12 తప్పుడు సమాచారం లేదా ఊహాత్మక సమాచారం చేర్చుట

చాలా రోజుల నుంచి సెలవులో ఉండుట వల్ల నిర్వహణ కార్యక్రమాలు చేయుటకు వీలుకావడం లేదు. ఇప్పుడే పరిశీలించిన నేటి దిద్దుబాట్ల ప్రకారం చెప్పాలంటే Nrgullapalli గారు వేలాది గ్రామవ్యాసాలలో తప్పుడు లేదా ఊహాత్మక సమాచారం చేర్చుతున్నట్లుగా గమనించాను. అలాగే మండలం లేదా మండల కేంద్రం కాని గ్రామవ్యాసాలలో కూడా ఆయా జిల్లాలలోని మండలాల వర్గంను చేరుస్తున్నారు. ఈ విషయం సదరు సభ్యుడికి కొన్ని మాసాల క్రితమే సూచించిననూ మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేయడంలో నిమగ్నమైయున్నారు. ఉదా:కు వర్గం:చిత్తూరు జిల్లా మండలాలు వర్గంలో ఇది వ్రాసే సమయానికి 326 పేజీలు వచ్చిచేరాయి. గుంటూరు జిల్లాలో 140, ప్రకాశం జిల్లాలో 130 మండలాలు ఉన్నట్లుగా ఆయా వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం గత రెండు రోజుల దిద్దుబాట్లు పరిశీలించిననూ ఈ సభ్యుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైననూ, ఏ జిల్లా అయిననూ, ఏ మండలం అయిననూ చేతికందిన ప్రతిగ్రామ వ్యాసంలో "గ్రామంలో ప్రధానపంటలు" అనే విభాగం పెట్టి అందులో "వరి, అపరాలు, కాయగూరలు అని చేరుస్తున్నారు. నా వద్ద ఉన్న ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం మండలం మొత్తం మీద ఒక్క హెక్టారు కూడా అపరాలు సాగులేని మండలాలలో కూడా ఆ మండలపు అన్ని గ్రామాలలో అపరాలు సాగు చేస్తున్నట్లు చూపించడం మరియు ఏ ప్రాంతపు గ్రామమైనా ఒకేరకపు పంటలు పండిస్తున్నట్లు చూపించడం తప్పుడు లేదా ఊహాత్మక సమాచారంగా చెప్పబడుతుంది. ఆ సమాచారం ఎలా లభ్యమైందీ అనే విషయంపై అనుమానాలున్నప్పుడు ఆయా వాక్యాల చివరన మూసలుపెట్టడం తోటిసభ్యుల విధి. (ఇప్పుడే నేను కొన్ని గ్రామవ్యాసాలలో "ఆధారం కోరబడినది" అనే మూసపెట్టాను) దానికి సరైన వివరణ ఇవ్వడం మరియు సరైన ఆధారం చూపించడం సమాచారం చేర్చిన సభ్యుడి బాధ్యత. వివరణ ఇవ్వకుండా అభ్యంతరపర్చిన సమాచారాన్నే మళ్ళీ చేర్చడం వికీనిబంధనలకు విరుద్ధముగా పరిగణించబడుతుంది. తోటి సభ్యులు కూడా ఈ విషయంపై దృష్టిపెట్టగలరని మనవి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:21, 19 జనవరి 2017 (UTC)

       అవును ఈ మధ్య కొంత చెత్త చేరుతున్నది Palagiri (చర్చ) 08:25, 22 జనవరి 2017 (UTC)
       Palagiri గారు చెత్త అనే పదానికి నిర్వచనం ఇస్తే సభ్యులు సంతోషిస్తారు --Nrgullapalli (చర్చ) 01:25, 23 జనవరి 2017 (UTC)
           ఇక్కడ సంధర్బాన్ని బట్టి అనవసర సమాచారం చెత్తగా Palagiri గారు అభిప్రాయపడి ఉండవచ్చు. అన్నిపేజీల్లో ఒకే మాదిరి కాక ఊరి లేదా ఆయా ప్రాంతాలలో పండించే పంటల వివరాలను మూలాధారంగా ఉదహరించడం వరకూ పర్వాలేదు కాని లేనివి చేర్చడం అనవసరం..--Viswanadh (చర్చ) 14:53, 25 జనవరి 2017 (UTC)
