వసుధా ధగమ్వర్
డా. వసుధా వసంతి ధగమ్వర్ (डॉ. वसुधा वासंती धगमवार) (1940 ఫిబ్రవరి 29 [1][2] – 2014 ఫిబ్రవరి 12) న్యాయవాది, పండితురాలు, పరిశోధకురాలు, రచయితిృ, కార్యకర్త.[3] ఆమె మల్టిపుల్ యాక్షన్ రీసెర్చ్ గ్రూప్ (Multiple Action Research Group) (MARG) వ్యవస్థాపక డైరెక్టర్.
జననం, విద్యాభ్యాసం
మార్చుఆమె తల్లి గీతా సానే రచయిత్రి, స్త్రీవాది. ఆమె తండ్రి నరసింహ ధగమ్వర్ న్యాయవాది, భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు పాట్నాలో ఎంఏ (ఆంగ్లం) చదివిన తరువాత కొంతకాలం మిరాండా హౌస్ లో ఆంగ్లం బోధించారు.[1] ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రం, రాజకీయాలలో డిగ్రీ, ఇండియన్ లా సొసైటీ లా కాలేజీలో (ILS Law College) న్యాయశాస్త్రం (బ్యాచిలర్ ఆఫ్ లా) చదివింది, తరువాత ఆమె పూణే విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో బోధించింది.[4] SOAS యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి న్యాయ చరిత్రలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదివింది.[1]
కెరీర్
మార్చు1979 సెప్టెంబరు 16న మథురా అత్యాచార కేసుకు సంబంధించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానంకు మథురా ఓపెన్ లెటర్పై (Mathura Open Letter) సంతకం చేసిన నలుగురిలో ఆమె ఒకరు.[5][6] ఇది భారతదేశంలో లైంగిక హింసకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాన్ని ప్రేరేపించడానికి సహాయపడింది.[7] 1980లో ఆమె గిరిజన హక్కులు, చట్టం సమస్యపై మహారాష్ట్రలోని అక్రానీ, అకల్కువాలోని అంతర్గత గిరిజన ప్రాంతంలో పర్యటించి పనిచేశారు. 1982లో అశోక ఫెలోగా ఎన్నికయ్యారు.[3] 1985లో ఆమె ఢిల్లీలో మల్టిపుల్ యాక్షన్ రీసెర్చ్ గ్రూప్ (మార్గ్) ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు, ఇందులో చట్టపరమైన అవగాహన, న్యాయవాద, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రోత్సహించడంపై దృష్టితో వ్యవహించారు.[8] మార్గ్ లో పనిచేస్తున్న సమయంలో, ఆమె సామాజిక కార్యకర్త సుబ్రతా దే, న్యాయవాది నిఖిల్ వర్మలతో "పారిశ్రామిక అభివృద్ధి, స్థానభ్రంశం: కొర్బా ప్రజలు" (Industrial Development and Displacement: The People of Korba) పుస్తకం రచించారు. ఆమె 2005 లో మార్గ్ నుండి పదవీ విరమణ చేశింది.[8][9]జాతీయ మహిళ కమిషన్ యొక్క న్యాయ నిపుణుల కమిటీలో సభ్యురాలిగా, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (Commonwealth Human Rights Initiative) యొక్క కార్యనిర్వాహక సంస్థలో సభ్యురాలిగాను కూడా పనిచేశారు.[4][8][10][11]
చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ఆమె రెండు తరాల స్త్రీవాదులను, ఉద్యమకారులను ప్రభావితం చేసింది.[4][10][12]
మరణానికి ముందు ఆమె తన తల్లి ఆత్మకథను మరాఠీ నుండి ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు.[1][4][10][12] జీవితంలో అవివాహితురాలిగా ఉండడం ఆమె ఎంపిక చేసుకుంది.[12] ఆమె 2014 ఫిబ్రవరి 12 న పూణేలో మరణించారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Ramachandra, Guha. "In memoriam – Vasudha Dhagamwar (1940-2014)". www.india-seminar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-04.
- ↑ "80th Birthday of Dr. Vasudha Vasanti Dhagamwar 29th Feb. 2020". Multiple Action Research Group (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-01. Retrieved 2024-02-06.
- ↑ 3.0 3.1 "Dr. Vasudha Dhagamwar – Oral History Narmada" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-02-06.
- ↑ 4.0 4.1 4.2 4.3 "ADVOCATE VASUDHA DHAGAMWAR - One India One People Foundation" (in ఇంగ్లీష్). 2014-04-01. Retrieved 2024-02-04.
- ↑ (1979) 4 SCC (Jour) 17 An Open Letter to the Chief Justice of India
- ↑ Muralidhar, S. "The Legacy of the Life and Work of Lotika Sarkar". Indian Journal of Gender Studies (in ఇంగ్లీష్). 29 (2): 168–198. doi:10.1177/09746862221082174. ISSN 0971-5215.
- ↑ Dutta, Debolina; Sircar, Oishik (2013). "India's Winter of Discontent: Some Feminist Dilemmas in the Wake of a Rape". Feminist Studies (in ఇంగ్లీష్). 39 (1): 293–306. doi:10.1353/fem.2013.0023. ISSN 2153-3873.
- ↑ 8.0 8.1 8.2 "Activist Vasudha Dhagamwar dies". punemirror.com (in ఇంగ్లీష్). 2014-02-11. Retrieved 2024-02-06.
- ↑ Upendra, Baxi. "In memoriam – Remembering Vasudha". www.india-seminar.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-04.
- ↑ 10.0 10.1 10.2 "India: Advocate Vasudha Dhagamwar (1940-2014), legal activist and academician - Europe Solidaire Sans Frontières". europe-solidaire.org. Retrieved 2024-02-08.
- ↑ "Obituary: Vasudha Dhagamwar (1940 – 2014)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-02-17. Retrieved 2024-02-06.
- ↑ 12.0 12.1 12.2 "Obituary: Vasudha Dhagamwar (1940 – 2014)" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-02-17. Retrieved 2024-02-06.