వర్గం:ఖమ్మం జిల్లా కోటలు
దక్కన్ ప్రాంతంలో ఒక ప్రాచీన జిల్లా ఖమ్మం. ఖమ్మం జిల్లాలో అనేక రాజులు రాచరికాలకు ఆనవాళ్ళుగా ఇప్పటికీ వారి కోటల అవశేషాలున్నాయి. విష్ణుకుండిన రెండవ గోవింద వర్మ పాలనకు ఆనవాళ్ళు నేలకొండపల్లి లో వున్నాయి. ముదిగొండ చాలుక్యులకు ఆ పేరు రావడానికి కారణం ఖమ్మంజిల్లాలోని ముదిగొండ ప్రాంతమే, అనేక సంవత్సరాలు రాజధానిగా వెలుగొందిన ముదిగొండ ప్రాంతం ఇక్కడి ప్రముఖ ప్రాచీన ఆధారం. కల్లూరు ప్రాంతం లోని కనకగిరి కోట, సత్తుపల్లి దగ్గరలో రామచంద్రాపురం దగ్గర్లోని నీలాద్రి మట్టికోట, తుంబూరు ప్రాంతంలో చెన్నకేశవస్వామి ఆలయానికి అనుభందంగా తుంబూరు కోట వున్నాయి.
వర్గం "ఖమ్మం జిల్లా కోటలు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 3 పేజీలలో కింది 3 పేజీలున్నాయి.