వాడుకరి:Dhupam Abhimanyudu/ప్రయోగశాల

వెలుగోడు

వెలుగోడు పట్టణము నంద్యాల జిల్లా లోని ఒక మండల కేంద్రము. పలనాటి యుద్ధానంతరం బ్రహ్మనాయుడి బంధు వర్గం ఇక్కడ మట్టి కోట కట్టుకుని నివశించారు. వెలివేయబడిన వారు నివశించిన ప్రాంతం కాబట్టి వెలివాడ అని పిలిచారు. ఆ తరువాత వెలివాడ, వెలుగువాడ, వెలుగోడుగా రూపాంతరం చెందింది. విజయనగర సామంతులుగా వెలుగోటి రాజులు పాలన చేశారు. ముస్లిం దండయాత్రలలో వీరు కట్టుకున్న మట్టి కోట ధ్వంసం అయింది. తరువాత మధురను రాజుల ప్రాపకం తో వెంకటగిరి సంస్థానాన్ని సంపాదించుకున్నారు.ఈ రాజులు వెలమ కులస్తులు. వీరే తదనంతర కాలం లో వెంకటగిరి సంస్థానాన్ని పరిపాలించారు. వీరి కులదైవం చెన్నకేశవుడు. వీరు నిర్మించిన చెన్నకేశవ దేవాలయం ఇప్పటికీ వెలుగోడులో వుంది. ధ్వంసం అయిపోయిన దేవాలయాన్ని వెలుగోడు ప్రజలు పునర్నిర్మించారు. ఇప్పటికీ ఈ దేవాలయ ఆవరణ లో ఆ నాటి రాజు యాచమ నాయకుడు వాడిన చలువ బండ వుంది.