వంచన 2024లో తెలుగులో విడుదలైన ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామా సినిమా.[1] చండీ దుర్గా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ మార్పు నిర్మించిన ఈ సినిమాకు ఉమా మహేష్ మార్పు దర్శకత్వం వహించాడు. ఉమా మహేష్, సూర్య, రాజేంద్ర, ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 2న విడుదల చేసి, నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[2][3]

వంచన
దర్శకత్వంఉమా మహేష్ మార్పు
రచనఉమా మహేష్ మార్పు
నిర్మాతగౌరీ మార్పు
తారాగణంఉమా మహేష్
సూర్య
రాజేంద్ర
ఆర్ కె నాయుడు
సోనీ రెడ్డి
ఛాయాగ్రహణంసతీష్, భాస్కర్
కూర్పుగురుమూర్తి హెగ్డే కాన్నిపల్, నవీన్ హెగ్డే
సంగీతంవిజిత్ కృష్ణ
నిర్మాణ
సంస్థ
చండీ దుర్గా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
8 నవంబరు 2024 (2024-11-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక చర్చి ఫాదర్ చంపబడ్డాడు, పోలీసులు అనుమానంతో ఆయన డ్రైవర్ చలం (శ్రీనివాసరావు) అరెస్ట్ చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి యువ క్రిమినల్ లాయర్ కృష్ణ (ఉమా మహేష్) వస్తాడు. అతను దర్యాప్తు ప్రారంభించినప్పుడు, అతనికి వ్యక్తిగత సంబంధం ఉన్న హంతకుడి గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. చర్చి ఫాదర్‌ని ఎవరు చంపారు? వీటన్నింటి వెనుక కథ ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు
  • ఉమా మహేష్
  • సూర్య
  • రాజేంద్ర
  • ఆర్ కె నాయుడు
  • సోనీ రెడ్డి
  • దివాకర్
  • శ్రీనివాస్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • పాటలు : వరదరాజ్ చిక్కబల్లపుర, అనిరుద్ శాండిల్య మారంరాజ్
  • కో డైరెక్టర్ : నిరంజన్ డి ఎస్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విప్లవ్
  • ఆర్ట్ డైరెక్టర్ : ఈశ్వర్ కురిటి
  • కలరిస్ట్ : ఈబిన్ ఫిలిప్స్
  • అసోసియేట్ డైరెక్టర్ అండ్ టీం: లక్ష్మి వెంకటేష్, ప్రసాద్, తనవరపు, వినోద్ రెడ్డి

మూలాలు

మార్చు
  1. Sakshi (26 October 2024). "కోర్టు రూమ్ డ్రామాతో 'వంచన'". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  2. News18 తెలుగు (26 October 2024). "వంచన మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే..?". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. హెచ్ఎంటీవీ (25 October 2024). "కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామాగా వంచన.. నవంబర్ 8న రిలీజ్‌కు రెడీ". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  4. "Vanchana, a thought-provoking courtroom drama" (in ఇంగ్లీష్). 8 November 2024. Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వంచన&oldid=4360582" నుండి వెలికితీశారు