వాడుకరి:Charikonda yrkrao/ప్రయోగశాల
చరికొండ గ్రామ చరిత్ర
(HISTORY OF CHARIKONDA)
HISTORY
OF
CHARIKONDA
BY:
Y.RADHAKRISHNARAO
యారీదా రాధాకృష్ణా రావు.
మార్చుచరికొండ
పుస్తక పరిచయము
చరికొండ మా వూరు.ఇక్కడి ప్రకృతి వనరులు అపారమైనవి.సుమారు ౪౦౦౦ ఎకరాలకు విస్తరించి వున్న అటవీ ప్రాంతము గలా గలా సాగే ఊట్ల నీరు ,కల్లెడ వాగు,చిన్న తరంగాలతో ఒడ్డును తాకుచూ పలుకరించి పులకరింప జేసే గౌరమ్మ చెరువు,కొండలలో దాక్కున్న నాగప్ప చెరువు,పెరుమాళ్ళ కుంటలు మరియు కొత్త చెరువు ఈ గ్రామానికి వ్యవసాయాధారాలు.ఒకవైపు విస్తారమైన తాళ్ళ వనము ఈ గ్రామానికి ఆర్ధిక వనరులు సమకూర్చగా గ్రామానికి ఉత్తరాన నెలకొని వున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి ఆలయము దాని ముందున్న శివాలయము ఆధ్యాత్మికత శోభ ను సమకూర్చింది. గ్రామము చివరనున్న మసీదు ఏనాడు నిర్మించిందో కాని ఈ నాటికి మతానుసారము గా ప్రార్థనలు జరుగుతూనే వున్నాయి.ఇంకా పీర్ల పండుగ సందర్బం లో గ్రామము లో నున్న పీర్ల కొట్టాల ముందు ఆలంలు ఏర్పాటు చేసుకుని గ్రామస్తులందరూ మతాతీతంగా సమైక్యం గా “దూలా ...దూలా” అంటూ పీర్ల నెత్తుకుని గ్రామం లో తిరుగుతూ పండుగ సంబరంగా జరుపుకుంటారు .
చుట్టుపక్కల వున్నశిథిల దేవాలయాలు మనస్సు లో ఒక ప్రశ్నార్థాకాలై సందేహాలను కలిగిస్తున్నాయి,ఈ దేవాలయాలు ఎవరు నిర్మించారు .ఈ శాసనాలు ఎవరు వేయించినారు వీటి చరిత్ర ఏమిటి అని.
ఇంకా గ్రామము లో వున్న చిన్న చిన్న దేవాలయాలు దుర్గమ్మ గుడి,పోచమ్మ గుడి, కోట మైసమ్మ ఇవన్నీ గ్రామస్తుల ఆరాధ్య దైవస్థావరాలు.
వేణు గోపాల స్వామి దేవాలయము పక్క నుండి ముందుకు సాగి పొతే వచ్చే కల్లెడ వాగు శతాబ్దాలుగా నీటి రాపిడి తో నున్న బారిన బండరాళ్ళు , నిశ్శబ్దం నుండి వినిపించే అడవి పక్షుల కిలకిలా రావాలు. ఖిల్లా గుట్ట మీదకు వెళ్ళే మార్గం లో కల దర్గా చెట్లమధ్యనించి పైకి రమ్మ ని స్వాగతిస్తున్నట్టుగా కనబడుతుంది.
ఈ అడవిలో జాన పండ్ల కోసం జానచెట్లను వెతుక తూ తిరిగిన రోజులు నాకింకా జ్ఞాపకమున్నవి.
ఈ అడవిలో చిరుతగండ్లు కూడా ఉండేవి నాచిన్నతనం లో ఊళ్ళోకి వచ్చి పశువులను చంపిన సందర్బాలు కూడా వున్నాయి.
