ థెరపీ ఖర్చుని రెండు సంవత్సరాలు  మాత్రమే భరించింది. అతని తండ్రి సహాయం కోసం అర్జెంటీనా ఫుట్‌బాల్ క్లబ్‌లు న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ మరియు రివర్ ప్లేట్‌లను సంప్రదించారు, కానీ వారు చికిత్సకు మద్దతు ఇవ్వలేదు. అతని కుటుంబానికి స్పెయిన్‌లోని కాటలోనియాలో బంధువులు ఉన్నందున, వారు FC బార్సిలోనాను సంప్రదించారు. మెస్సీ యొక్క ఫుట్‌బాల్ నైపుణ్యాలను చూసిన తర్వాత, FC బార్సిలోనా చికిత్సకు అంగీకరించింది. ఒక టిష్యూ పేపర్ పై ఒప్పందన్ని రాసుకొని సంతకాలు చేసారు.  ఈ కథ ఎంత ప్రసిద్ధి చెందిందంటే, ఆ తర్వాత వేలంలో టిష్యూ పేపర్ భారీ మొత్తానికి అమ్ముడుపోయింది.[18][19][20]

క్లబ్ కెరీర్

మార్చు

ఫిబ్రవరి 2001లో, మెస్సి కుటుంబం బార్సిలోనాకు మకాం మార్చారు, అక్కడ వారు FC బార్సిలోనా స్టేడియం, క్యాంప్ నౌ సమీపంలోని అపార్ట్మెంట్లొ ఉండేవారు. స్పెయిన్‌లో తన మొదటి సంవత్సరంలో, బదిలీ వివాదాల కారణంగా మెస్సీ చాలా అరుదుగా ఫుట్‌బాల్ ఆడాడు. ఆట సమయం లేకపోవడంతో, అతను జట్టులో కలిసిపోవడానికి చాలా కష్టపడ్డాడు. అతని తల్లి తన సోదరులు మరియు చిన్న చెల్లెలు మరియా సోల్‌తో కలిసి రొసారియోకు తిరిగి వెళ్ళిన తర్వాత అతను తన తండ్రితో కలిసి బార్సిలోనాలోఉండేవాడు.[15]

           బార్సిలోనా యూత్ అకాడమీ, లా మాసియాలో ఒక సంవత్సరం పాటు శిక్షణ తరువాత, మెస్సీ చివరకు ఫిబ్రవరి 2002లో రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (RFEF)లో చేరాడు. అతను ఇప్పుడు అన్ని పోటీలలో పాలుగోనేవాడు మరియు అతని సహచరులతో స్నేహం వల్ల బార్సిలోనా లోని కొత్త జీవితానికీ అలవాటు పడ్డాడు.. అతని గ్రోత్ హార్మోన్ థెరపీ 14 సంవత్సరాల వయస్సులో పూర్తయింది.[15] బార్సిలోనా యొక్క అత్యుత్తమ యువ జట్టు అయిన "బేబీ డ్రీమ్ టీమ్"లో మెస్సీ అంతర్భాగమయ్యాడు[18][21]. మెస్సీ 2003–04 సీజన్‌లో నాలుగు యూత్ టీమ్‌లకు అరంగేట్రం చేసి, బాగా ఆడుతూ వేగంగా క్లబ్ శ్రేణ్ణుల్లొ పురోగతిని కొనసాగించాడు. చాలా మంది సీనియర్ క్లబ్ ఆటగాళ్ళు తమ దేశాలకై  ఆడటానికి వెళ్లడం వల్ల, మెస్సీకి FC బార్సిలోనా యొక్క మొదటి జట్టులో ఆడే అవకాశం కలిగింది. 16 నవంబర్ 2003న జోసే మురిన్యో ఆధ్వర్యంలో ఎఫ్ సి  పోర్టోతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో 75వ నిమిషంలో 16 సంవత్సరాలు, నాలుగు నెలలు 23 రోజుల వయస్కుడైన మెస్సి మొదటి సరిగా ఎఫ్ సి బార్సిలోనా కోసం ఆడాడు[22][23]. అతని ఆటతీరు సాంకేతిక సిబ్బందిని ఆకట్టుకుంది. ఆ తరువాత ఇక అతను మొదటి జట్టుతో ప్రతి వారం శిక్షణ ప్రారంభించాడు. సీనియర్ స్క్వాడ్‌తో అతని మొదటి శిక్షణ తర్వాత, బార్సిలోనా స్టార్ ఆటగాడు రొనాల్డినయో, మెస్సీ నైపుణ్యాలు మెచ్చి తను శాశ్వతంగా సీనియర్ జట్టులోకి ఆడటానికి సహకరించాడు[24]

ఎఫ్ సి బార్సిలోనా (2004–2021).

మార్చు

అక్టోబరు 2004లో, మెస్సీ బార్సిలోనా తరపున ఎస్పాన్యోల్‌తో  జరుగుతున్నా మ్యాచ్ లొ ప్రత్యామ్నాయ ఆటగాడిగా తన క్లబ్ క్రీడా జీవితాన్ని ఆరంభించాడు[25]. అప్పుడు అతనికి  17 సంవత్సరాలు, మూడు నెలలు మరియు 22 రోజులు వయస్సు మాత్రమే[26]. ఆ సీజన్‌లో అతను ఆడిన తొమ్మిది మ్యాచులలో  ఇది మొదటిది, సీజన్ చివరి మ్యాచ్ ఆఖరి  నిమిషంలో క్లబ్ కోసం అతని మొదటి గోల్‌ని చేసాడు. దానికి రొనాల్డిన్హో సహాయమ అందించాడు.[27]

తదుపరి సీజన్‌లో, మెస్సీ తన పౌరసత్వ సమస్య పరిష్కరించబడిన తర్వాత సెప్టెంబర్ 2005లో ఆడటం ప్రారంభించాడు. అతను 25 మ్యాచ్‌లలో ఎనిమిది గోల్‌లు మరియు ఐదు అసిస్ట్‌లు అందించి  తన జట్టుకు వరుసగా రెండో లీగ్ టైటిల్‌ గెలుపులో సహాయపడ్డాడు.  ఆ సీజన్, అతనిని నిరాశకు గురిచేసిన  ఒకే విషయం తన స్నాయువు గాయం కారణంగా అర్సెనల్‌పై ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ విజయంలో పాల్గొనలేకపోయాడు[28]. ఛాంపియన్స్ లీగుకు ఎంపిక చేసిన జట్టులో తన  పేరు ఉండటం వలన మరియు తాను లీగ్ స్టేజి మచిలు ఆడినందుకు గాను ఛాంపియన్స్ లీగ్ పతాకం అతనికి బహుకరించారు.[8]

ఆ 2006 ఛాంపియన్స్ లీగ్ విజయం బార్సిలోనాలో ఒక శకానికి ముగింపు పలికింది. తరువాతి రెండు సంవత్సరాలు కష్టతరంగా ఉండి రాయ్ కార్డ్   తొలగింపుతో  పరాకాష్టకు చేరుకున్నాయి.[29] 2008లో పెప్ గార్డియోలా జట్టు మేనేజర్‌గా నియమితుడయ్యాడు, ఈ నిర్ణయం క్లబ్ చరిత్రను మార్చివేసింది.[30] రొనాల్డిన్హోని ఏ సి మిలాన్ క్లబుకు బదిలీ  చేసి మెస్సీకి జట్టులో ప్రధాన బాధ్యతలు అందిస్తూ నంబర్ 10 షర్టును బహుకరించారు.[31]

2008-09 సీజన్‌లో, అంత అనుకున్నటు  జరిగింది. బార్సిలోనా కోపా డెల్ రే, లా లిగా మరియు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను సాధించడంలో మెస్సీ ఎంతో కీలక పాత్ర పోషించాడు. తను 51 గేమ్‌లలో 38 గోల్స్ మరియు 19 అసిస్ట్‌లను సాధించాడు.[32]మెస్సీ కెరీర్లో ఇది ఒక కీలక మలుపు , ఈ ఏట  తను మొదటి సారిగా ఫాల్స్ నైన్ అనే ఆటగాడిగా బాధ్యతలు చేపట్టి జట్టు విజయానికి తోడ్పడ్డాడు [15]. ఆ సంవత్సరం తను  మొదటి బాలన్ డి'ఓర్ పురస్కారాన్ని కూడాగెలుచుకున్నాడు[33].

