వయోజన విద్య (పుస్తకం)

వయోజన విద్య గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రచించిన తెలుగు పుస్తకం. దీని మొదటి, రెండవ పుస్తకాల్ని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ వారు 1941, 1953లలో ముద్రించారు.

నేపథ్యం

మార్చు

బడిలో చదువక, చదివినా చదువబ్బక, వ్రాళ్ళు కూడా చేయడానికి రాక, తమ బంధువులకు జాబైనా రాయలేక, లోకపు సంగతులు చదువుకోవడానికి వీలు లేక చిక్కులు పడేవారు పిల్లలైనా పెద్దలైనా తెలుగు లిపి నేర్చుకుని లోకములో తలయెత్తుకొని తిరుగునట్లు తయారుచేయడమే ఈ పుస్తక రచనకు కారణమని రచయిత పుస్తకం ముందుమాటలో తెలియజేసాడు. [1]

రెండో పుస్తకంలోని విషయాలు[2]

మార్చు
  1. చదువుల దేవత
  2. వేమన చెప్పింది వేదం
  3. కడుపులో నీళ్లపీపాలు
  4. ఇంద్రజాలం కాదు, ప్రకృతి చిత్రం
  5. లేపాక్షి నంది
  6. సూర్యుడు లేకపోతే ప్రాణం లేదు
  7. గాంధీ మహాత్ముడు
  8. కైలాసంలో ఈశ్వరుడు
  9. పంచాయతీ అంటే
  10. తాటిపండ్ల కథ
  11. అందరికి నేనవుదు నాకందరగుదురు
  12. నీటి ఆవిరి పనిచేస్తుంది
  13. రైలు టిక్కెట్ల సంబరం
  14. వాననీరా? కాల్వనీరా?
  15. తేలా? దోమా?
  16. చదువెందుకయ్యా?
  17. ముసలమ్మ కథ
  18. ముగ్గుల ముచ్చట
  19. తులసిమొక్క

మూలాలు

మార్చు
  1. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1941). వయోజన విద్య (మొదటి పుస్తకం).
  2. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1953). వయోజన విద్య (రెండవ పుస్తకం).

బాహ్య లంకెలు

మార్చు