వరకట్నం

ఆచారం
(వరకట్న వ్యవస్థ నుండి దారిమార్పు చెందింది)

వరకట్నం అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్థికంగా బలం చేకూర్చడమే వరకట్నం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాచీన సంప్రదాయం కేవలం భారతదేశంలోనే కాక పాకిస్థాన్, గ్రీసు, రోమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఉంటున్నది.దీని వల్ల చాలా మంది పేద వాళ్లు వారి పిల్లలకు పెళ్లి చేయడం కష్టంగా మరది దీనితో వారు వారి పిల్లలు కు చిన్నతనం లోనే పెళ్లి చేసేవారు దీని వలన వరుని కుటుంబీకులు వధువు ని హింసించి ఇంకా ఎక్కువ ధనం మీద ఆశ తో వారి పుట్టీ ఇంటికి పంపించి ధనం తీసుకురమ్మని వారు దీంతో వారు చాలా బాధ పడ వారు

భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఇమాం కుమారుని వివాహంలో వివాహ కట్నంగా సమర్పించిన కానుకలు

చరిత్ర

మార్చు

ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో కన్యాశుల్కం అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లిలకే పెళ్ళి కొడుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. వేదకాలం వచ్చేసరికి మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. పూర్వం సృష్టిధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టబడి డబ్బు సమకూర్చేవారు, స్త్రీలు తమ ఇంటిపట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్యా పిల్లలను పోషించడానికి ఆర్థిక పరిస్థితి సరిపోయేది కాదు. కనుకు ఆడపిల్లను ఇచ్చేవారు అల్లుడికి ఎంతోకంత ధనం ఇచ్చేవారు. ఇలా వరకట్న ఆచారం పుట్టింది. వర కట్నం పురుషుడు సంపాదించే డబ్బుకి కలిస్తే మరింత బలంగా ఉండేది. ఏ కారణం చేతనైనా భర్త చనిపోతే భార్యకు వరకట్నడబ్బైనా రక్షణగా ఉంటుందని కూడా భావన ఉండేది. వరకట్నం దుర్వియోగమయ్యేది కాదు.

నేటి స్థితి

మార్చు

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అధనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, భార్యలు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ సాధికారత అభివృద్ధి పథంలో పయనిస్తున్నా వరకట్న ఆచారం ఇంకా ఉంటూనే ఉంది. అయితే - "జీవన ప్రమాణాలు పెరిగాయి. పురుషుడుకి ఉన్న విద్య ఉద్యోగ అవకాశాలు స్త్రీకి కూడా ఉంటున్నాయి. కాబట్టి కొత్త కాపురం పెట్టడానికి కేవలం భర్త డబ్బేకాకుండా, భార్య కూడా ఎంతోకంత డబ్బు తెచ్చుకోవడం సబబే! ఆస్తి పాస్తులు ఇచ్చేది అబ్బాయి తల్లిదండ్రులే కదా! కాకపోతే భార్యను కట్నం డబ్బు తెచ్చుకోమని వేధించకూడదు! ఇస్తే కాదనకూడదు. కట్నం తీసుకోకపోతే అబ్బాయిలో ఏదో శారీరక లోపముంది అని అనుకుంటారు" అని వాదించేవారు లేకపోలేదు.

విశేషాలు

మార్చు

1983 లో వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతున్నాయి. అత్తింటి వేధింపులు ఉన్న వరకట్న బాధితురాలు తన మెట్టినింటి వారుండే ప్రాంతంతో పాటూ, పుట్టింటి వారుండే ప్రాంతంలోనూ "ఐ.పి.సి 498 ఎ" కేసులను నమోదు చేయవచ్చని సుప్రీం కోర్టుతీర్పునిచ్చింది. సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' ప్రకారం ఏ సాక్ష్యాలు విచారించకుండా భర్త, అత్త మామలను, ఆడపడుచులను 3 సంవత్సరాలు జైల్లో వేయడం జరుగుతుంది. అయితే స్త్రీ సాధికారత వలన సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' భారీ ఎత్తున దుర్వినియోగం అవుతోంది, విడాకుల కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రకారం అమ్మాయి - గృహ హింస, వరకట్నవేధిపులను సాక్ష్యాలతో నిరూపించగలితేనే భర్తకు, అత్త మామలకు, ఆడపడుచులకు శిక్ష పడుతుంది.ఐతే దీన్ని అనువుగా చేసుకోని చాలామంది భర్తలు వారి భార్యలను మానసికంగా చిత్రహింసల కు గురి చేస్తూ పరోక్షంగా వారి పుట్టింటి నుంచి దనాన్ని, రాబట్టుకోవటం చేస్తున్నారు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వరకట్నం&oldid=3494629" నుండి వెలికితీశారు