వర్గ సమాజం
డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ఉన్నాయి. బూర్జువా వర్గం (ధనవంతుల వర్గం), పెట్టీ బూర్జువా వర్గం (మధ్య తరగతి), ప్రోలెటేరియట్ (కార్మిక వర్గం), లంపెన్ ప్రోలెటేరియట్ (భిక్షకుల, అట్టడుగు పేదల వర్గం). ఫ్రెంచ్ విప్లవ పూర్వపు భూస్వామ్య సమాజంలో మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. అవి భూస్వామ్య వర్గం, కౌలు రైతుల వర్గం, వ్యాపారుల వర్గం. బానిస-యజమానుల సమాజంలో ప్రధాన వర్గాలు రెండు. అవి బానిస వర్గం, యజమాని వర్గం.
వర్గం సమాజపు సంప్రదాయ వ్యవస్థ
మార్చువర్గ సమాజంలో అన్నిటికంటే డబ్బు సంపాదించడం, వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణ: వర్గ సమాజంలో డబ్బున్న వాళ్ళు తమ హోదాకి తగని వారిని పెళ్ళి చేసుకోరు, వారితో స్నేహం చెయ్యరు. అంతస్తులో తేడాలు ఏర్పడితే తమ బంధువులని కూడా వేరుగా చూస్తారు.