               Nrgullapalli గారూ, "చెత్త" అనే మాటను మీరు అభ్యంతరపెట్టడం కాకుండా, పాలగిరి లాంటి పెద్దవారు అలా ఎందుకన్నారో ఆలోచించి, సరైన స్ఫూర్తితో తీసుకుని ఉండాల్సింది. చంద్రకాంతరావు గారు వెలికితీసిన విషయాల గురించి మీరు వివరణ ఇచ్చి ఉండాల్సింది. చిత్తూరు జిల్లా మండలాలు వర్గంలో 326 పేజీలు ఎందుకున్నాయో, ఈ సంఖ్య ఇంతలా ఎందుకు పెరిగిందో, అందులో మీ బాధ్యత ఎంతవరకూ ఉందో పరిశీలించి ఉండాల్సింది. ఒక్కో జిల్లాలో అన్నేసి మండలాలు ఉండడంలో అసంబద్ధత ఉందని ఎవరైనా అంటారు. నాకు గుర్తున్నంతలో చంద్రకాంతరావు గారు ఈ విషయమై మీకు గతంలో చెప్పి ఉన్నారు. అయినా అవి కొనసాగాయి. గతంలో వివిధ వాడుకరులు వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు మీరు చేస్తున్న మార్పు చేర్పుల గురించి మీకు చెప్పి ఉన్నారు.. మీరు చేరుస్తున్న ఖాళీ విభాగాల గురించి, మీరు తయారు చేస్తున్న కొత్త పేజీల గురించి, మీరు ఇస్తున్న లింకుల గురించీ.. మీకు చెప్పి ఉన్నారు. ఆయా లోపాలను గమనించానని మీరు చెప్పినప్పటికీ, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన దాఖలాల్లేవు -ఎందుకంటే అవే తప్పులు పునరావృతమౌతున్నై. కె.వెంకటరమణ గారు ఎన్నోసార్లు మీకు చెప్పి, రచ్చబండలో కూడా చెప్పి, ఎన్నో కొత్త పేజీలను తొలగించడం నాకు తెలుసు. నాబోటి వాడుకరులకు మార్గదర్శకులు కావాల్సినంత అనుభవం ఉంది మీకు. కానీ, దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. వీటిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సరైన స్ఫూర్తితో తీసుకుంటారనే ఆశతో- చదువరి (చర్చ • రచనలు) 16:03, 25 జనవరి 2017 (UTC)
       కూరగాయలు పండించని గ్రామం లేదు. కనీసం రైతులు వారి ఇళ్ళముందు తప్పనిసరిగా పండిస్తున్నారు. ఇది నిజం వ్యూహాత్మకంకారు. ఇది కూడా చెర్చవద్దంటీ మానేస్తాను. చెత్త అనే పదం అభ్యంతరకరం దీన్ని సమర్దించుకొనే అవకాశంలేదు --Nrgullapalli (చర్చ) 01:01, 26 జనవరి 2017 (UTC)
               ముందుగా చర్చకు స్పందించిన పాలగిరి, విశ్వనాథ్, చదువరి గార్లకు కృతజ్ఞతలు. చర్చ ప్రారంభమై వారం రోజులు గడిచిననూ సదరు సభ్యుడి నుంచి ఎలాంటి సరైన ప్రతిస్పందన లేదు. తప్పుడు / ఊహాజనిత దిద్దుబాట్లుగా అభ్యంతరపర్చిన దిద్దుబాట్లు మాత్రం చాలావరకు ఆగిపోయాయి. (కొన్ని జరిగాయిలెండి). అభ్యంతరపర్చిన వాక్యాల చివరన ఉన్న ఆధారం కోరబడిన మూసలు మాత్రం అలాగే ఉన్నాయి. అంటే నేను అభ్యంతరపర్చిన ఆ దిద్దుబాట్లు తప్పుడు దిద్దుబాట్లుగా రూఢి అయ్యాయన్నమాట! అయితే ఇది పదో, పాతికో కాదు. వేలల్లో ఇలాంటి తప్పుడు దిద్దుబాట్లు చేస్తున్ననూ మనం