వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, దామెరచర్ల మండలం, వాడపల్లి గ్రామంలోని దేవాలయం.[1] అతి పురాతన దేవాలయాల్లో ఒకటైన ఈ మీనాక్షి అగస్త్యేశ్వరాలయం కృష్ణా నది, ముచికుందా నదుల సంగమ ప్రదేశం వద్ద ఉంది. దేశసంచారంలో భాగంగా కృష్ణా, ముచికందా సంగమ ప్రదేశానికి వచ్చి, దీనిని గొప్ప దివ్యస్థలంగా గుర్తించిన అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడని చరిత్ర చెబుతోంది.[2] ఇక్కడికి సమీపంలోనే వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం ఉంది.
వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నల్లగొండ జిల్లా |
ప్రదేశం: | వాడపల్లి, దామెరచర్ల మండలం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయ, ఇక్ష్వాకులు |
నిర్మాణం
మార్చులక్ష్మీనరసింహస్వామి పురాతన దేవాలయాన్ని 13వ శతాబ్దంలో అనవేమారెడ్డి – భీమారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పునర్నిర్మాణంచేసి, నిత్య దీపాధూప నైవేద్యాలు జరిగేలా చేశారని దేవాలయ ప్రాంగణంలోని శాసనాల ఆధారంగా తెలుస్తోంది.[3] ముఖమండపం దాటిన తరువాత స్వామికి అభిముఖంగా ఏడడుగుల దాసాంజనేయ విగ్రహం ప్రతిష్ఠించబడింది. దేవాలయానికి కుడివైపు గరుత్మంతుడు, నాగశిలలు కూడా ఉన్నాయి. ముఖమండపానికి అంత్రాలయానికి మధ్యలో రెండుగోడలు సమాంతరంగా నిర్మించి, మధ్యలో మనిషి నడిచి వెళ్ళగలిగేటంత ఖాళీ స్థలం మాత్రమే కన్పిస్తుంది.
ప్రత్యేకత
మార్చుఆ దేవాలయం దక్షిణ ముఖంగా ఉంది. ఈ దేవాలయంలో ఐదున్నర అడుగుల అందమైన శిల్పంలో మలచిన లక్ష్మీనరసింహస్వామి మూర్తి చాలా భారీగా ఉంటుంది. స్వామి తొడమీద అమ్మవారు కూర్చుని వుంటుంది. గర్భగుడిలో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి. కిందవున్న దీపం కదలకుండా నిశ్చలంగా వుంటుంది. పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది. ఆ కదలికకి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు. ఈ దేవాలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారని భక్తుల నమ్మకం.[4]
మూలాలు
మార్చు- ↑ ABN (2021-10-03). "రండి.. చూసొద్దాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-28.
- ↑ "కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 7". TeluguOne Devotional. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-28.
- ↑ telugu, NT News (2022-03-20). "యాదాద్రి కాకుండా తెలంగాణలో ఉన్న నరసింహస్వామి ఆలయాల గురించి తెలుసా". www.ntnews.com. Archived from the original on 2022-11-05. Retrieved 2022-11-28.
- ↑ "కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 7". TeluguOne Devotional. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-28.