వనశ్రీ రావు

కూచిపూడి నృత్యకళాకారిణి, నాట్యగురువు
(వనశ్రీరావు నుండి దారిమార్పు చెందింది)

వనశ్రీ రావు కూచిపూడి నృత్య కళాకారిణి.

వనశ్రీ రావు
జననం (1954-09-16) 1954 సెప్టెంబరు 16 (వయసు 69)
వృత్తికూచిపూడి కళాకారిణి, నాట్యగురువు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కూచిపూడి
జీవిత భాగస్వామివీర్నాల జయరామారావు
పిల్లలు1
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు

విశేషాలు మార్చు

ఈమె 1954, సెప్టెంబరు 16వ తేదీన జన్మించింది.[1] కొత్తఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీనుండి రాజకీయ శాస్త్రం చదివి దానిలో ఎం.ఎ.డిగ్రీని సంపాదించింది. ఈమె వీర్నాల జయరామారావు వద్ద కూచిపూడి నాట్యాన్ని అభ్యసించింది. తరువాత అతడిని వివాహం చేసుకుంది. ఈ జంట సుమారు 30 సంవత్సరాల నుండి అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చింది. తన భర్తతో కలిసి ప్రపంచంలోని 60 దేశాలకు పైగా సందర్శించి అక్కడ కూచిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చింది. దేశ,విదేశాలలో జరిగిన దాదాపు అన్ని ముఖ్యమైన నృత్యోత్సవాలలో ఈ జంట పాల్గొన్నది. తన భర్త స్థాపించిన కూచిపూడి డాన్స్ అకాడమీలో విద్యార్థులకు కూచిపూడి నృత్యశిక్షణను ఇస్తున్నది. కూచిపూడి డాన్స్ అకాడమీ తరఫున న్యూఢిల్లీలో 2005లో "ప్రతిష్ఠిత ఫెస్టివల్" పేరుతో నృత్యోత్సవాలను నిర్వహించింది.

ఈమె 1998లో తన భర్తతో పాటుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి కూచిపూడి నృత్యం విభాగంలో అవార్డును పొందింది. ఈ విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును స్వీకరించిన మొట్టమొదటి తెలుగేతర కళాకారిణి ఈమే. ఇంకా ఈమెకు 1996లో సాహిత్య కళాపరిషత్ అవార్డు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుండి 1989లో జూనియర్ ఫెలోషిప్, 2005లో సీనియర్ ఫెలోషిప్ లభించింది.

ఈమె నాట్యంతో పాటు ఆంగికం పేరుతో ఒక సంస్థను స్థాపించి దానిద్వారా కలంకారీ వస్త్రాలను డిజైన్ జేసి మార్కెట్ చేస్తున్నది.

మూలాలు మార్చు

  1. web master. "ARTISTE'S PROFILE". Centre for Cultural Resources and Training. Ministry of Culture, Government of India. Retrieved 21 May 2021.