ఇవన్నింటి తో ప్రకృతి శోభ ను సంతరించుకొని సింహం ఆకారం లో విలాసంగా పడుకుని ఊరిని చూస్తూ వున్నా ఆ ఖిల్లా గుట్ట దాని మీది చారిత్రిక ఆనవాళ్ళు సహజ ప్రకృతి వనరులు నన్నీ పుస్తకము వ్రాయడానికి ప్రేరేపించినవి.
ఇక్కడ నేను పుట్టి పెరిగినాను.వ్యవసాయం చేసాను.గ్రామాధికారిగా పని చేసాను.
మా కుటుంబ సభ్యులమంతా ఇక్కడి ప్రజలోతో మమేకమైనాము .ఒకే కుటుంబ సభ్యులుగా తిరిగినాము.ఇక్కడి మనుషులు సహన మూర్తులు.నిజాయతీ పరులు.
కాబట్టి మా చరికొండ గ్రామమంటే నాకు ఎంతో ప్ర్రాణం .
అందుకే నా ఊరిమీద కొంత పరిశోధన చేసి అంతర్జాలములోనూ,బయటి వనరుల వాళ్ళ దొరికిన సమాచారము మరియు గ్రామ యువకుల ముఖపుస్తక పోస్టింగ్స్ లనూ సమీకరించి ఫోటో లను వాటికి సంబంధించిన విషయాలను సేకరించి ఈ చిన్న పుస్తకము నాకు తెలిసిన విషయాలు గ్రామస్తులకు మరియు ముందు తరాల వారికి తెలియాలను సంకల్పము తో వ్రాసినాను.
నన్ను గ్రామ చరిత్ర వ్రాయమని సలహా ఇచ్చి ప్రోత్సహించిన అజ్ఞాత మిత్రులు శ్రీ పల్లెర్ల రామ మోహన రావు గారికి మరియు నా ఈ సంకల్పానికి తమ అమూల్యమైన సలహాలను సమాచారాన్ని అందించిన గ్రామ యువ జనులకు నా వినమ్ర పూర్వక కృతజ్ఞతాభివందనాలు.
ఎంతో శ్రమకోర్చి గ్రామము నకు సంబందించిన అమూల్యమయిన ఫోటో లు పంపిన ఉత్సాహవంతులు శ్రీయుతులు గాదేమోని రామకృష్ణ ,గడ్డం వెంకటేష్,నీలాల శ్రీనివాస్ మరియు భీష్మాచారి గార్లకు ప్రత్యెక అభినందనలు .
రచయిత
తేది:౦౯-౦౯-౨౦౧౭
***
మన చరికొండ గ్రామమిది మాన్యులు పుట్టిన పుణ్య భూమి
మార్చుఈ గ్రామ చరిత్ర గొప్పదనుమానము సుంతయు లేదు
ధాత్రి లో దాగిన పౌరషాగ్ని కిది దర్పణమై కన్పించు
ఈ పురాతన శిథిలాయాలు మరి శాసనముల్ కనరే జనావ ళు ల్
శ్రీ రుక్మిణీ సత్య భామ సమేతులైన వేణుగోపాల స్వామి వారి
దివ్య చరణ సన్నిధి కి ఈ చిన్ని కృతి అంకితము.
చరికొండ గ్రామమందు రుక్మిణీ సత్య భామ సమేతంగా
సదా నిలిచి మము బ్రోచెడి చల్లనైన స్వామి వీవు.
మీ సన్నిధి లోన నిలిచి నీ గుణగణముల పొగడగ
సద్భాగ్యము కలిగే మాకు చాలును ఇది ఈ జన్మకు
మీ కటాక్ష వీక్షణముల మాపై ప్రసరించవయ్య
చల్లగా ఈ పుర ప్రజలను ఎల్లప్పుడూ గావుమయ్య
నీ చల్లని నీడ లోన మేము గడిపెదము కాలము
నీ దయ మాపై వుండిన చాలునయ్య తరియింతుము
ఈ ముల్లోకలముల నేలెడి నీ పాద పద్మములకు
నే భక్తి తో నరపిం చేద నీ చిరు కవితా కుసుమము.
