వంటలు పిండి వంటలు

2005 తెలుగు పుస్తకము


వంటలు - పిండివంటలు మాలతీ చందూర్ రచించిన వంటల పుస్తకం. ఇది మొదటిసారి 1974 లో ముద్రించబడి; ఇప్పటికి 30 ముద్రణలు పూర్తిచేసుకున్న అశేష ప్రజాదరణ పొందిన రచన.

వంటలు పిండి వంటలు
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: మాలతీ చందూర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వంటలు
ప్రచురణ: క్వాలిటీ పబ్లిషర్స్
విడుదల: 2005

మొదట మూడు భాగాలుగా; తర్వాత రెండు భాగాలుగా ప్రకటించబడింది. విడిభాగాల కంటే అన్నీ కలిపి ఒక సమగ్ర సంపుటంగా ఉంటే బాగుంటుందని అన్ని కలిపిన కంబైన్డ్ ఎడిషన్ ప్రచురించారు. ఈ పుస్తకంలోని పాతకాలం నాటి కొలతలు కొలమానాల స్థానంలో కొత్త కొలతలను కొలమానాల్ని ఇచ్చారు.

ఈ పుస్తకంలోని మరో విశేషం వంటల్లో వాడే ప్రతి కూర, వస్తువు గురించి అది మన శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, మనోవికాసానికి, తేజస్సుకు, మన శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచడనికి ఎలా ఉపయోగపడుతున్నదీ వివరించారు.

దీనిలో కొన్ని వందల స్వీట్స్, సేవరీస్, కూరలు, ఊరగాయలు, పచ్చళ్ళు, డ్రింక్స్ గురించి సామాన్యులు సైతం సుళువుగా వారివారి ఇంట్లో తయారుచేసుకోవడానికి అనుకూలంగా వివరించబడ్డాయి.

మూలాలు

మార్చు
  • వంటలు పిండి వంటలు, మాలతీ చందూర్, 30వ ముద్రణ, క్వాలిటీ పబ్లిషర్స్, విజయవాడ, 2005.