వర్ణకాలు (Pigments) మన శరీరంలో రక్తంలోను, చర్మంలోను, కంటిలోను ఉండే రంగు పదార్ధాలు. ఈ విధమైన పదార్ధాలు ఒక నిర్ధిష్టమైన తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి కిరణాలను మాత్రమే పరావర్తనం చేస్తాయి. ఇవి సొంతంగా కాంతి కిరణాలను ఉత్పత్తిచేయవు. మానవులు కొన్ని రకాల వర్ణకాలను ఇతర పదార్ధాలను రంగువిగా చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల వర్ణకాలు తొందరగా వెలిసిపోతాయి లేదా రంగు మారిపోతాయి. వాణిజ్య అవసరాల కోసం, ఎక్కువగా శాశ్వతంగా ఉండే వర్ణకాలను వాడతారు.

గోవా బజారులో అమ్మకంలోని వర్ణకాలు.


వర్ణకాలను పెయింటింగ్ కోసం, వ్రాయడానికి ఇంకుగా, నూలు మొదలైన దారాలను వస్త్రాలుగా మార్చడానికి, ఆహార పదార్ధాలలో, సౌందర్య సాధనాలలో ఇంకా చాలా విధాలుగా ఉపయోగిస్తున్నారు.


జీవ శాస్త్రములో ఉదాహరణలు

మార్చు

మూలాలు

మార్చు
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=వర్ణకాలు&oldid=864709" నుండి వెలికితీశారు