చరికొండ గ్రామ చరిత్ర
“ఇది నా దేశము మీరు సోదరులు నా కిందే ఇహంబున్ పరంబు
ఇది నా కోరికలల్లుకున్న దివి ఇందే పుట్టి జీవించి చెల్వగు చిత్తంబిది
ఈ ధరా రజము లో దొర్లాడి ఈ గాలు లందుదయాశా
వధి నిల్పి ఈ జనని నర్చిం తు న్ పరా దేవిగా...”
(తెలుగు భాషా వికాస ఉద్యమ సమితి వారి భువన విజయం నాటకం లోని పద్యమిది).
ఎవరో అజ్ఞాత కవి ఎంత మనోజ్ఞంగా వ్రాసినాడో ఈ పద్యము.
”జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపీ గరి యపీ “అన్న వాక్యానికి జీవం పోసా రు.
మా చరికొండ గ్రామము పూర్వపు మహబూబ్ నగరం జిల్లా ,కల్వకుర్తి తాలుఖా ,ఆమనగల్ బ్లాక్ లో వుండేది.
ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలమున కు మారింది.
ఉత్తరాన మేడిపల్లి నక్కేర్త
దక్షిణాన నాగిళ్ళ
తూర్పున కోలుకులపల్లి
పడమర్ ముదివెన్ను గ్రామము ల సరిహద్దుకలిగి
చుట్టూ కొండలు కోనలు పచ్చని పంట పొలాలు
నవజీవన సుధా రసమొలికించే నదీ నదమ్ములు జాలులు –
అన్నట్టుగా తూర్పున నాగప్ప చెరువు,
పడమరన గౌరమ్మ చెరువు
ఉత్తరాన ఖిల్లా గుట్ట ,
దక్షిణాన గౌరమ్మ చెరువు కింది ఆయకట్టు పొలాలతో
చాలా అందమయిన ప్రకృతి శోభలతో కళకళ లాడే గ్రామము మా చరికొండ.
గ్రామము లో కల రచ్చబండ, ఉట్ల స్థంబాలు గ్రామా నికి ఒక ఆకర్షణ ఈ రచ్చబండ మీద నే ఆనాటి గ్రామ పెద్దలు కూర్చొని ఎన్నో సమస్యలు పరిష్కరించారు.శ్రీ కృష్ణాష్టమి పండుగ కు అక్కడ దేవాలయము ముందు ఇక్కడ రచ్చబండ దగ్గర కోలాహలంగా ఉట్లు కొట్టి సంబరంగా పండుగ జరుపుకుంటారు.
శ్రీ వేణుగోపాల స్వామి వారు ఉభయ దేవేరులతో రథా రూడు లై ఈ రచ్చబండ మీద నే కొంత తడవు విశ్రాంతి తీసుకుని భక్తి తో గ్రామస్తులందించే కానుకలు మంగళ హారతులు స్వీకరించి తనను తరతరాలుగా భక్తీ శ్రద్దలతో ఆరాధించే గ్రామస్తులను తన భక్తులను ఆశీర్వదించి తిరిగి దేవాలయము చేరుకుంటారు.
అది ఒక అధ్బుత మయిన దృశ్యం ఆనాడు ఊరంతా పండుగే.
రాత్రి ౧౧-౦౦ గంటల ప్రాంతము లో కోవెల నుండి బయలు దేరిన స్వామి వారు ఉభయ దేవేరులతో తిరిగి కోవెల చేరుకోనేసరికి తూర్పు తెల బారుతుంది.ఈ మహోత్సవాల ను ఉత్సాహవంతులైన గ్రామ యువకులు “charikonda”పేరు తో యు ట్యూబ్ లో పొండుపరచినారు ఆసక్తి కలవారు చూసి ఆనందించగలరు.
గ్రామానికి ఉత్తరాన వున్న ఖిల్లా గుట్ట మీద ఒక కోట వుండేది.అది కాలగర్భం లో కలిసి పోయినప్పటికీ ఈ నాటికి శిథిల కుడ్యాలు మిగిలి వున్నాయి .గుమ్మటాలు అనిపిలువబడే 4 కట్టడాలు ఈ నాటికీ ఆనాటి చారత్రిక సాక్ష్యాధారంగా గంభీరంగా నిలిచి వున్నాయి.
