తెలుగు వచనములు
(వచనము నుండి దారిమార్పు చెందింది)
తెలుగు భాషలో రెండు వచనములు ఉన్నాయి. అవి ఏకవచనము, బహువచనము.
- ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి వరి, బంగారము, మొదలైనవి.
- బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి పాలు, కందులు, పెసలు, మొదలైనవి.
వచనములు లేదా వచనాలు సంఖ్యలను తెలియజేసేవి.
సంస్కృతంలో వచనములు మూడు విధములుగా ఉన్నాయి.
- ఏకవచనము : ఒక సంఖ్యను తెలియజేసేది "ఏకవచనము".
- ద్వివచనము : రెండు సంఖ్యను తెలియజేసేది "ద్వివచనము".
- బహువచనము : మూడు అంతకు మించి అనంత సంఖ్యలను తెలియజేసేది "బహువచనము"
తెలుగు భాషలో ఏకవచనము, బహువచనములు మాత్రమే ఉన్నాయి.
1. ఏకవచనము - ఒక వస్తువును గురుంచిగాని, ఒకే వ్యక్తిని గురించిగాని చెప్పినచో అది ఏకవచనమగును - పుస్తకము, బల్ల, రామరావు.
2. బహువచనము - రెండుగాని అంతకంటే ఎక్కువ వస్తువులను గురించిగాని, ఇద్దరుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులను గురించిగాని చెప్పినచో అది బహువచనము - పుస్తకములు, బల్లలు, పూలు.
3. నిత్య ఏకవచనము - పంటలు, లోహములు మొదలైనవి నిత్య ఏకవచనములగును - వరి, బియ్యము, ఇనుము, రాగి.
4. నిత్య బహువచనము - ధాన్య వాచక శబ్దములు - కందులు, పెసలు, ఉలవలు.
మూలాలు
మార్చు- తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.