వాడుకరి:Jyothivalaboju/ప్రయోగశాల

సుభాన్ బేకరీ


సుభాన్ బేకరి హైదరాబాదులో ఒక ప్రముఖ బేకరీ. సాంప్రదాయకమైన బ్రెడ్ ఉత్పత్తులను 1950 సంవత్సరం నుండి అందిస్తున్నారు. 1950లో భారతప్రధాని జవహరలాల్ నెహ్రూ హైదరాబాదు వచ్చినప్పుడు వీరే గోధుమ బ్రెడ్ ని అందించారంట.

1951లో సయ్యద్ ఖాదర్ రెడ్ హిల్స్ లో ఒక చిన్న గ్యారేజీలో ఈ బేకరీ ప్రారంభించారు. తర్వాత దాన్ని నాంపల్లి రైల్వేస్టేషను వెనకాలకి మార్చారు. సుభాన్ బేకరీని ఇప్పుడు మూడవ తరం వారు నడిపిస్తున్నారు. మొదట్లో వారు బ్రెడ్ లు, రస్కులు, ఉస్మానియా బిస్కెట్లు మొదలైనవి తయారు చేసినా నేడు దాదాపు 15 రకాల బిస్కెట్లను తయారుచేసి అమ్ముతున్నారు.అందులో ఆరోగ్యకరమైనవి కూడా చాలా ఉన్నాయి. కేకులు, పేస్ట్రీలు, రస్కులు, బిస్కెట్లు మొదలైనవన్నీ కలిపి దాదాపు 60 రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు సుభాన్ బేకరీలో. చాలామంది అమితంగా ఇష్టపడే వీరి ప్రత్యేకతమైన ఉస్మానియా బిస్కెట్స్, దమ్ కా రోట్.

దమ్ కా రోట్ : రంజామ్ సమయంలో హలీమ్ లాగా , మొహర్రం సమయంలో ముస్లీములు తప్పకుండా తినే ప్రత్యేకమైన రొట్టే లేదా కుకీ ఈ దమ్ కా రోట్. ఏదైనా కోరిక తీరినప్పుడు ఈ రొట్టను ఆలమ్ లో విరగ్గొట్టి అందరికీ పంచిపెడతారు. సుభాన్ బేకరీలో ఈ రోట్ గోధుమపిండి, రవ్వ, నూనె, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, వెన్న మొదలైన వస్తువులతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. అందుకే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే తయారుచేసే ఈ రోట్ కోసం చాలామంది సంవత్సరమంతా ఎదురుచూస్తారు.

సుభాన్ బేకరీ సికిందరాబాదు, హైటెక్ సిటీ లో కూడా తమ అనుబంధ శాఖలను త్వరలో ప్రారంభించాలని యోచిస్తున్నారు. సుభాన్ బేకరీ ఉత్పత్తులు వారి వెబ్ సైట్, ఇతర ఆన్లైన్ సదుపాయాల ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు.