లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్

లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ (1837 నవంబరు 18 - 1901 మే 1) న్యూయార్క్ లో జన్మించాడు, ఇతను కేశనాళిక ఫీడ్ ఫౌంటెన్ పెన్ యొక్క ఆవిష్కర్త, వాటర్మాన్ పెన్ కంపెనీ వ్యవస్థాపకుడు. లెవీస్ ఎడ్సన్ వాటర్మాన్ తన కొత్త ఫీడర్ ఆవిష్కరణతో 1883 లో న్యూయార్క్ లో తన కంపెనీ స్థాపించాడు.

లెవీస్ ఎడ్సన్ వాటర్మాన్
వాటర్‌మన్ ఫౌంటెయిన్ పెన్, 1884 ఫిబ్రవరి 12న పేటేంట్ హక్కు పొందింది

ఎడ్సన్ తండ్రి ఎలిషా వాటర్‌మన్. ఎలిషా వ్యాగన్ లను తయారు చేసి అమ్మేవాడు. ఎడ్సిన్ చదువుకుంటున్నపుడే తండ్రి మరణించంతో తను కష్టాలు ఎదుర్కొన్నాడు, సెలవులలో కార్పెంటర్ గా పనిచేశాడు. ఆ తరువాత పార్ట్‌టైం టీచర్ గా పనిచేశాడు. పుస్తకాల అమ్మకం, జీవితబీమా పాలసీలు చేయించడం వంటి చాలా పనులు చేశాడు.

ఫౌంటెయిన్ పెన్ ఆవిష్కరణ

మార్చు

ఎడ్సన్ తన ఆశయాలను, పర్యాటక అనుభవాలను గ్రంథస్తం చేయాలనే ఆలోచనతో ఒక మంచి కలం తయారు చేయాలనుకున్నాడు. అప్పటి పెన్నులను మాటిమాటికి సిరాలో ముంచి వ్రాయవలసి వచ్చేది. మాటిమాటికి సిరాలో ముంచకుండా వ్రాయడమెలాగ అనే విధంగా ఆలోచించి ఫౌంటెన్ పెన్నును కనిపెట్టాడు. దానిపై పేటెంట్ హక్కులు పొందాడు. పెన్నుల వ్యాపారం మొదలు పెట్టి తన పరిశోధనలతో నాణ్యమైన, సౌకర్యవంతమైన పెన్నులు తయారుచేశారు.

మూలాలు

మార్చు
  • సాక్షి దినపత్రిక - 06-01-2016 (స్ఫూర్తి - జిల్లా ఎడిసన్ లో)