వాడుకరి:1tuntu swamy1/ప్రయోగశాల

సాంకేతిక పరిజ్ఞానం - విలువ

మార్చు

సాంకేతిక పరిజ్ఞానం చక్కగా వినియోగించుకోవాలి

మార్చు

అద్భుతం అంటే ప్రపంచం మన అరచేతిలో ఉంటుంది అని చిన్నప్పుడు పెద్దవారు చెప్పేవారు.  అదే ఇప్పుడు మనం వాడే దూరవాణి అంటే మొబైల్ ఫోన్.  పెద్ద టీవీలో బ్లాక్ మరియు వైట్ టీవిలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూసే టప్పుడు బహుశా రిలయన్స్ కప్ మ్యాచ్ అనుకుంటాను అందరు అరే మనచేతిలో చిన్న టీవీ ఉంటే బావుండు అనుకొనే వారు. మరికొందరు వేరే జిల్లాలో రాష్ట్రాలలో దేశాలలో వున్నా వారికీ ఫోన్ చేయడానికి స్టడీ ఇస్టడ్ బూత్ లకి పరిగెత్తే వారు. మరికొందరి బాధ పెద్ద డాక్టర్ని కలవడానికి కొన్ని వందల కిలో మీటర్ ప్రయాణం చేసి వచ్చేసరికి ఆయన వున్నదో లేదో తెలియని పరిస్థితి,  కానీ ప్రస్తుతం అన్ని అందుబాటులో వున్నా కాలం మార్పు, టెక్నాలజీ అనుపయోగ ప్రయోజనాలకు వాడుతున్నారు.  వాటిని సృష్టించిన వారిని తిట్టుకుంటున్నారు, కానీ వాటిని సత్ప్రయోజనాళికి ఉపయోగమౌతాయి. కాలం విలువ తెలియాలి.

లేత వయసు అయిదు సంవత్సరాలు నిండని పిల్లలకి కంటి చూపు సమస్యలు

మార్చు

సాంకేతిక పరిజ్ఞానం చక్కగా వినియోగించుకోవాలి.  పెద్దవారిని చూసి పిల్లలు అనుకరిస్తారు.  చిన్న పిల్లలు ఏడుస్తున్నారని మొబైల్ ఫోన్ లో పాటలు కార్టూన్లు పెట్టి వారి ముందు పెడుతున్నారు,  లేత వయసు అయిదు సంవత్సరాలు నిండని పిల్లలకి కంటి చూపు సమస్యలు ఉత్పన్నమౌతాయి.

వత్తిడి తేకుండా ఇష్టపడి చదవడానికి తోడ్పడాలి

మార్చు

స్కూల్ పిల్లలకి చదువే కాకుండా సామాజిక భాద్యత నేర్పాలి, వారికి సంభాషణ ఎలా మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో తెలియ చేయాలి.  వారి భాష అభివృద్ధికి తల్లి తండ్రి తోడ్పాటు అవసరము. ఉపాధ్యాయులు కూడా 10 /10 మార్కులకి పిల్లలకి వత్తిడి తేకుండా ఇష్టపడి చదవడానికి తోడ్పడాలి.

సమయాన్ని భవిష్యతు నాశనం కాకుండా ఓకే మార్పుతీసుకొని మంచి స్థాయిలో ఉండాలి.

మార్చు

కళా శాల విద్యార్థులు విద్యార్థినులు వారి భవిషయత్తు గురించి తల్లి తండ్రికి చదువు ఉద్యోగం బాధ్యతతో తమ పనులను చేసుకుంటూ మరి ఒకరిపై ఆధారపడకుండా భాద్యతగా ఉండాలి. సమయం విలువ తెలియ చేయాలి, మొబైల్ ఫోన్ అవసరంలేని కంటెంట్లను చూస్తూ సమయాన్ని భవిష్యతు నాశనం కాకుండా ఓకే మార్పుతీసుకొని మంచి స్థాయిలో ఉండాలి. అవసరమైతే స్వంతంగా తమ స్కిల్స్ ఉపయోగించుకొని చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ ఏర్పాటు చేసి మరిఒకరికి ఉద్యోగావకాశాన్నివ్వాలి.

సాంకేతిక పరిజ్ఞానం - రైతు

మార్చు

మనం దుకాణంలో బియ్యం,పప్పులు, ఇతర వాడుకలో వున్నవి తినడానికి కొనుక్కుంటాము. ఒక్క క్షణం ఆలోచిస్తే పండించిన రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో ఊహకి అందనంత ఆలోచనలు వస్తాయి. ఎండకి ఎండి, వర్షానికి తడిసి, చలికి తట్టుకొని పండిస్తారు. క్రిమి కీటకాలు రాకుండా మందులు వాడి పంటల్ని పండించి మార్కెట్లో విక్రయిస్తారు.  ఒక్కొక్కసారి వారికి తగిన పంట చేతికి రాక, వారు పండించిన పంటలు అకాల వాతావరణం మార్పులు వారి జీవితాలని తలక్రిందులు చేస్తాయై.  ఒక్క సారి వారు అనేక కోట్ల విలువైన భూమిని విక్రయిస్తే వారు సుఖపడే అవకాశం వున్నా వారు ఆ భూమిని అమ్మక వ్యవసాయం చేస్తూ అందరికి బియ్యం,పప్పు,కారం,పసుపు,గోధుమలు, మొదలగునవి అందిస్తున్నారంటే వారు ఎంతటి గొప్పవారో చెప్పడానికి విలువ కట్టలేము.వారికి ఉపయోగ పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియ చేయండి.

సాంకేతిక పరిజ్ఞానం - బడి

మార్చు

ప్రస్తుతం వున్నకాలంలో పల్లెటూరులో కూడా ఇంటర్నెట్ సదుపాయం వున్నది. ఈ సాంకేతిక పరిజ్ఞానం తో బడి లేని ఆదివాసుల అడవుల్లో వున్న వారికి కూడా విద్యను జీవితంలో ఎలా ఉండాలో తెలియ చేస్తున్నాయి. మూఢ నమ్మకాలతో వున్న కొందరి జీవితాలలో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన జీవితాన్ని ఎలా మెసులుకోవాలో నేర్పిస్తున్నాయి.

కాలం విలువ తెలుసుకోండి మీ జీవితాలని సరిదిద్దుకోండి

మార్చు

ప్రతిరోజూ మీరు వాడుతున్న కాలం ఒక పుస్తకంలో వ్రాయండి, ఒక వారం తరువాత మీరు విలువైన సమయం, వృధాగా వున్న సమయం గుర్తు పెట్టుకొని మీ విజయానికి నాంది పలకండి. కాలెండర్ 2022  కాలెండర్ 2023 నెల దిగువన తెలియజేయడమైనది.