ఈ మధ్య నేను బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడు వాటికి లైసెన్సులను జతచేస్తున్నారా లేరా, అనే విషయాన్ని కూడా పరిశీలించగలిగే సామర్ధ్యాన్ని సంపాదించాను. రోజుకొక సారో లేక వారానికొక సారో అప్లోడు స్థాయిని బట్టి అప్పటివరకూ అప్ప్లోడు చేసిన బొమ్మలన్నిటినీ పరిశీలిసూ ఉంటాను. ఏదయినా బొమ్మకు ఉచిత లైసెన్సు ట్యాగును చేర్చకపోతే, వెంటనే ఆ బొమ్మను అప్లోడు చేసిన సభ్యునికి ఒక సారి హెచ్చరించి, బొమ్మ లైసెన్సు వివరాలను ఎలా చేర్చాలో తగిన సలహాలు ఇస్తుంటాను. ప్రస్తుతం నాకున్న ఈ కొత్త సామర్థ్యం ఇంకా పరీక్షా స్థాయిలోనే ఉంది కాబట్టి, అప్పుడప్పుడూ నేను కొన్ని తప్పులు చేయవచ్చు, లైసెన్సులు చేర్చినా హెచ్చరించేస్తుండవచ్చు, లేదా బొమ్మలను ఎక్కించిన వారిని కాకుండా వేరే ఇంకెవరినో హెచ్చరించేస్తూ ఉండవచ్చు, లేదా అసలు హెచ్చరించకుండా కూడా ఉండిపోవచ్చు.

నేను ఎక్కడయినా పొరపాట్లు చేస్తునటులు మీకు కనిపిస్తే ఆ పొరపాటు గురించి వెంటనే, నన్ను నడుపుతున్న ప్రదీపుకు తెలియజేయండి. అది మరీ క్షమించరాని పొరపాటయితే, నిర్వాహకుల ద్వారా నన్ను మార్పులు-చేర్పులు చేయనివ్వకుండా నిరోధించండి.