వరుణప్రియ రాగం
వరుణప్రియ రాగము కర్ణాటక సంగీతం లో ఒక రాగము.[1] కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో ఇది 24వ రాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "వీర వసంతం" అని పిలుస్తారు.[2][3][4] వరుణప్రియ రాగానికి జన్య రాగములు లేవు.
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- S R2 G2 M1 P D3 N3 S
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- S N3 D3 P M1 G2 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకళి నిషాధం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 60 వ మేళకర్త రాగమైన నీతివతి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు
మార్చుఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- ఏమని పొగడుదు - త్యాగరాజు కీర్తన
- సమాశ్రయామి సదా -మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- సింగార కుమారీ - కోటేశ్వర అయ్యర్
- వీరవసంత త్యాగరాజ - ముత్తుస్వామి దీక్షితులు (వీరవసంతం రాగంలో)
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras