తెలుగు రచయితలు వీరిరువురు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజధాని హంపి నుంచి ఉదయగిరి కి వెళ్లే సమయమునందు కవయిత్రి మొల్ల దర్శనార్ధం గోపవరం గ్రామమునకు రెండు పర్యాయములు వచ్చారని మొదటిసారి వచ్చినప్పుడు కవయిత్రి మొల్ల గారి "దర్శన భాగ్యము " కలుగ లేదు అని ఉదయగిరి నుంచి హంపి కి తిరుగు ప్రయాణంలో రెండవసారి గొప్ప వరమునకు వచ్చి కవయిత్రి మొల్ల గారి దర్శనం కోసం శ్రీ కంఠ మల్లేశ్వరుని ఆలయమునకు పక్కన ఉన్నటువంటి మండపం నందు ఆసీనులై ఉన్నారని..... రామాయణ రచన పూర్తయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల గారికి దర్శనమిచ్చినట్లు.... రాయల్ ఆనాడు ఆశీనులై నటువంటి మండపము (mandapamu )నేడు శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపము ప్రసిద్ధి చెందినది. కవయిత్రి మొల్ల సాహితీ పీఠం కడప వారు మంగళ నివాస ప్రాంతంను అభివృద్ధి పరచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగా ఆ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కోటికి పైగా నిధులు మంజూరైనవి. కవయిత్రి మొల్ల గారి పేరు పైన ఒక పర్యాటక విడిది కేంద్రంను బద్వేలు నందు నిర్మించినారు. గోపవరం గ్రామం నకు వెళ్ళు మార్గము నందు స్వాగత తోరణం నిర్మాణము జరిగినది. 2005 నందు "కవయిత్రి మొల్ల "విగ్రహమును "గానుగపెంట హనుమంతరావు "గారి అధ్వర్యంలో బద్వేలు నందు కవయిత్రి మొల్ల గారి పేరు పైన నిర్మించబడినటు వంటి పర్యాటక విడిది కేంద్రం నందు ఆవిష్కరించడం జరిగినది. కవయిత్రి మొల్ల సాహితీ పీఠం కడప వారు ప్రతి సంవత్సరము కవయిత్రి మొల్ల జయంతి మరియు వర్ధంతి ఇతర మరికొన్ని తెలుగు పర్వదినాలలో ఎన్నో సభలు సమావేశాలు మరియు విద్యార్థులు అనేక పోటీలు నిర్వహించి ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి "కవయిత్రి మొల్ల సాహితీ పీఠం కడప "వారి తరపున ప్రతిభా పురస్కారములు మరియు ఆర్థిక ప్రోత్సాహము అందజేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము మల్ల జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వారోత్సవాలు గా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇకపై జరుగబోయే కవయిత్రి మొల్ల గారి జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్సవాలుగా నిర్వహించాలని మనసారా కోరుకుంటూన్నాను. మార్చు