బార్సిలోనా క్లబ్ చరిత్రలో, మెస్సీ మరియు గార్డియోలా కలయిక సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆటలో స్ట్రైకర్ పాత్రను కలిగి ఉన్న ఆటగాడికి ముప్పై-ఎనిమిది గోల్‌లు ఆశ్చర్యకరమైన సంఖ్యగా అనిపిస్తాయి, అయితే గోల్-స్కోరర్ కంటే మెస్సీ చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది. అలాంటి పాత్రను పోషిస్తూ తను తదుపరి 10 సీజన్లలో ప్రతిదానిలో అంతకంటే  ఎక్కువ గోల్స్ స్కోర్ చేసాడనే విషయం మరింత ఆశ్చర్యకరమైనది. మెస్సీ మరియు పెప్ గార్డియోలా కలిసి వారి 4 సీజన్లలో 14 ట్రోఫీలను గెలుచుకున్నారు[34]. ఈ సమయంలో, మెస్సీ అద్భుతమైన రికార్డులు సాధించాడు. మెస్సీ 3 బాలన్ డి'ఓర్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఎఫ్‌సి బార్సిలోనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా  రికార్డును సృష్టించాడు[35]. 2012లో, పెప్ గార్డియోలా F C బార్సిలోనాకు మేనేజర్‌ బాధ్యతలకు రాజీనామా చేశారు.[36]

పెప్ గార్డియోలా పదవీకాలం తర్వాత, 2012-2014 FC బార్సిలోనా జట్టు ట్రోఫీలను గెలవకపోవడంతో స్వల్పకాలంలోనే మేనేజర్‌లను మారుస్తూ వచ్చింది. అయితే, ఆ సమయంలో, లియోనెల్ మెస్సీ జట్టుకు కీలకమైన ఆటగాడిగా మారా డు. ఒక ఆటగాడిపై సుదీర్ఘంగా ఆధారపడటం మూలాన మెస్సీ ఆటతీరును ప్రభావితం చేసింది మరియు అనేక గాయాలకు దారితీసింది.[37] 2014 సీజన్ ముగిసే సమయానికి, బార్సిలాన అన్ని పోటీలలో ఓడిపోయింది. గత ఐదేళ్లలో ఇది మొదటిసారి జరిగింది.[38]

           మెస్సీపై ఈ బాధ్యతని తగ్గించడానికి, ఇద్దరు కొత్త ఆటగాళ్ళు, నెయ్మార్ జూనియర్  మరియు లూయిస్ సువారేజ్ లను జట్టులోకి చేర్చారు. లూయిస్ ఎన్రికేను జట్టుకు కొత్త మేనేజర్‌గా నియమించారు.[39][40][41] 2014 నుండి 2017 మధ్యకాలంలో నెయ్మార్, సువారేజ్ తో కలిసి మెస్సీ ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కలిసి మూడు సీజన్లలో మొత్తం 363 గోల్స్ చేశారు[42]. కోచ్ లూయిస్ ఎన్రికే నిర్వహణలో, వారు 3 సంవత్సరాలలో మొత్తం తొమ్మిది ట్రోఫీలను కూడా గెలుచుకు న్నారు.  [43]2017 సీజన్ చివరిలో. లూయిస్ ఎన్రికే నెయ్మార్ జూనియర్ లు క్లబ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు.[44]

2017 నుండి 2021 మధ్యకాలంలో బార్సిలోనా జట్టులో చాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో కొందరు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. జట్టు కెప్టెన్ గ బాధ్యతలు చెప్పటి  జట్టులో కొత్తవాళ్లకు తగిన సహకారం అందించాడు[45]. మ్యాచుల్లో మరింత కీలక పాత్ర పోషించి గోల్స్ చేస్తూ జట్టు విజయానికి తోడ్పడ్డాడు. క్లబ్ ఆర్ధిక పరిస్థితుల కారణంగా 2021లో తను పారిస్ సెయింట్ జెర్మైన్ క్లబ్ కు మారాడు.[46][47] ఇది విషాదకరమైన నిష్క్రమణ అయినప్పటికీ, బార్సిలోనాతో మెస్సీ చరిత్రలో గొప్ప ఆటగాడిగా నిలిచాడు.[48][49]