ఈ కోట రేచెర్ల పద్మ నాయకుల కాలము నాటిదని శాసనాల ద్వారా తెలియుచున్నది రేచెర్ల పద్మనాయక రాజులూ దేవరకొండ ను రాచకొండ ను రాజధానులుగా చేసుకుని తెలంగాణా ప్రాంతాన్ని పరిపాలించినారు వీరు కాకతీయ సామ్రాజ్యానికి వీర విధేయులుగా ఉండినట్లు చరిత్ర ద్వారా తెలియు చున్నది.
నేను మొదటి సారి ఆ ఖిల్లా గుట్ట ఎక్కి నప్పుడు ఆ గుమ్మటా లలో ఒక పెద్ద ఇత్తడి ఘంట వ్రేలాడుతూ వుండేది.ప్రస్తుతం అది మాయమయ్యింది.
ఆ ఘంట వుండిన చోటు ఇదేనేమో
ఈ గుమ్మటాల లో అనాటి ప్రజలు వాడిన వరిపొట్టు ఇంకా అక్కడ పడి వున్నది.
గుమ్మటాలు దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ బండ రాళ్ళు ,ఆనాటి నివాస గృహాల శిథిల పునాదుల మధ్యనుండి సాగే బాట ఖిల్లా గుట్ట శిఖిరానికి చేరుస్తుంది.అక్కడ ప్రకృతి సిద్దముగా ఏర్పడిన పెద్ద పెద్ద కొండ రాళ్ళు ఎక్కి చూస్తె మనకు కనిపించే దృశ్యం గుట్ట ఎక్కిన అలసటను తీర్చేస్తుంది.మధ్యలో ఒక చోట రెండు పెద్ద పెద్ద బండలు కల్సికలవనట్టు ఒక లోతయిన ఖాళీ స్థలము మనకాలి బాటకు అడ్డు వస్తుంది.దాన్ని తప్పక దాటాలి.దాని లోతు అంతు తెలియని విధంగా వుంటుంది.క్షణం లో దాటేస్తము కాని ఆ ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పోడుచే విధంగా వుంటుంది.
చుట్టూ భూమ్యాకాశాలు కలిసిన మనోహర దృశ్యం కనుచూపు మేర వరకు కనిపించి మనలను ఆనంద పరుస్తుంది.
దూరాన నాగిళ్ళ గ్రామము,కొత్తచెరువుశిఖం,శిద్దాయ భావి, పెద్ద భావి. ,మొండికుంట పొలము, దాగెర తరి పొలము, ఉసిక భావి,చింత భావి,ఇంకాఎన్నో పేర్ల తో ఎన్నెన్నో వ్యవసాయ భావులు వాటికింద పచ్చని తరి పంట పొలాలు ఆనందోద్వేగాలను కలిగిస్తాయి.
ఒకవైపు ఆనాటి రేచర్ల పద్మనాయక రాజులు నిర్మించిన గౌర సముద్రము,దానికే ఇప్పుడు గౌరమ్మ చెరువు అని వాడుక లో వున్నపేరు.రెండు గుట్టలను తాకుతూ నిర్మించ బడిన చెరువు కట్ట
ఈ చెరువు క్రింద సుమారు ఒక 5౦౦ ఎకరాల సాగు వుంటుంది.ఈ చెరువు ఒక్కసారి నిండితే ౩ పంటలకు నీరు అందిస్తుంది.
బోర్లు లేని ఆ కాలములో చుట్టుపక్కల ఒక ౫,౬ గ్రామాలలో బావులలో నీరు పైకి వచ్చి వ్యవసాయాధారము లబించేది .
.
