లైఫ్ అనుభవించు రాజా
లైఫ్ అనుభవించు రాజా 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రాజారెడ్డి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజారెడ్డి కందల నిర్మించిన ఈ సినిమాకు సురేష్ తిరుమూర్ దర్శకత్వం వహించాడు. రవితేజ , శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14, 2020న విడుదలైంది.
లైఫ్ అనుభవించు రాజా | |
---|---|
దర్శకత్వం | సురేష్ తిరుమూర్ |
నిర్మాత | రాజారెడ్డి కందల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రజిని |
సంగీతం | రామ్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 14 ఫిబ్రవరి 2020 |
సినిమా నిడివి | 118 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురాజా (రవితేజ) జీవితంలో సక్సెస్ అవ్వాలనుకొనే అబ్బాయి, కాని అతను ప్రతిచోటా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నిత్య హరతి ( శ్రావణి నిక్కీ) పరిచయం అవుతుంది ఆ పరిచయం ప్రేమ గా మారుతుంది. నిత్య రాజా సరదాగా సాగిపోయా సమయం లో శ్రవణికి పెళ్లి ఫిక్స్ అవుతుంది, ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని శ్రావణి అంటుంది రవి ఎపుడు ఉన్న తన పరిస్థితికి ఇది సారి ఐన నిర్ణయం కాదు అని నిత్య తండ్రి తో మాట్లాడతా అని నిత్య ఇంటికీ వెళ్తాడు. ఈలోపు నిత్య జరగలిసింది జరిగిపోతుంది నిత్య పెళ్లి అవుతుంది , ఆ బాధ భరించలేక లైఫ్ పై విరక్తి చెందిన రాజా సన్యాసం తీసుకొని హిమాలయాల కి వెళ్ళిపోతాడు. అక్కడ శ్రీయ (శృతి శెట్టి) పరిచయం అవుతుంది. హిమాలయాల్లో రాజాకు వచ్చిన ఒక ఆలోచనతో తను కోటీశ్వరుడు అవుతాడు. మరి రాజా నిత్య హారతి ప్రేమను అంగీకరించాడా ? శ్రీయ ఏమయ్యింది ? వీరిద్దరిలో రాజాకు ఎవరు దగ్గరయ్యారు అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- రవితేజ
- శ్రావణి నిక్కీ
- శృతి శెట్టి
- షాని పగడాల
- పవన్ నాగేంద్ర
- సుహాస్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రాజారెడ్డి మూవీ మేకర్స్
- నిర్మాత: రాజారెడ్డి కందల
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేష్ తిరుమూర్
- సంగీతం: రామ్
- సినిమాటోగ్రఫీ: రజిని
- ఎడిటింగ్: సునీల్ మహరాణా
మూలాలు
మార్చు- ↑ Sakshi (31 January 2020). "లైఫ్ అనుభవించు రాజా." Archived from the original on 20 ఆగస్టు 2021. Retrieved 20 August 2021.
- ↑ The Times of India (14 February 2020). "Life Anubhavinchu Raja Movie Review: A pathetic watch". Archived from the original on 20 ఆగస్టు 2021. Retrieved 20 August 2021.