వరరామచంద్రపురం

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా, వరరామచంద్రపురం మండల గ్రామం

వరరామచంద్రపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, వరరామచంద్రపురం మండల లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది వరరామచంద్రపురం మండల కేంద్రం.రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను.ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[1]

గ్రామంలో జన్మించిన ప్రముఖులుసవరించు

 
కుంజా సత్యవతి: మాజీ శాసన సభ్యురాలు
  • కుంజా సత్యవతి: ఈమె శూలం కృష్ణ, సీతమ్మ దంపతులకు వరరామచంద్రపురంలో 1971, ఆగస్టు 1న జన్మించింది.మాజీ శాసన సభ్యురాలు

మూలాలుసవరించు

  1. "తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి". Archived from the original on 2021-12-26. Retrieved 2014-09-13.

వెలుపలి లింకులుసవరించు