పారిస్ సెయింట్ జెర్మైన్(2021-2023)

మార్చు

PSGలో, అతను నెయ్మార్ జూనియర్ మరియు కిలియన్ ఎంబాపే తో కలిసి రెండు సీజన్లు ఫ్రెంచ్ లీగ్ లో ఆడాడు[50][51] అతను ఈ స్టార్ ప్లేయర్‌లతో కలిసి పారిస్‌లో 3 ట్రోఫీలను గెలుచుకున్నాడు.[52]  పారిస్‌లో అతని సాధించిన గొప్ప విజయం ఏమిటంటే, డిసెంబర్ 18, 2022 న తన దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలనే చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. [53]

ఇంటర్‌మియామి (2021-2023)
మార్చు

2023 సీజన్ ముగింపులో, అతను అమెరికా దేశంలోని ఇంటర్‌మియామి క్లబ్‌లో ఆడటమో ప్రారంభించాడు.[54] మెస్సి ఇంటర్‌మియామి క్లబ్ తో రెండు ట్రోఫీలను గెలుచుకున్నాడు.[55]

అంతర్జాతీయ క్రీడా జీవితం

మార్చు

మెస్సీ 13 ఏళ్ల నుంచి స్పెయిన్‌లోని కాటలున్యాలో ఉంటున్నాడు కాబట్టి అతను అంతర్జాతీయ స్థాయిలో స్పెయిన్‌ జట్టుకు ఆడే అవకాశాన్ని ఆ దేశపు జాతీయ జట్టు ప్రస్తావించింది.[56] 2008 మరియు 2012 మధ్య స్పెయిన్ రెండు యూరో ట్రోఫీలను  మరియు ఒక ప్రపంచ కప్‌ను గెలుచుకుందని ఇలాంటి జట్టులో చేరి మెస్సీ సునాయాసంగా  తన కలల ట్రోఫీ అయిన వరల్డ్  కప్ గెలుచుకొని  ఉండవచ్చు.[57][58] కానీ, అతను ఆ అవకాశాన్ని తిరస్కరించాడు మరియు అర్జెంటీనాతో అంతర్జాతీయ ట్రోఫీని గెలవాలని ఎప్పుడూ కలలు కన్నాడు.[59]

అతని ఈ  కల అంత సునాయాసంగా తీరలేదు. ఆర్జెంటినా జట్టుతో, వరుసగా 2007 కోపా అమెరికా, 2014 వరల్డ్ కప్ , 2015  కోపా అమెరికా మరియు 2016 కోపా అమెరికా నాలుగు ఫైనల్స్ తను ఓడిపోయాడు. నిరాశతో తాను అంతర్జాతీయ ఆటలకు 2016 లో  వీడ్కోలు పలికాడు. కానీ అతని తోటి దేశస్తుల కోరిక మేరకు తాను మల్లి జట్టులో చేరి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. వరుసగా 2021 కోపా అమెరికా, 2022 వరల్డ్ కప్ మరియు 2024 కోపా అమెరికా గెలిచి తన దేశస్తుల ప్రేమాభిమానాలు పొందాడు.[60]

వీటితొ పటు తాను ఆర్జెంటినా కోసం ఆడి  యూ-20 వరల్డ్ కప్, ఫుట్బాల్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకాన్ని కూడా గెలుచుకున్నాడు.[61][62]

వ్యక్తిగత జీవితం

మార్చు

మెస్సీ ఆంటోనెలా రోకుజోను 30 జూన్ 2017న వారి స్వస్థలమైన రోసారియోలో వివాహం చేసుకున్నాడు.[63] వారికి చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. 2008 లో  వారు ప్రేమించుకుంటున్నట్టు  మరియు బార్సీలోనలో కలిసి ఉంటునట్టు అధికారికంగా తెలిపారు.[64] మెస్సి దంపతులకు  ముగ్గురు కుమారులు. తియాగో మెస్సి (జననం నవంబర్ 2, 2012) మాతెయో మెస్సి (జననం సెప్టెంబర్ 11, 2015) సిరో మెస్సి (జననం మార్చి 10, 2018) [65]. మెస్సీ తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా అతని తల్లి సెలియాతో ఏంటో ప్రేమ.  ఆమె  ముఖాన్ని తన ఎడమ భుజంపై టాటూ వేయించుకున్నాడు. తాను మిగితా కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటాడు. తన వృత్తిపరమైన వ్యవహారాలు ఎక్కువగా కుటుంబ వ్యాపారంగా నిర్వహించబడుతున్నాయి: అతని తండ్రి, జార్జ్,  ఏజెంట్‌గా వ్యవహరిస్తూ తన వ్యాపార విషయాలన్నీ చూసుకుంటాడు. అతని పెద్ద సోదరుడు రోడ్రిగో తన రోజువారీ షెడ్యూల్ మరియు ప్రచారాన్ని నిర్వహిస్తాడు. అతని తల్లి మరియు ఇతర సోదరుడు, మాతియాస్, అతని స్వచ్ఛంద సంస్థ, లియో మెస్సీ ఫౌండేషన్‌ను నిర్వహిస్తారు మరియు రోసారియోలోని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలను చూసుకుంటారు.[15]