పెద్ద గా వాలుగా వుండే ఈ బండ మీదికి ఔ త్సాహికులయిన యువతీ యువకులు .ది గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ ఆధ్వర్యం లో ఎక్కదేక్కడి నించో వచ్చి తాళ్ల సహాయము తో సాహసముతో పైకి ఎక్కుతుంటారు
ఈ గ్రంథము లోని కొన్ని చిత్రాలు అలా ఇక్కడి వచ్చి కొండను అధిరోహించిన సందర్బం లో తీసి అంతర్జాలం లో పెట్టినవే .ఈ గ్రంథ రచనకు వాడుకోవడం జరిగింది
పాపం కొన్నాళ్ళ క్రంద విహార యాత్రకు హైదరాబాదు నుండి వచ్చిన ౭ గురు ఒకే కుటుంబ సభ్యులు ఈ చెరువులో పది ప్రాణాలు కోల్పోయినారు .
ఈ చెరువు కట్ట సమీపములో ఒక శాసనము వున్నది .నేను ఆ గ్రామాధికారిగా పనిచేయుచున్న కాలం లో (౧౯౮౨-౮౩ ) పురావస్తు శాఖ వారి ని సంప్రదించి పలుమార్లు ఆ శాఖ వారి చుట్టూ తిరిగి తిరిగి ఆ శాసనాన్ని వెలుగు లోకి తీసుక రావడానికి విశేషమయిన కృషి సల్పడం జరిగింది.
నా ప్రయత్నం ఫలించి పురావస్తు శాఖవారు గ్రామాన్ని సందర్శించి ఆ శాసనము ప్రతిని ముద్రించుకుని వెళ్ళినారు.కాని ఖిల్లా గుట్ట మీది శాసనము అలాగే మిగిలి పోయింది.
ఆ తర్వాత దానికి సంభందించిన వివరాలు ఏవీ వెలుగు లోకి రాలేదు.
జీవన ప్రవాహం లో పడి కొట్టుకు పోతున్న సందర్బం లో ఇదొక పెద్ద ముఖ్యమైన విషయంగా అనిపించలేదు.
కాని ముఖతః ఈ శాసనము “రేచెర్ల పద్మనాయక రాజులు ”వేయిన్చినదని తెలిసినది ఆ శాఖ వారిద్వారనే.
ఒక మూడున్నర దశాబ్దాల తరవాత ఒక సందర్భం లో గ్రామ చరిత్ర విషయము చర్చ కు వచ్చి పురావస్తు శాఖ వారి వద్దకు వెళ్లి విచారించగా మా వూరి శాసనము మహబూబ్ నగర్ జిల్లా గెజిట్ లో ప్రచురించ బడ్డ విషయము తెలిసి దాని కాపి తీసుకొనడం జరిగింది.
అందులో వున్నా విషయము ప్రకారము ఈ చెరువు
రేచెర్ల పద్మనాయక ప్రభువయిన రెండవ లింగామనీడు శాలివాహన్ శకము ౧౩౪౯ ప్లవంగ నామ సంవత్సరము ,మార్గశిర మాసము పౌరనమి నాడు సరియగు తేది 4th డిసెంబర్ 1349వ సంవత్సరమున ఆయన భార్య అయిన గౌరీ దేవి పేరున ఆమె అభీష్టము ప్రకారము ఈ చెరువు నిర్మాణము జరిపే నని ఆ శాసనము ద్వారా త్లియు చున్నది. రేచెర్ల పద్మనాయక ప్రభువయిన రెండవ లింగమనాయకుని భార్య గౌరీదేవి శ్రీశైల మల్లి ఖార్జున స్వామికి మరియు తిరుపతి వెంకటేశ్వరస్వామికి విశేషమయిన కానుకలు ఇవ్వడమే గాక భక్తులకు ధర్మ సత్రాలను కూడా కట్టించినదని తెలియుచున్నది.
ఈ చెరువు పూర్తిగా నిండి న తరవాత ఎక్కువయిన నీరు అలుగు ద్వారా పొలాల మీదుగా గొలుసు చేరువయిన కొత్త చెరువు లోకి చేరుకుంటుంది.