వాడుకరి:లోడె శ్రీ యాదవ్/ప్రయోగశాల

నీటికోసం 'కోటి కష్టాలు' చిత్తూరు జిల్లాలోని ప్రజలు నీటికోసం కోటి కష్టాలు పడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలోనూ తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుప్పం మండలం వెండుగంపల్లిలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు నాలుగు నెలల నుండి త్రాగడానికి నీరు లేకపోవడంతో సమీపములోని ఓ రైతుకు చెందిన బోరుభావిని ఆశ్రఇస్తున్నారు. ఆ రైతు దయతలిస్తే తప్ప నీళ్లు పట్టుకోనే పరిస్థితి లేదు. త్రాగునీటి కోసం గ్రామస్థులు ఇంతగా కష్టాలు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ దాహార్తిని తీర్చాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.