అభ్యంతరపర్చకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. వికీలో ఏదేని సమాచారం చేర్చాలంటే ఆధారం తప్పనిసరి అనేది మూలనియమమే. అలాంటి మూలనియమాల ఉల్లంఘన అప్రతిహతంగా జరుగుతున్ననూ చెప్పడానికి సాహసించలేకపోతున్నాము! లేదా సీనియర్ సభ్యులకు దిద్దుబాట్లు చేయడంలో ఏదైనా అనధికార మినహాయింపు ఇస్తున్నామా! ఒక కొత్త సభ్యుడు చిన్న తప్పుచేస్తే నిరోధం విధిస్తున్నాము, మరి వేలాది అనవసర దిద్దుబాట్లు చేస్తున్న సీనియర్ సభ్యుల దిద్దుబాట్లను మాత్రం చూస్తూ ఊరకుండిపోతున్నాము! ఈ సభ్యుడి దిద్దుబాట్లు చెత్తదిద్దుబాట్లుగా పరిగణించడానికి కారణం అతని దిద్దుబాట్లు తెవికీకి ఏ కోశాన ఉపయోగపడకపోవడమే! అంతేకాకుండా ఆ దిద్దుబాట్లు తెవికీకి నష్టాన్ని, తోటి సభ్యులకు చికాకును, పాఠకులకు అసహనాన్ని, నిర్వహణ చేసేవారికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక్కడ మనం రచనలు చేయడం ఎంత ముఖ్యమో ఉన్న వ్యాసాలను, వ్యాస నాణ్యతను కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. సభ్యుడి దిద్దుబాట్ల వల్ల వ్యాసనాణ్యత ముఖ్యంగా గ్రామవ్యాసాలలో ఘోరంగా దెబ్బతింటోంది. అసలు ఏ ఉద్దేశ్యంతో సదరు సభ్యుడు దిద్దుబాట్లు చేస్తున్నాడో అర్థంకావడం లేదు. సభ్యునికి తెవికీ నియమాలపై అవగాహన ఉన్నట్లు, చర్చలను పట్టించుకున్నట్లు, చెప్పిననూ అర్థం చేసుకోగల స్థోమత ఉన్నట్లు, విషయ పరిజ్ఞానం ఉన్నట్లుగా పరిణతి చూపించడం లేదు. సరే ఏవీ లేకున్ననూ దిద్దుబాట్లు చేయరాదనే నియమం లేదు కదా! ఎవరైనా, ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనుకుందాం. కాని ఆ దిద్దుబాట్ల వల్ల తెవికీకి నష్టం కలుగకుండా మరియు తోటి సభ్యులకు చికాకు కల్పించకుండా ఉంటే చాలు. కాని సభ్యుడి దిద్దుబాట్లు వల్ల తెవికీ నిర్వహణ చేసేవారికి ఇబ్బందిగా మారింది. ఇటీవలి దిద్దుబాట్లు గమనించిననూ మనం ఒక విషయం గమనించాలి. వ్యాసాలలో లింకులు బాటు లేదా AWB ద్వారా అతి సునాయాసంగా చేయడానికి వీలున్ననూ మనం ఎందుకు చేయడం లేదో పరిశీలిద్దాం. అసలు లింకులివ్వడం అంటే పదాలను బ్రాకెట్లలో ఇరికించడం మాత్రమే కాదు. దీనికి చాలా కసరత్తు ఉంది. బాటు లేదా AWB ద్వారా చేయడంలో ఇబ్బందులుంటాయనే అలా చేయడం లేదు. మరి ఈ సభ్యుడు చేస్తున్నదేమిటి? కేవలం బాటు చేసే పనులే కదా! సభ్యుడిచ్చిన చాలా లింకులు దారిమార్పులకు లేదా ఎర్రలింకులకే దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఒక పదానికి కాకుండా పదసముదాయానికి ఇచ్చే లింకులు చాలానే ఉంటాయి. ఖచ్చితంగా పదాలు లేనప్పుడు వాక్యనిర్మాణం చెడిపోకుండా పైపులు ఉపయోగిస్తూ లింకులు ఇవ్వాల్సి ఉంటుంది. లింకులివ్వడంలో పైపుల ఉపయోగం ఎనలేనిది. కాని సదరు సభ్యుడు ఎక్కడా పైపులు ఉపయోగించిన దాఖలాలు నా దృష్టికి