మూలాలు

మార్చు
  1. Bharat, E. T. V. (2021-06-24). "Messi Birthday: టిష్యూ పేపర్​పైనే కాంట్రాక్టు సంతకం!". ETV Bharat News. Retrieved 2024-10-28. {{cite web}}: zero width space character in |title= at position 29 (help)
  2. Bharat, E. T. V. (2023-10-31). "Ballon D'Or Award Messi : బెస్ట్​ ఫుట్‌బాలర్​గా మెస్సీకి ప్రతిష్టాత్మక అవార్డ్​.. రికార్డ్​ స్థాయిలో ఏకంగా 8వ సారి". ETV Bharat News. Retrieved 2024-10-28. {{cite web}}: zero width space character in |title= at position 33 (help)
  3. S, Hari Prasad. "FIFA Best Player Lionel Messi: ఫిఫా బెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ". Hindustantimes Telugu. Retrieved 2024-10-28.
  4. Desk, News (2020-12-15). "Messi, Ronaldo, Maradona & Pele In Ballon D'Or Dream Team". TeluguStop.com. Retrieved 2024-10-28. {{cite web}}: |first= has generic name (help)
  5. Indo Asian News Service, Indo Asian News Service (Oct 17, 2019). "Lionel Messi wins sixth Golden Shoe award". hindustantimes. Retrieved 29th Oct 2024. {{cite news}}: Check date values in: |access-date= (help)
  6. AP (2024-10-03). "Messi scores twice for Inter Miami to win his 46th career trophy —MLS Supporters Shield". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-28.
  7. UEFA.com. "-lionel-messi-what-records-does-he-hold/". UEFA.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-28.
  8. 8.0 8.1 Fifa.com, Fifa (28/12/2024). "/the-world-cup-the-best-and-all-of-lionel-messis-trophy-wins". {{cite journal}}: Check date values in: |date= (help); Cite journal requires |journal= (help)
  9. world soccer, world soccer (26 September 2005 / 15:40 BST). "world soccer". worldsoccer.com. Retrieved 28 october 2024. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  10. telugu, NT News (2023-06-24). "Lionel Messi | పీఎస్‌జీ క్ల‌బ్ వాతావ‌ర‌ణంలో ఇమ‌డ‌లేక‌పోయా.. మెస్సీ షాకింగ్ కామెంట్స్". www.ntnews.com. Retrieved 2024-10-28.
  11. Agastya (2023-07-22). "Leo Messi-InterMiami: చివరి నిమిషంలో మెస్సీ మ్యాజికల్ ఫ్రీకిక్ గోల్". www.tv5news.in. Retrieved 2024-10-28.
  12. "Fifa World Cup final: A look at Lionel Messi's legacy and comparisons to the late great Maradona". The Indian Express (in ఇంగ్లీష్). 2022-12-18. Retrieved 2024-10-28.
  13. Adams, TOm (Access date : 28th oct 2024). "Maradona: Messi is my successor". Skysports. Retrieved Access date : 28th oct 2024. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  14. "Buckee, His Honour Henry Thomas, (14 June 1913–8 July 1989)", Who Was Who, Oxford University Press, 2007-12-01, retrieved 2024-10-28
  15. 15.0 15.1 15.2 15.3 15.4 15.5 Balagué,, Guillem (2013). Messi : the biography. Orion Books. pp. 31, 143, 570. ISBN 978-1-4091-4659-9.. {{cite book}}: Check |isbn= value: invalid character (help)CS1 maint: extra punctuation (link)
  16. "Clay, His Honour John Lionel, (31 Jan. 1918–29 March 2008), a Circuit Judge, 1977–88", Who Was Who, Oxford University Press, 2007-12-01, retrieved 2024-10-28
  17. "Lionel Messi: Magic in his feet". The Independent (in ఇంగ్లీష్). 2010-03-27. Retrieved 2024-10-28.
  18. 18.0 18.1 Caioli,, Luca ((2012)). . Messi: The Inside Story of the Boy Who Became a Legend. Corinthian Books. ISBN ISBN 978-1-906850-40-1.. {{cite book}}: Check |isbn= value: invalid character (help); Check date values in: |year= (help)CS1 maint: extra punctuation (link)
  19. "OTL: Lionel Messi, Here & Gone". ESPN.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-28.
  20. AP (2024-02-03). "Napkin with Lionel Messi's first Barcelona contract up for auction". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-28.
  21. "Fabregas, Messi, Pique: Class of 2002". The Independent (in ఇంగ్లీష్). 2010-03-27. Retrieved 2024-10-28.
  22. Lowe, Sid (2014-10-15). "Lionel Messi: how Argentinian teenager signed for Barcelona on a serviette". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2024-10-28.
  23. Corrigan, Dermot (15 November 2013). "Messi Reflects on Debut 10 Years On". ESPN. Retrieved 19 July 2015
  24. Hunter,, Graham ((2012)). . Barça: The Making of the Greatest Team in the World. BackPage Press. ISBN 978-0-9564971-8-5.. {{cite book}}: Check |isbn= value: invalid character (help); Check date values in: |year= (help)CS1 maint: extra punctuation (link)
  25. Lowe, Sid (2014-10-15). "Lionel Messi: how Argentinian teenager signed for Barcelona on a serviette". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2024-10-28.
  26. Lowe, Sid (2014-10-15). "Lionel Messi: how Argentinian teenager signed for Barcelona on a serviette". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2024-10-28.
  27. Richman, Darren. "Lionel Messi: The life and times of the Barcelona, Paris Saint-Germain, Inter Miami and Argentina legend". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2024-10-28.
  28. "lionel-messi-has-admitted-he-deeply-regrets-missing-barcelonas-champions-league-final-celebrations-i_sto8656843/story.shtml". www.eurosport.com. Retrieved 2024-10-28.
