వల్లంకి తాళం (పుస్తకం)

వల్లంకి తాళం పుస్తకం తెలంగాణ కవి, గోరటి వెంకన్నక రచించారు. ఈ పుస్తకం 2019 నవంబర్ 6న హైదరాబాద్ లో కవుల సమక్షంలో విడుదల చేశారు. అడవి అందాన్ని, ప్రత్యేకతను వల్లంకి తాళం రచనలో కవితాత్మకంగా వివరించారు.వల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[1][2]

వల్లంకి తాళం
కృతికర్త: గోరటి వెంకన్న
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 2019 నవంబర్ 6

రచన నేపథ్యం మార్చు

ఈ పుస్తకంలో రకరకాల చెట్లు, పుట్టలు, సాధు జీవులు, క్రూర జంతువులు, పిట్టలు ఇలా అడవిలోని అణువణువునా తనదైన శైలిలో వర్ణించారు.జిలుగ కల్లు,ఇప్ప పూల బట్టి, ఆది వాసుల మట్టి ఇలా అడవి అందాలు అద్భుతంగా సాగుతుంది. అడవితల్లి ఒడిలోని ప్రతి అంశాన్ని తన వచన కవితలో పొందుపరిచారు. వల్లంకి తాళం పుస్తకం రచించాడని సుమారు నాలుగేళ్ల పట్టింది.32 గేయరూప క‌విత‌ల‌తో వల్లంకి తాళం అనే క‌వితా సంపుటి వెలువ‌డింది.

క‌వితా సంపుటిలోని ఒక గేయం మార్చు

‘గాలి పెదవులు తాకి వెదురు గానాలు

నీలి మబ్బుల జూసి నెమలి నాట్యాలు

వద్ది మద్దెల మీద వల్లంకితాళాలు

ఆటపాటల దరువు కడవి తొలి గురువు’

అందాల తనువెల్ల వంపుకున్న అడవి

అలరించిన తలపించె ఆకు పచ్చని కడలి

నిడివన్నదె లేని నీలి గగనం కింద

పారుటాకుల వలువ పంచుతున్నది సలువ

కావి రంగుతోని కనిపించే కొండలు

పైనవోయె దూది పడవల విడుదులు

గిరిమంద పొదుగులు జారె సెలయేరులు

శిలల నునుపుగ తొలిసె అలల మొనలు’[3]

మూలాలు మార్చు

  1. telugu, 10tv (2021-12-30). "గోరటి వెంకన్న 'వల్లంకి తాళం'లో ఏముంది..?". 10TV (in telugu). Retrieved 2022-01-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) CS1 maint: url-status (link)
  2. "Goreti Venkanna:గోరటి కవితకు జాతీయ ఘనత". EENADU. Retrieved 2022-01-21.
  3. "గోర‌టి వెంక‌న్న వ‌ల్లంకి తాళంలోని కొన్ని గేయాలు." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-30. Retrieved 2022-01-21.

వెలుపల లింకులు మార్చు