రాలేదు. మానవ ప్రయత్నం ద్వారా చేస్తూ కూడా కేవలం బాటు లేదా AWB చేసే పనులే చేయడం సరైనది కాకపోవడమే కాకుండా తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. ఉన్న సరైన పదాలు కూడా మార్చి లింకులకోసం తప్పుడు పదాలు చేర్చిన విషయం అతని దిద్దుబాట్లు తెలుపుతాయి. చాలా లింకులు అయోమయ నివృత్తి పేజీలకు, వ్యాసానికి సంబంధం లేని పేజీలకు దారితీస్తున్నాయి. ఇది పాఠకులకు తీవ్ర అసహనానికి గురిచేసే అవకాశం ఉంది. చాలా గ్రామవ్యాసాలలో కవులకు సంబంధించిన వర్గాలు, కథారచయితలకు సంబంధించిన వర్గాలు, ప్రాజెక్టులకు సంబంధించిన వర్గాలు, వికీపీడియన్ల వర్గాలు చేర్చే ఉద్దేశ్యం ఏమిటో అస్సలు తెలియడం లేదు. మండలం కాని గ్రామ వ్యాసాలలో కూడా వందలసంఖ్యలో వర్గాలు చేర్చి మండలాలుగా చేసిన (!) సంగతి ఇదివరకే తెలియజేశాను. ఏది చెప్పిననూ రెండు రోజులు ఆపి మళ్ళీ అదేపని ప్రారంభించిన సంగతి చాలా సార్లు గమనించాను. ఖాళీ విభాగాలు చేర్చడం, తప్పుడు ఇన్ఫోబాక్సులు చేర్చడం, గ్రామవ్యాసాలలో అతిసాధారణ సమాచారం చేర్చడం లాంటి గురించి ఇదివరకే చర్చలు జరిగిననూ సభ్యుడు చేర్చడం మాత్రం ఆపడంలేదు. నిర్వాహకులు, తోటి నైపుణ్య సభ్యులు కూడా ఈ సభ్యుడికి చెప్పీ చెప్పీ విసిగిపోయి తెవికీకి దూరమయ్యే సూచనలున్నాయి. పైగా అతని దిద్దుబాట్లను సమర్థించుకుంటూ మాట్లాడటం జరుగుతోంది. కూరగాయలు పండించే గ్రామం లేదా అని ప్రశ్నించడం వల్ల ఒక విజ్ఞానసర్వస్వంలో చేర్చాల్సిన సమాచార స్థాయిపై అతనికి తగిన నైపుణ్యం లేదనే తెలుస్తోంది. ఏదేని వ్యాసంలో మనం అతిసాధారణ విషయాలు చేర్చరాదు. ఒక వ్యక్తి వ్యాసంలో అతనికి రెండు చేతులున్నాయి, రెండు కాళ్ళున్నాయి, ముక్కుతోనే గాలిపీలుస్తాడు, నోటితోనే తింటాడు ... అని వ్రాయడంలో ఎంత అసంబద్ధత కనిపిస్తుందో గ్రామ వ్యాసంలో ఈ సభ్యుడు వ్రాసే విషయాలు అలాగే ఉంటున్నాయి. ఈ సమాచారం తప్పు కాకున్ననూ వ్యాసంలో ఉండాల్సిన విషయాలు మాత్రం కావు. కొద్దిగానైనా ప్రత్యేకత ఉండే విషయాలు మాత్రమే వ్యాసాలలో చేర్చాలి. ఉదా:కు కాళ్ళు లేకున్ననూ, కళ్ళు లేకున్ననూ తమ నైపుణ్యాన్ని చూపించిన వారి వ్యాసంలో మాత్రం ఆ విషయాలు వ్రాయవచ్చు. ఇదివరకు ఒక కొత్తసభ్యుడు (?) కూడా ఈ సభ్యుడి దిద్దుబాట్లను వెక్కిరిస్తూ, హేళనపరుస్తూ వందలాది గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చిన సంగతి మనకు తెలుసు (ఉదాహరణకు ఇది చూడండి). చేర్చవద్దంటే మానేస్తాను అనడం చూస్తే ఈ సభ్యుడికి సరాసరిగా పాఠశాలలో చిన్నపిల్లలకు చెప్పినట్లుగా వద్దు అనేవరకు తప్పుడు మరియు అతిసాధారణ విషయాలు చేర్చే దిద్దుబాట్లు ఆపేటట్లుగా లేరని తెలుస్తోంది. అసలు చర్చ ఎందుకు తీశారో అర్థం చేసుకోవడం లేదు. విజ్ఞానసర్వస్వంలో పనిచేస్తున్నామంటే మనం ఆ స్థాయిలో సమాచారం చేర్చాలి కాని ఏదో చెత్తసమాచారం చేర్చడం కాదు, చెత్త దిద్దుబాట్లు చేయడం అంతకన్నా కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:35, 27 జనవరి 2017 (UTC)

