వాడుకరి:Avasarala Rajasekhar/ప్రయోగశాల

లేవీయకాండం (యాజి ధర్మవిధులు)

పరిచయం

పేరు:

యూదులు ఈ పుస్తకాన్ని మొదటి పదాలయిన “ఆయన పిలిచాడు” అనే పేరుతో పిలిచేవారు (హీబ్రూలో మొదటి పదం అదే). పాత తెలుగు బైబిలు(పరిశుద్ధ గ్రంథం)లో ఉన్న పేరు గ్రీకు తర్జుమాలో ఉన్న పేరు తర్జుమా. ఆ పేరు దేవుని ప్రేరేపణతో వచ్చినది కాదు. ఆదికాండం పరిచయం చూడండి. ఈ పుస్తకాన్ని లేవీయకాండం అనేదానికంటే “యాజి ధర్మవిధులు” అంటేనే బాగుంటుందనిపిస్తుంది.

రచయిత, వ్రాసిన కాలం:

ఆదికాండం పరిచయం చూడండి.

ముఖ్యాంశాలు:

ఒక ముఖ్యాంశం జీవితంలోని ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన అవసరం. దేవుడు పవిత్రుడు. అలాగే ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి. 11:45; 19:2; 20:7 చూడండి. మరో ముఖ్యాంశం బలిద్వారానే దేవుణ్ణి సమీపించడం సాధ్యంగా ఉన్నది. 16:1-17 చూడండి. మనిషి పాపి గనుక ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అవసరం. ఈ పుస్తకమంతా సాదృశ్యాలతో, చిహ్నాలతో, సూచనలతో నిండి ఉన్నది. ఈ సాదృశ్యాలు క్రీస్తువైపు చూపిస్తూ మనుషులకు ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నవి. కొన్ని ముఖ్యమైన పదాలు: “బలి” “అర్పణ అర్పించడం” (నామవాచకం, క్రియాపదాలు దాదాపు 300 సార్లు ఉపయోగించడం జరిగింది). “శుద్ధ” “అశుద్ధ” (130 సార్లకంటే ఎక్కువసార్లు వాడబడ్డాయి), “పవిత్ర” (70 సార్లు వాడినది), “యాజి” లేక “యాజులు” (170 సార్ల కంటే ఎక్కువ వాడినది). యాజులు అంటే ప్రజల పక్షంగా, దేవుని సన్నిధిలో ప్రతినిధులుగా ఉన్నవారు, బలులు అర్పించేవారు, ఆరాధన గుడారంలోనూ ఆలయంలోనూ ఆరాధన విధులు నిర్వహించేవారు.

విషయసూచిక

అయిదు ముఖ్యమైన బలులు లేక అర్పణలు 1:1—7:38

హోమబలి 1:1-17

నైవేద్యం 2:1-16

శాంతి బలి 3:1-17

పాపాలకోసం బలి 4:1—5:13

అపరాధ బలి 5:14—6:7

నిత్యహోమ బలి 6:8-13

వివిధ బలులను గురించి మరిన్ని ఆదేశాలు 6:14—7:38

యాజుల ప్రతిష్ఠ 8:1-36

యాజులు తమ పనిని ఆరంభించడం 9:1-24

నాదాబు, అబీహుల మరణం 10:1-7

యాజులకు ఆదేశాలు 10:8-20

శుద్ధమైనవి, అశుద్ధమైనవి 11:1—15:33

శుద్ధమైన, అశుద్ధమైన ఆహారాలు 11:1-47

పిల్లలను కన్న తరువాత శుద్ధపరచడం 12:1-8

వ్యాధులను గురించిన ఆదేశాలు 13:1-46

బూజును గురించిన ఆదేశాలు 13:47-59

చర్మ వ్యాధులనుండి శుద్ధపరచడం 14:1-32

బూజునుండి శుద్ధపరచడం 14:33-57

శరీర స్రావానికి సంబంధించిన ఆదేశాలు 15:1-33

మహా ప్రాయశ్చిత్త దినం 16:1-34

బలులు అర్పించే స్థలం 17:1-9

రక్తాన్ని తినడం నిషేధం 17:10-14

దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాలు 18:1-30

వేరు వేరు శాసనాలు, చట్టాలు 19:1—20:27

యాజుల పవిత్రత, వారి బాధ్యతలు 21:1—22:23

దేవుడు నియమించిన పవిత్ర కాలాలు లేక పండుగలు 23:1-44

విశ్రాంతి దినం 23:3

పస్కాపండుగ, పొంగని రొట్టెల పండుగ 23:4-8

మొదటి పంటలు 23:9-14

పెంతెకొస్తు పండుగ 23:15-22

బూరలూదే పండుగ 23:23-25

ప్రాయశ్చిత్తం 23:26-32

పర్ణశాలలు 23:33-44

రొట్టెలు, ఆలీవ్ నూనె నిత్యమూ దేవుని సన్నిధిలో ఉండాలి 24:1-9

దేవదూషణకు శిక్ష 24:10-23

విశ్రాంతి సంవత్సరం 25:1-7

మహోత్సవ సంవత్సరం (యాభైయో సంవత్సరం) 25:8-55

విధేయతకు ఆశీర్వచనాలు 26:1-12

అవిధేయతకు శాపాలు 26:13-46

వ్యక్తిగతమైన మరిన్ని ఆదేశాలు 27:1-34