వన్య శాస్త్రము

వన్య శాస్త్రము అడవులకు సంబంధించిన ఒక కళ, శాస్త్రము. అడవులు, వాటికి సంబంధించిన సహజ వనరులు, దీనికి సన్నిహితమైన సిల్వీకల్చర్, చెట్లు, అడవుల పెంపకము, పోషణకు సంబంధించిన శాస్త్రము. ఆధునిక వన్య శాస్త్రము సాధారణముగా కలప వాటి ఉత్పత్తులు; జంతువుల సమూహాలు; ప్రకృతిలోని నీటి నాణ్యత నియంత్రణ; టూరిజం; భూమి, గిరిజనుల రక్షణ; ఉద్యోగావకాశాలు;, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ను నియంత్రణ మొదలైనవాటి అనుసంధానము. అడవులు జీవావరణ శాస్త్రములో ఒక ముఖ్యమైన భాగము.

వన్యకారులు ఏమి చేస్తారు?సవరించు

వన్యకారులకు పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలలో, సంరక్షణా సంఘాలు, పట్టణ ఉద్యానవన బోర్డులు, పౌరసంఘాలు, ప్రైవేటు భూస్వాములు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. చారిత్రకంగా వన్యకారులు ఎక్కువగా కలపను కోయటానికి, కొత్త చెట్ల అభివృద్ధికీ ప్రణాళికను తయారుచెయ్యటంలో తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా, వృత్తిపరమైన వన్యకారులు అటవీ యాజమాన్య పథకాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకాలు ఒక నిర్ధిష్టమైన ప్రాంతములో ఉన్న చెట్ల గణాంకాలను, ప్రాంతము యొక్క టోపోలాజికల్ స్వరూప లక్షణాలను, ఆ ప్రాంతంలో వివిధ స్పీసీస్ల వారీగా ఆయా చెట్ల యొక్క విస్తరణ, విస్తృతులను, ఇతర వృక్షసంపదను పరిగణనలోకి తీసుకొని తయారుచేస్తారు. ఈ ప్రణాళికలో రోడ్లు, కల్వర్టులు, మానవ ఆవాసాలకు సామీప్యత, జలవనరుల పరిస్థితి, మృత్తికా నివేదికలను కూడా చేర్చుతారు. చివరిగా, అటవీ యాజమాన్య ప్రణాళికలలో ఈ భూమి యొక్క ప్రొజెక్టెడ్ వినియోగాన్ని, ఆ వాడుకకు సంబంధించిన కాలక్రమణికను కూడా చేర్చుతారు.

చరిత్రసవరించు

పాశ్చాత్య ప్రపంచంలో అడవుల సంరక్షణా విధానాలు ఆయా ప్రాంతాలను పరిపాలించే రాజులు, కులీనులు నియంత్రించే వారు. అంటే ఆ అడవులలో వేటాడే హక్కు వారికే ఉండేది. కానీ రైతులకు వంట చెరకు సేకరించుకోవడానికి, కొయ్యలను సేకరించుకోవడానికి, పశువులను మేపడానికి అనుమతినిచ్చేవారు.

నేటి వన్యశాస్త్రముసవరించు

వన్యశాస్త్ర విద్యసవరించు

వన్య శాస్త్రమును చాలా కాలము ముందునుండే మధ్య ఐరోపాలో భోదిస్తున్నప్పటికినీ, వన్యశాస్త్ర విద్యకు అంకితమైన మొదటి వన్యశాస్త్ర విద్యాలయమును 1787వ సంవత్సరములో జార్జ్‌ హార్టీగ్‌ జర్మనీలోని డిల్లెన్‌బర్గ్‌ వద్ద స్థాపించెను. ఉత్తర అమెరికాలో మొదటిది ఆష్‌విల్ల్‌, ఉత్తర కరోలినా దగ్గర జార్జ్‌ వాండర్బిల్ట్‌, ఆ ప్రాంతములో లాగింగ్‌ (చెట్ల నరికివేత) వలన జరిగిన నష్టమును చూచి వన్యశాస్త్ర విద్యాలయము స్థాపించాడు. దాదాపు తన బిల్ట్‌మోర్‌ ఎస్టేట్‌ భూములు మొత్తము పూర్తిగా 1895నుండి ఖాలీ నేలనుంచి పెద్దపెద్ద వృక్షాలుగా పెరిగిన నిర్వహించబడ్డ అడవే. తొలి ఉత్తర అమెరికా వన్యకారులు పందొమ్మిదవ శతాబ్దమునుండి వన్య శాస్త్రము అభ్యసించుటకు జర్మనీకి వెళ్ళేవారు. కొంతమంది తొలి జర్మనీ వన్యకారులుకూడా ఉత్తర అమెరికా వలస వెళ్ళారు.

ఈ రోజుల్లో, ఒక ఆమోదయోగ్యముగా శిక్షణ పొందిన వన్యకారుడు సాధారణముగా జీవ శాస్త్రము, వృక్ష శాస్త్రము, జన్యు శాస్త్రము, నేల విగ్ఞానము, climatology, hydrology, ఆర్ధిక శాస్త్రములు అభ్యసించి ఉండవలెను. ఇవేకాక basics of sociology, రాజనీతి శాస్త్రము యొక్క పరిజ్ఞానము ఉండడము అనుకూలతగా పరిగణిస్తారు.

వన్యశాస్త్ర సంస్థలుసవరించు

అంతర్జాతీయ వన్యశాస్త్ర విద్యార్ధుల సంఘము ప్రపంచములోని వన్యశాస్త్ర విద్యార్థులందరి సమూహము. వన్యశాస్త్ర విద్యార్థుల యొక్క సాంప్రదాయిక విద్యను ప్రధానముగా extracurricular activities, అనుభవాలు, సమచారము యొక్క మార్పిడి ద్వారా విస్త్రుతమైన, ప్రపంచ వ్యాప్త దృక్పధము కలుగజేసి మెరుగు పరచుటయే వారి ప్రాథమిక లక్ష్యము.

ఇవికూడా చూడండిసవరించు

ఆంధ్ర దేశ వృక్షములు మన వృక్షములు మీట మీద నొక్కండి

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  • Charles H. Stoddard Essentials of Forestry. New York: Ronald Press, 1978.
  • G. Tyler Miller. Resource Conservation and Management. Belmont: Wadsworth Publishing, 1990.
  • Chris Maser. Sustainable Forestry: Philosophy, Science, and Economics. DelRay Beach: St. Lucie Press, 1994.
  • Hammish Kimmins. Balancing Act: Environmental Issues in Forestry. Vancouver: University of British Columbia Press, 1992.
  • Herb Hammond. Seeing the Forest Among the Trees. Winlaw/Vancouver: Polestar Press, 1991.
  • "Forestry" in the Encyclopaedia Brtitannica 16th edition. New York: E.B., 1990.