148 మీపై తగు చర్య గురించి గుళ్ళపల్లి గారూ, మీరు తెవికీలో సీనియర్ సభ్యులలో ఒకరుగా పరిగణించబడతారు. మీ అనుభవం దృష్ట్యా చూస్తే మీరు తెవికీకి ఒక మూలస్తంభంగా ఉంటూ తోటి వాడుకరులకు సలహాలు-సూచనలు ఇస్తూ, కొత్త వాడుకరులకు మార్గనిర్దేశ్యం చేయాల్సిన దశలో ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మీకు కొత్తసభ్యులతో సహా ప్రతిఒక్కరూ మీ దిద్దుబాట్లపై అభ్యంతరం తెలియజేస్తున్నారు. తెవికీలో ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం లేనప్పటికీ నియమాలపై అవగాహన ఉన్నవారు ఏదేని సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు లేదా దిద్దుబాట్లపై ఏదేని అభ్యంతరం వ్యక్తంచేసినప్పుడు కనీసం మీ దిద్దుబాట్ల వైఖరిలో మార్పు తీసుకురావాల్సింది. కాని తోటిసభ్యుల సూచనలకు మీరు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు, పైగా మీ దిద్దుబాట్లపై రచ్చబండలో కాని చర్చాపేజీలలోకాని ముఖ్యమైన చర్చలు జరిగిన సందర్భాలలో కూడా మీరు చర్చలకు విరుద్ధముగా దిద్దుబాట్లు చేస్తున్నారు. ఒక సమూహంగా ఉంటూ ఇక్కడ పనిచేస్తున్నామంటే తెవికీ అభివృద్ధి దృష్ట్యా సమూహంలోని తోటిసభ్యుల అభిప్రాయాలకు తప్పకుండా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. కాని మీరు ఇంతవరకూ కూడా తోటిసభ్యులు ఇచ్చిన సూచనలు పట్టించుకున్నట్లు, ఆ సూచనలను ఆచరించినట్లు కనిపించలేదు. తెవికీ అభివృద్ధి దృష్ట్యా తోటి సభ్యులు చేసిన సూచనలకు తిరస్కరించడమే కాకుండా తెవికీ ప్రయోజనాలకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నట్లుగా మీ దిద్దుబాట్లు తెలుపుతున్నాయి. మీ దిద్దుబాట్ల వల్ల తెవికీకి ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉన్నట్లుగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వివిధ సందర్భాలలో తోటి సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కూడా మీరు ఏ మాత్రం పట్టించుకోలేరు మరియు మీ దిద్దుబాట్ల వైఖరిని మార్చుకోలేరు. 1) తెవికీలో రచనలు లేదా దిద్దుబాట్లు చేయడం యొక్క అతిముఖ్య నియమం వివిధ ప్రామాణిక గ్రంథాలు, వెబ్‌సైట్ల నుంచి కొంతకొంత సమాచారం గ్రహించి ఇక్కడ నాణ్యమైన వ్యాసాలు తయారుచేయడం. సమాచారం చేర్చడమే తెవికీకి అతిముఖ్యమైనది. కాని మీ ఇన్నేళ్ళ దిద్దుబాట్ల ప్రకారం చెప్పాలంటే మీరు ఏనాడు ఇలాంటి ప్రామాణిక సమాచారం వ్యాసాలలో చేర్చలేరు. మీ దిద్దుబాట్లు అన్నీ ఖాళీ విభాగాలు చేర్చుట, ఉన్న వ్యాసాలనే పేరుమార్పులతో సృష్టించుట, అనవసర లింకులు ఇచ్చుట, తప్పుడు సమాచారం చేర్చుట, ఇన్ఫోబాక్సులు కాపీపేస్టులు చేయుట, నిష్పయోజనమైన సాధారణ సమాచారం చేర్చుట ... ఇలాంటివే కొనసాగిస్తున్నారు. 