వాడుకరి:Edla praveen/జి.వి.రత్నాకర్

డా. జి.వి.రత్నాకర్

మార్చు

జాతీయ దళిత సాహిత్యంలో కేతనం ఎగరేస్తున్న తెలుగు కవి డాక్టర్‌ జి.వి.రత్నాకర్‌. ప్రకాశం జిల్లా కొండెపి అనే కుగ్రామంలో పుట్టి కేంద్రీయ విద్యాలయంలో ఆచార్యుని స్థాయికెదిగిన రత్నాకర్‌ విద్యార్థి దశనుండే ఉద్యమాలు ఎరిగినవాడు; అంబేడ్కరిజాన్ని, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ ఎదిగినవాడు; అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి; హిందీ సాహిత్యంలో ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేసినవాడు. అందుకే ఆయన కవిత రాసినా, కథ రాసినా, వ్యాసం రాసినా, నాటకం రాసినా కాలక్షేపానికి కాక కమిట్‌మెంట్‌తో రాసినట్టు అర్థమవుతూనే ఉంటుంది. కవిగా, అనువాదకునిగా తనదైన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.

విద్యార్థి దశ నుండే దళిత ఉద్యమ నేపథ్యం ఉన్నవాడు

రత్నాకర్‌ దళిత కవి అయినప్పటికీ అభ్యుదయ వాదులైన దళితేతరుల పట్ల వ్యతిరేకతను ఎప్పుడూ ప్రదర్శించలేదు.

రచనలు

1.మట్టి పలక

2.అట్లేటి ఆల

3.అనువాదం చేసిన నేను అంటరానిరాన్ని.

4.జూఠన్

5.ఝాన్సి ఝల్ కారి బా

6.సమతా సైనిక దళ్  ఉద్యమం

రత్నాకర్‌ ఇటీవల చేసిన గొప్పపని బోయి భీమన్న ‘పాలేరు’ నాటకాన్ని హిందీలోకి అనువదించడం. పాలేరు  నాటకరంగ చరిత్రలో ఒక సంచలనం. పాలేరు చదువుకుని కలెక్టర్‌ కావడం పాలేరు నాటకంలోని ఇతివృత్తం. ఆ నాటకాన్ని చూసి పాలేర్లు కలెక్టర్లు అయ్యారంటే నమ్మగలరా! ‘ఎడ్యుకేట్‌’ అనే అంబేడ్కరిజం ప్రాథమిక సూత్రానికి హారతి పట్టింది ఆ నాటకం. అంతటి గొప్ప నాటకాన్ని హిందీలోకి అనువదించి మొత్తం దేశానికి అందించవలసిన బాధ్యతను నెరవేర్చాడు రత్నాకర్‌. ఆయనను బోయి భీమన్న అవార్డు వరించడానికి ఇంతకంటే గొప్ప కారణమేమి కావాలి!