వనజ 2006వ సంవత్సరంలో విడుదలైన చలన చిత్రం. రజనీష్ దోమలపల్లి దీనికి దర్శకత్వం వహించాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో తను రాసిన రచనను ఈ సినిమాగా తీసాడు. ఈ సినిమాలోని పాత్రధారులందరూ కొత్తవారే. 111 నిమిషముల నిడివి గల ఈ చిత్రం పెక్కు ప్రపంచ చలన చిత్రోత్సవాలలో బహుమతులను గెల్చుకుంది.

వనజ
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం రజనీష్ దోమలపల్లి
తారాగణం భూక్యా మమత,
ఊర్మిళ దమ్మన్నగారి,
మరికంటి రామచంద్రయ్య,
గుండిమళ్ళ కృష్ణమ్మ,
కరణ్ సింగ్,
రేణుకుంట భావన,
గార్లపాటి కృష్ణ,
గార్లపాటి ప్రభు
సంగీతం ఇందిరా అంపెరియాని, భాస్కర ఎస్. నారాయణన్
విడుదల తేదీ ఆగష్టు 31 2007
నిడివి 111 నిమిషాలు
అవార్డులు 2007 బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ తొలి చిత్రం
మిగిలినవి వ్యాసంలో...
భాష తెలుగు

పురస్కారములు మార్చు

  • ఉత్తమ తొలి చిత్రం - బెర్లిన్ 07, జర్మనీ
  • ఉత్తమ కథనం - ఐఏఏసి న్యూయార్క్ 06, అమెరికా
  • ప్రత్యేక ప్రసంశ - హాంప్టన్స్ 06,న్యూయార్క్, అమెరికా
  • ప్రిక్స్ సిఐఎఫ్‌‌ఈజె - కైరో బాలల అంతర్జాతీయం 07, ఈజిప్ట్
  • ప్రతేక సభ్యుల ప్రశంస - కైరో బాలల అంతర్జాతీయం 07, ఈజిప్ట్
  • గొల్లపూడి శ్రీనివాస్ స్మారకం - చెన్నై 07, ఇండియా
  • ఉత్తమ చిత్రం - మెంఫిస్ 07, టెన్నేస్సే, అమెరికా
  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం - సాక్రమెన్టో 07, కాలిఫోర్నియా, అమెరికా
  • ఉత్తమ నటి - సాక్రమెన్టో 07, కాలిఫోర్నియా, అమెరికా
  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం (ప్లాటినం రెమీ) - వరల్డ్ ఫెస్ట్ 07, టెక్సాస్, అమెరికా
  • ప్రతేక ప్రశంస - ఐఎఫ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ఏ 07,కాలిఫోర్నియా, అమెరికా
  • సభ్యుల ప్రతేక ప్రశంస - రివర్ రన్ 07, నార్త్ కరోలినా, అమెరికా
  • అచీవ్‌‌మెంట్ - న్యూ పోర్ట్ బీచ్ 07, అమెరికా
  • ఉత్తమ విదేశీ చిత్రం - మెక్సికో అంతర్జాతీయ చిత్రోత్సవం 07
  • మిలోస్ మెకోరెక్ పురస్కారం - జ్లీన్ 07, చెక్ రిపబ్లిక్

బయటి లింకులు మార్చు