వాడుకరి:Chennamanikanteswara/వికీపీడియా

వికీపీడియా


ఉపోద్ఘాతము

మార్చు

వికీపీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరు చదవగలిగిన, వ్రాయగలిగిన ఒక స్వేచ్ఛాయుత అంతర్జాల బహుభాషా విజ్ఞాన సర్వస్వము.వికీపీడియా వికీమీడియా ఫౌండేషన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ద్వారా నడపబడుతోంది.ఈ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం విరాళాల తోనే నడుస్తోంది.ఈ విజ్ఞాన సర్వస్వం లో దేశ విదేశాలలోని విద్యావేత్తలు 287 భాషల్లో మూడు కోట్లకు పైగా వ్యాసాలు వ్రాసారు, ఇంకా వ్రాస్తూ ప్రపంచానికి విగ్నానాన్ని పంచుతున్నారు.

చరిత్ర

మార్చు

జనవరి 15, 2001 న జిమ్మీ వేల్స్, లారి సాంగర్ లు మరికొద్ది మంది ఔత్సాహికులతో కలసి వికీపీడియా ని స్థాపించారు. వికీపీడియా అనే పదం వికీ, ఎన్సైక్లోపీడియా అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. వికి అనగా హవాయి భాష లో 'త్వరగా'. ఎన్సైక్లోపెడియా అనగా విజ్ఞాన సర్వస్వము. అలా వికీపీడియా అంటే త్వరగా తెలుసుకోగల విజ్ఞాన సర్వస్వము అని వ్యుత్పత్యర్థం. తెలుగు భాషలో విజ్ఞాన విస్తరణ కు వారధి అయిన తెలుగు వికీపీడియా ని 2003 డిసెంబరు పడవ తేదిన, బోస్టన్ లో సాంకేతిక నిపుణులు అయిన వెన్న నాగార్జున గారు రూపొందించారు. కాలంతరం లో తెలుగు వికీపీడియా తెవికీ గా ప్రాచుర్యం పొందింది.

వికీ వ్యాసాల ప్రత్యేకతలు

మార్చు
  • వికీపీడియాలో వ్యాసాలు సులువుగా సులభంగా అర్థం చేస్కోగాలగినవి
  • ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యావంతులు వ్రాసినవి.
  • వ్యాసాలలోని లింకుల ద్వారా ఇతర, సంబంధిత వ్యాసాలను ఉపయోగించవచ్చు
  • ప్రతి వ్యాసం లోని వాస్తవాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇవ్వబడతాయి
  • వ్యాసాలను భాగాలుగా విభజించి విషయ సూచికను పొందుపరచటం వలన సులువు గా కావలసిన విషయాన్ని చదువుకొనే వీలుంది.
  • వికీ లోని వ్యాసాల విషయాలను ఎవరైనా వాడుకోవచ్చు
  • ఎప్పుడైనా వికీ లోని వ్యాసాలను తాజాకరింపజేయవచ్చు
  • వ్యాసం లోని చిత్రాల ద్వారా, సులభంగా విషయాన్ని అర్థం చేస్కోవచ్చు

విద్యార్థులకు వికీపీడియా ఉపయోగాలు

మార్చు

వికీపీడియాలోన్ని వ్యాసాలన్నీ ప్రపంచ నలుమూలలా ఉన్న విద్యావంతుల చే వ్రాయబడ్డవి కాబట్టి ప్రపంచమంతా విస్తరించి ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకోగలిగే వీలుంది. ఎవరైనా చదవగలిగేలా సరళమైన భాషలో వ్రాయడం వలన ఆయా శాస్త్రాలలో సిద్ధస్తులు కాకపోయినా అర్థం చేస్కోగాలిగేలా ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్చగలిగే వీలు ఉండడం తో ఆయా శాస్త్రాలలో జరుగుతున్న అభివృద్ధి ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగే వీలుంది.

రీసర్చ్ స్కాలర్స్

మార్చు

వికీపీడియాలో ఆయా వ్యాసాలలో పొందుపరిచిన వాస్తవాలకు సంభందించిన అసలు ఆనవాళ్ళు జతపరచడం చేత ప్రతి వ్యాసం ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఈ ఆనవాళ్ళు రీసర్చ్ స్కాలర్లకు గొప్పగా ఉపయోగపడతాయి. ప్రతి వ్యాసం లోని అదనపు సమాచారం శీర్షిక లో పొందుపరచిన లింకుల వల్ల అంతర్జాలంలోని ఇతర వెబ్ సైట్ ల నుండి సులువు సమాచారం పొందే వీలుంది.

కళాశాల విద్యార్థులకు

మార్చు

కళాశాల విద్యార్థులు వికీపీడియా లేని జీవితాన్ని ఊహించుకోలేరంటే అతిశయోక్తికాదు. సాంకేతిక, వైద్య, వాణిజ్య, అర్థ, రాజనీతి, ఇత్యాది రంగాల విద్యార్థులకు అతి సులువుగా విజ్ఞానాన్ని తెలుసుకునే మార్గం గా వికీపీడియా నిలుస్తోంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్న దానికంటే విశ్లేషణాత్మకంగా వివరణ ఉన్నందున అతి సులువు గా విషయాలను అర్థం చేస్కోవచ్చు. అన్ని రంగాలకు సంబంధించిన విద్యార్థులు ఇతర రంగాలలో అధ్యయనం చేయడం కేవలం వికీపీడియా వల్లే సాధ్యపడుతుంది.

పాఠశాల విద్యార్థులకు

మార్చు

పాఠశాల విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాల్లో ఉన్న విషయాలను చదివి అర్థం కాని వాటిని వికీపీడియా లో సులువు గా అర్థం చేస్కొనే వీలుంది.ఉపాధ్యాయులు వికీ లోని వ్యాసాలు చదివి పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో లేని విషయాలు బోధించవచ్చు. విద్యార్థులు అన్ని రకాల సైన్సు ఫెయిర్ లకు కావలసిన విషయాలు వికీపీడియా నుండి పొందగలరు.

ఇతర సాధనాలు

మార్చు

కేవలం వికీపీడియా మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే వెబ్ సైట్ లను వికిమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది.వాటి లో కొన్ని

వికిసోర్స్

మార్చు

వికీసోర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజ్ఞాన భండాగారాన్ని వికి సోర్స్ ద్వారా పొందవచ్చు. అన్ని భాషల సాహిత్య సంపద ని వికీ సోర్స్ లో పొందుపరిచారు. వేమన శతకం, మొదలైన శతకాలు, రామాయణ భారత కావ్యాలు, పద్య రూపం లో వాటి ప్రతి పదార్థ భావాలతో పొందవచ్చు.