2) ప్రస్తుతకాలంలో తెవికీకి నిర్వాహకుల కొరత ఉంది. ఉన్న చురుకైన నిర్వాహకులు మీ ఒక్కరి దిద్దుబాట్లు పరిశీలించడానికి కూడా సమయం సరిపోవడం లేదు. దీనితో చాలా వ్యాసాలలో అనవసర సమాచారం, తప్పుడు సమాచారం మిగిలిపోతోంది. మీ దిద్దుబాట్లు తెవికీకి ఒక పెద్ద గుదిబండలా తయ్యారౌతున్నాయి! మీ దిద్దుబాట్ల వల్ల తెవికీ నాణ్యత దెబ్బతింటోంది. 3) ఖాళీ విభాగాలు, గ్రామ వ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చరాదని ఇదివరకే చర్చలు జరిగిననూ మీరు ఏ మాత్రం పట్టింకోవడంలేదు. పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నారు. ఊహాత్మక సమాచారం మరియు మూలరహిత సమాచారం చేయరాదనే నియమ-నిబంధనలకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు. పలుమార్లు చెప్పినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఊహాత్మక సమాచారం చేర్చుతున్నారు. ఇది తెవికీ మూలనియమానికి విరుద్ధము. మీరు చేర్చే సాధారణ సమాచారం నిర్థారించతగనిది మరియు మూలాలు లేనివి. కాబట్టి ఈ సమాచారం చేర్చడం నియమ ఉల్లంఘన కిందికి వస్తుంది. 4) వ్యాసాలలో మరీ అధికంగా లింకులు ఉండరాదనేది నియమము. దీన్ని కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. ఇదివరకే లింకులున్న వ్యాసాలలో కూడా మళ్ళీ లింకులు ఇస్తున్నారు. ఈ లింకులు ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించడం లేదు. మీరిచ్చిన లింకులు చాలావరకు ఎర్రలింకులు కావడమో, దారిమార్పులకు దారితీయడమో, అయోమయ నివృత్తి పేజీలకు వెళ్ళడమో లేదా వ్యాసానికి సంబంధం లేని పేజీలకు పోవడమో, అనవసర లింకులు కావడమో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి లింకులు అధికమైతే పాఠకులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది లింకుల దుశ్చర్యగా పరిగణించబడుతుంది. ఇది నియమ ఉల్లంఘన. తోటి సభ్యులు తెలియజేసిననూ మళ్ళీ మళ్ళీ తప్పిదాలు చేయడం పొరపాటు కిందికి కూడా రాదు. ఇది వ్యూహాత్మక నియమ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇదివరకే ఈ విషయం రచ్చబండలో నిర్వాహకులు చెప్పిననూ మీరు పట్టింకోవడం లేదు. 5) గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం మరియు ఊహాత్మక సమాచారం చేర్చరాదని కొన్ని మాసాల క్రితమే చర్చ జరిగింది. ఒక కొత్తసభ్యుడు కూడా మీ దిద్దుబాట్లను హేళనపరుస్తూ వందలాది గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇటీవల రచ్చబండలో తెలియజేసిననూ మీ వైఖరిలో మార్పు లేదు. ఊహాత్మక సమాచారం చేర్చడమన్నది తెవికీ నియమాలకు విరుద్ధముగా పరిగణించబడుతుంది. 