వర్జీనియా మ్యాడ్‌సెన్

(వర్జీనియా మ్యాడ్‌సన్ నుండి దారిమార్పు చెందింది)

వర్జీనియా గేల్ మ్యాడ్‌సన్ (ఆంగ్లం: Virginia Gayle Madsen; జననం 1961 సెప్టెంబరు 11) అమెరికన్ నటి, చిత్ర నిర్మాత.[1][2] ఆమె తన స్వస్థలమైన చికాగోలో చిత్రీకరించబడిన క్లాస్ (1983)తో చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆమె లాస్ ఏంజిల్స్‌కు మారిన తర్వాత, దర్శకుడు డేవిడ్ లించ్ ఆమెను సైన్స్ ఫిక్షన్ చిత్రం డూన్ (1984)లో ప్రిన్సెస్ ఇరులన్‌ పాత్రకు ఆమెను ఎన్నుకున్నాడు. ఎలక్ట్రిక్ డ్రీమ్స్ (1984), మోడరన్ గర్ల్స్ (1986), ఫైర్ విత్ ఫైర్ (1986) వంటి విజయవంతమైన టీనేజ్ చిత్రాల శ్రేణిలో ఆమె నటించింది.

వర్జీనియా మాడ్సెన్
ఫిబ్రవరి 2009లో జరిగిన 81వ అకాడమీ అవార్డ్స్ లో వర్జీనియా మ్యాడ్‌సన్
జననం
వర్జీనియా గేల్ మాడ్సెన్

(1961-09-11) 1961 సెప్టెంబరు 11 (వయసు 62)
విద్యన్యూ ట్రైయర్ హై స్కూల్
వృత్తి
  • నటి
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1983–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సైడ్‌వేస్
కాండీమాన్ (1992)
డూన్ (1984)
జీవిత భాగస్వామి
(m. 1989; div. 1992)
భాగస్వామిఆంటోనియో సబ్టో జూనియర్
(1993–1998)
పిల్లలు1
తల్లిదండ్రులు
  • ఎలైన్ మ్యాడ్‌సన్ (తల్లి)
బంధువులు

హార్రర్ చిత్రం కాండీమాన్ (1992)లో హెలెన్ లైల్‌గా నటించినందుకు ఆమె మరింత గుర్తింపు పొందింది. అలెగ్జాండర్ పేన్ రూపొందించిన కామెడీ డ్రామా సైడ్‌వేస్ (2004)లో ఆమె నటనకు, ఉత్తమ సహాయ నటిగా అకాడమీ అవార్డుకు ఎంపికైంది.

టెలివిజన్‌లో, ఆమె కామెడీ డ్రామా సిరీస్ మూన్‌లైటింగ్ (1989), కామెడీ సిరీస్ ఫ్రేసియర్ (1998), పీరియడ్ డ్రామా సిరీస్ అమెరికన్ డ్రీమ్స్ (2002-2003), మర్డర్ మిస్టరీ సిరీస్ మాంక్ (2002-2009)లలో నటించింది. ఫిక్షన్ సిరీస్ ది ఈవెంట్ (2011), సూపర్ నేచురల్ డ్రామా సిరీస్ విచెస్ ఆఫ్ ఈస్ట్ ఎండ్ (2013–2014), పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ డిజిగ్నేటెడ్ సర్వైవర్ (2016–2017)లతో పాటు, డీసి యూనివర్స్ సూపర్ హీరో హర్రర్ సిరీస్ స్వాంప్ థింగ్ (2019)లోనూ ఆమె నటించింది.

మూలాలు మార్చు

  1. "Birthdays". The Modesto Bee. The Associated Press. 2018-09-11. p. 2A. Actress Virginia Madsen is 57.
  2. "Virginia Madsen Facts". Encyclopædia Britannica. Archived from the original on October 29, 2019.