వస్త్ర నమూనాలు
వస్త్రాల పై వివిధ రంగుల నమూనాలు ఉంటాయి. ఇవి స్త్రీ పురుషులకి వేర్వేరు విధంగా, లేక ఒకే విధంగా ఉండవచ్చును. వీటిలో కొన్ని సాంప్రదాయికాలు కాగా కొన్ని అసాంప్రదాయికాలు.
వివిధ నమూనాలు
మార్చు- పోల్కా డాట్: సమదూరంలో చుక్కలు
- స్ట్రైప్: చారలు
- పిన్ స్ట్రైప్: అతి సన్నని చారలు
- టాట్టర్సాల్: చారల వలన ఏర్పడే గడులు
- చెక్: గడులు
- హెరింగ్ బోన్: వంకరటింకర (వి ఆకారంలో గల) చారలు
- అర్జైల్: గడులు చారల కలయిక
- పెయిస్లీ: మామిది పిందెలు
పోల్కా డాట్స్
మార్చుపోల్కా డాట్ పాటర్న్ లో వస్త్రము పూర్తిగా వృత్తాలతో నిండి ఉంటుంది. వా వృత్తాలు ఒకే పరిమాణంతో సమాన దూరాలలో ఉంటాయి. ఈ వస్త్రాలు పిల్లలకు,బొమ్మలకు,ఫర్నిచర్ కు ఉపయోగిస్తారు. ఈ పాటర్న్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికి దీనిని ఎక్కువగా స్విమ్ సూట్ గానూ, లింగరీ గాను వాడుతున్నారు. తెలుపు,నలువు వృత్తాలతో కూడి ఉన్న వస్త్రం సాంప్రదాయకంగా ఉంటుంది. 19 వ శతాబ్దంలో ఈ వస్త్ర పాటర్న్ యునైటెడ్ కింగ్ డం లో సాదారణ వస్త్ర విశేషము.
పిన్ స్ట్రైప్స్
మార్చుపిన్ స్ట్రిప్స్ అనే పాటర్న్ లో దళసరిగా ఉన్న చారలు అనేక రంగులలో ఉండవచ్చును. యివి సమాంతరంగా వస్త్రం అంతా వ్యాపించి యుంటాయి. ఈ వస్త్రం తో కూడిన సూట్స్ పురుషుల ఎక్కువగా యిష్టపడతారు. చికాగోలో గల కబ్స్ నందు బేస్ బాల్ క్రీడాకారులు ధరించే యూనిపాం కూడా పిన్ స్త్రిప్స్ తో కూడి ఉంటుంది.
టేటర్సాల్
మార్చుఈ పాటర్న్ గడులతో కూడి ఉంటుంది. ఈ పాటర్న్ లో అడ్డంగా , నిలువుగా చారలు ఉంటాయి. యిది గడులు గా కనిపిస్తుంది. చతురస్రాకార గడులుగా ఉంటుంది.ఈ చారలు సాధారణంగా వివిధ రంగులతో, ముదురు,లేత బేక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది.[1] ఈ పాటర్న్ 1766 లో లండన్ నందు గల టార్టర్‌సల్ గుర్రాల మార్కెట్ పేరుమీదుగా దీనికి ఆ పేరు వచ్చింది.[2] 1700 లలో ఈ పాటర్న్ ని గుర్రపు బజారులలో అమ్మేవారు. ఈ పాటర్న్ ని గుర్రములకు వాడేవారు.[1] ప్రస్తుతం ఈ పాటర్న్ కాటన్, ప్లానల్ తోనూ నేయబడుతుంది. దీనిని షర్ట్స్,వైస్ట్ కోట్ లకు సాంప్రదాయక షర్ట్స్ కు ఉపయోగిస్తున్నారు.
హెర్రింగ్‌బోన్
మార్చుఈ పాటర్న్ లో వి-ఆకారపు పాటర్న్ లు ఉంటాయి. ఈ ఆకారాలు మామూలుగా, వ్యతిరేకంగా కలసి ఉంతాయి. ఈ పాటర్న్ హెరింగ్ చేప యొక్క అస్థిపంజరం లా అమర్చ వచ్చు కనుక దీనికి "హెర్రింగ్ బోన్" అనే పేరు వచ్చింది.[3] ఈ పాటర్న్ లో సాధారణంగా ఊల్, విశిష్టమైన వస్త్రములతో కూడి ఉంటుంది. దీనిని సూట్స్, బాహ్య దుస్తులకు ఉపయోగిస్తారు.[1]
వివిధ వస్త్ర నమూనాల చిత్రములు
మార్చు-
పోల్కా డాట్
-
పిన్ స్ట్రైప్
-
టాటర్సాల్
-
గడులు
-
హెర్రింగ్ బోన్
-
అర్జైల్
-
కంచి పట్టు చీర పై మామిడి పిందె
వస్త్ర నమూనాలతో కూడిన దుస్తులను ధరించే మోడల్స్ చిత్రాలు
మార్చు-
పోల్కా డాట్స్ తో కూడిన దుస్తులను ధరించే యువతి
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 fitnyc.edu/aspx/Content.aspx?menu=FutureGlobal:Museum The Museum at FIT], Fashion Institute of Technology (2006). "The Tailor's Art, Menswear Fabrics – a Glossary, "Tattersall"". Archived from the original on 2007-06-02. Retrieved 2008-11-24. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "FIT" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Flusser, Alan (1985). Clothes and the Man: the Principles of Fine Men's Dress. New York City: Villard Books. p. 204. ISBN 0-394-54623-7.
- ↑ Ralph Lauren Style Guide; [www.style.polo.com/glossary/default.asp polo.com Glossary], Herringbone, archived from the original on 2011-10-05, retrieved 2008-11-24