6) గ్రామవ్యాసాలలో మీ ఇష్టమున్నట్లుగా వ్యాసానికి సంబంధం లేని వర్గాలు చేరుస్తున్నారు. మండలాలకు సంబంధించిన వర్గాలు, కవులకు సంబంధించిన వర్గాలు, కథారచయితలకు సంబంధించిన వర్గాలు, ప్రాజెక్టులకు సంబంధించిన వర్గాలు, వికీపీడియన్ల వర్గాలు ... ఇలా సంబంధం లేని వర్గాలు చేర్చుట వల్ల వర్గాల ద్వారా వ్యాసాలు చేరుకొనేవారికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి మీ దిద్దుబాట్లు తప్పుడు దిద్దుబాట్లుగా మరియు తెవికీని తప్పుదోవ పట్టించే దిద్దుబాట్లుగా పరిగణించబడతాయి. ఇవి ఏదో పొరపాటున జరిగిన దిద్దుబాట్లుగా కూడా భావించడానికి వీలులేదు. ఎందుకంటే పలుపర్యాయాలు సూచించినప్పటికీ ఇలాంటి దిద్దుబాట్లు పునరావృత్తం కావడం వ్యూహాత్మక లేదా ఉద్దేశ్యపూర్వక తప్పుడు దిద్దుబాట్లుగానే పరిగణించబడతాయి. 7) తెవికీలో ఇన్నేళ్ళ నుంచి అనుభవమున్న పలు సభ్యుల కృషితో నాణ్యమైన వ్యాసాలు తయారయ్యాయి. వాటిని కాపాడుకోవాల్సిన దశలో ఉంటూ కూడా మీరు వ్యాసనాణ్యతను దెబ్బతీస్తున్నారు. వేలాది గ్రామవ్యాసాలలో ఖాళీ విభాగాలు చేర్చారు, వేలాది గ్రామవ్యాసాలలో తప్పుడు సమాచారం చేర్చారు, వేలాది గ్రామవ్యాసాలలో ప్రయోజనం లేని సాధారణ సమాచారం చేర్చారు. ఇలా ఒకటి తర్వాత మరొకటి నిష్పయోజనమైన దిద్దుబాట్లు చేయడం వల్ల తెవికీలో చాలా వరకు వ్యాసనాణ్యత దెబ్బతింది. తెవికీ అభివృద్ధి దృష్ట్యా ఆలోచించినప్పుడు ఇలాంటి దిద్దుబాట్లు చేసేవారిపై తగుచర్య తీసుకోగలిగే అవకాశం ఉంది. 8) తెవికీలో ఇప్పటికే ఉన్ననూ వందలాది వ్యాసాలను కొద్దిపేరుమార్పులతో మళ్ళీ సృష్టించారు. చాలావరకు తొలగింపునకు గురైననూ ఇంకనూ వందలాది వ్యాసాలు తొలగించవలసి ఉంది. ఈ విషయంలో తోటి సభ్యులు ఇచ్చిన సలహాలను మీరు పాటించలేరు. మీరు ఏ మాత్రం పరిశీలన చేయకనే కొత్త వ్యాసాలు సృష్టిస్తున్నారు. దీనివల్ల నిర్వాహకుల విలువైన సమయం వృధాకావడమే కాకుండా తెవికీకి నష్టం వాటిల్లింది. 9) గతంలో గ్రామవ్యాసాలలో మీరు చేర్చిన దిద్దుబాట్లపై అభ్యంతరపర్చిన సమాచారానికి ఇప్పుడు లింకులిస్తున్నారు. అభ్యంతరపర్చిన సమాచారానికి లింకులివ్వడం నిష్పయోజకరము అయినా కొనసాగిస్తున్నారు. దిద్దుబాట్ల పరిశీలనపై నిఘా ఉంచే తోటి సభ్యులకు ఇది ఇబ్బందికరంగానూ, వృధాపనిగానూ మారింది. తద్వారా తోటి సభ్యులు తెవికీకి కేటాయించే విలువైన సమయం పనికిరాకుండా పోతోంది. 10) వికీపీడియా సమగ్రతను దెబ్బతీసే విధంగా పేజీల్లో అవాంఛనీయమైన దిద్దుబాట్లు చేయడాన్ని దుశ్చర్యగా పరిగణించబడతాయి. మీ దిద్దుబాట్లు కూడా అవాంఛనీయ దిద్దుబాట్లుగా ఉంటున్నాయి. కాబట్టి ఇది నియమవిరుద్ధము. మీ పని నిష్ప్రయోజనకరంగా ఉండుటయే కాకుండా తోటి సభ్యుల విలువైన కాలాన్ని హరిస్తున్నారు.