  29. "rijkaard-to-blame-for-barca-decline-ingla".
  30. "How Pep Guardiola's 2008 Barcelona appointment changed football forever".
  31. "Why does Messi wear No.10 shirt at Barcelona? | Goal.com India". www.goal.com (in Indian English). 2020-09-01. Retrieved 2024-10-28.
  32. Jugadors, F. C. B. "Lionel Andrés Messi Cuccitini stats | FC Barcelona Players". FCB Jugadors (in ఇంగ్లీష్). Retrieved 2024-10-28.
  33. "Ten years since Leo Messi's first Ballon d'Or". www.fcbarcelona.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-28.
  34. Reuters, Reuters (June 11, 2023 2:59 AM GMT+5:30). "trophies-won-by-pep-guardiola". Reuters. Retrieved 29 October 2024. {{cite web}}: |last= has generic name (help); Check date values in: |date= (help)
  35. "Lionel Messi as dominant as Michael Jordan, claims Barcelona's Pep Guardiola, after he breaks goal record". The Telegraph (in ఇంగ్లీష్). 2012-03-21. Retrieved 2024-10-28.
  36. "The real reason why Guardiola left Barcelona | Goal.com India". www.goal.com (in Indian English). 2014-10-17. Retrieved 2024-10-28.
  37. Caioli, Luca (2015). Messi: More than a Superstar. Icon Books. ISBN 978-1-906850-91-3.
  38. "Messi: I had a lot of problems in 2013-14". ESPN.com (in ఇంగ్లీష్). 2015-02-19. Retrieved 2024-10-29.
  39. "FC Barcelona and Liverpool FC have reached an agreement for the transfer of Luis Suárez". www.fcbarcelona.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  40. "Barcelona appoint Luis Enrique as first-team coach". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2014-05-19. Retrieved 2024-10-29.
  41. "Brazilian striker Neymar to sign with Barcelona". France 24 (in ఇంగ్లీష్). 2013-05-26. Retrieved 2024-10-29.
  42. "The astonishing stats behind the best attacking trio in the world". www.besoccer.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  43. "Luis Enrique, nine titles in three seasons with FC Barcelona". www.fcbarcelona.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  44. Aarons, Ed (2017-03-01). "Luis Enrique announces he will leave Barcelona at end of season". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2024-10-29.
  45. Sport (2018-04-25). "Lionel Messi will be Barcelona's next captain". sport (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  46. "Messi officially becomes a free agent as superstar's Barcelona contract expires | Goal.com India". www.goal.com (in Indian English). 2021-06-30. Retrieved 2024-10-29.
  47. "lionel-messi-barcelona-forward-agrees-contract-extension-with-50-per-cent-pay-cut".
  48. Sanderson, Tom. "Lionel Messi Says Goodbye To FC Barelona At Tearful Press Conference". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  49. "20 years since Leo Messi debuted for FC Barcelona". www.fcbarcelona.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  50. Bubel, Jennifer (2021-08-12). "Messi, Neymar, Mbappe - a trio to dominate Europe". AS USA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  51. "Champions League: How Neymar, Mbappe & Messi are finally thriving at PSG". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-09-06. Retrieved 2024-10-29.
  52. "Lionel Messi trophies: What titles, honours has Argentina legend won for club and country? | Sporting News India". www.sportingnews.com (in Indian English). 2024-10-03. Retrieved 2024-10-29.
  53. "Messi wins World Cup, Argentina beats France on penalties". AP News (in ఇంగ్లీష్). 2022-12-18. Retrieved 2024-10-29.
  54. "Lionel Messi announces he will join Inter Miami" (in ఇంగ్లీష్). 2023-06-07. Retrieved 2024-10-29.
  55. AFP (2024-10-03). "Lionel Messi wins second title with Inter Miami as it beats Columbus to lift MLS Supporters Shield". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  56. "the-burden-of-being-messi.html".
  57. "why-lionel-messi-couldve-played-for-spain-or-italy-over-argentina/".
  58. "'The Spanish Football Federation tried to call Messi up'| All Football". AllfootballOfficial (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  59. "My biggest dream is to win a title with Argentina: Lionel Messi". Inshorts - Stay Informed (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  60. Agencies (2024-07-11). "A flashback to Messi's nine finals with Argentina". The Daily Star (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  61. "lionel-messi-olympic-gold-medal-beijing-2008-final-football-barcelona".
  62. "when-maradona-and-messi-ruled-the-fifa-u-20-world-cup".
  63. "వైభవంగా మెస్సీ వివాహ వేడుక | argentina football player lionel messi marries antonella roccuzzo | Sakshi". www.sakshi.com. Retrieved 2024-10-29.
  64. Francombe, Amy (2022-12-19). "Antonela Roccuzzo — the first lady of Argentinean football". The Standard (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.
  65. "Lionel Messi's 3 Kids: All About Mateo, Thiago and Ciro". People.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-29.