వనం ఝాన్సీ (Vanam Jhansi) మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకురాలు. 1969లో అచ్చంపేటలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేపథ్యమున్న[1] కుటుంబంలో జన్మించిన వనం ఝాన్సీ తొలుత రాష్ట్ర సేవికా సమితి (రాష్ట్రీయ స్వయం సేవక్ మహిళా విభాగం)లో,[2] అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసింది. ఎల్.ఎల్.ఎం. చదివిన ఝాన్సీ కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టారు. భారతీయ జనతా పార్టీలో చేరి మండల ఉపాధ్యక్షురాలిగా, మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా, బిజెపి మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా, మహిళామోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా అంచెలంచెలుగా ఎదిగింది. 1975 జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో జైలుకు కూడా వెళ్ళింది. 1995, 2000లలో జడ్పీటీసి స్థానానికి, 2009 శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసింది. ఫిబ్రవరి 19, 2011 నాడు ఆమనగల్ మండలం కడ్తాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించింది.[3] వనం ఝాన్సీ భర్త చంద్రమౌళి వ్యాపారవేత్త.[4] వీరికి ఇద్దరు కుమారులు.

మూలాలుసవరించు

  1. సాక్షి దినపత్రిక, తేది 20.02.2011
  2. http://www.hindu.com/2011/02/20/stories/2011022052150400.htm
  3. ఈనాడు దినపత్రిక, తేది 20.02.2011
  4. http://timesofindia.indiatimes.com/city/hyderabad/BJP-leader-killed-in-road-mishap/articleshow/7530592.cms