మొత్తంపై మీ దిద్దుబాట్ల వల్ల తెవికీకి ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉన్నట్లుగా నిర్థారించబడింది. కాబట్టి ప్రస్తుతం కొనసాగిస్తున్న మీ దిద్దుబాట్లను తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ఆపవలసిందిగా కోరుచున్నాను. ముందుగా నియమాలపై అవగాహన కల్పించుకొని, ఇదివరకు వివిధ సందర్భాలలో తోటిసభ్యులు ఇచ్చిన సూచనలను అర్థం చేసుకొని, తోటి సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఆపై మాత్రమే మీ దిద్దుబాట్లు కొనసాగించగలరు. లేనిచో మీపై తగుచర్య తీసుకోబడునని తెలుపుతున్నాను. ధన్యవాదములతో... సి. చంద్ర కాంత రావు- చర్చ 14:50, 31 జనవరి 2017 (UTC)


వాడుకరి:Pavan santhosh.s/గ్రామ వ్యాసాల ప్రాజెక్టు https://github.com/IndiaWikiFiles/Telangana/tree/master/Khammam-Villages-Telugu

Nrgullapalli గారు వికీలో నేను అనామక వాడుకరిగా కాక- సభ్యనామంతో మార్పుచేయడం మొదలెట్టినది 2007 నుండి. సుమారు 9 సంవత్సరాలలో ఇటీవల AWB చేసిన మార్పులు 3000 మినహాయిస్తే నేను చేసిన మార్పులు మొత్తం 10.000 సుమారు మాత్రమే. వికీలో ఇన్ని సంవత్సరాలలో ఇన్ని తక్కువ మార్పుల సంఖ్య నాదే ఉంటుంది బహుశా.(మీ మార్పులతో కంపేర్ చేసుకోండి) నాకు మార్పుల సంఖ్య అవసరం లేదు. నేనెప్పుడూ వాటిని గురించి పట్టించుకోలేదు. వ్యాసం మొత్తం ఒకే మార్పుతో చేసినవీ ఉన్నాయి, వంద మార్పులు చేసినవీ ఉన్నాయి. ఇటీవల కొందరు సభ్యులు ఇష్టమొచ్చినట్టుగా రాస్తున్నారు. గుత్తేధారులు, గ్రూపులు అంటూ- ఏవో అందలాలు ఎక్కిస్తారనో, మెడల్స్ ఇస్తారనో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని గంటలు సొంత నెట్ వాడుతూ కష్టపడవలసిన అవసరం లేదు. అలా అనుకొంటే ఇప్పటికి కొన్ని లక్షల మార్పులు నావే అయి ఉండేవి. ఇక్కడ ఎవరైనా ఒకటే. గ్రూపులుగా గుత్తేదారులుగా ఏదో చేయడానికి ఇది మన చేతిలో ఉన్న వ్యవస్థ కాదు. ఇక్కడ ఎవరు ఏది రాసినా పరోపకారం కోసమే...--Viswanadh (చర్చ) 07:16, 19 ఆగష్టు 2016 (UTC)

విశ్వనాద్ గారూ---

అనవసరంగా మీరునన్ను ఎందుకు కెలుకుతున్నాతో అర్ధం కావటంలేదు. నేను మిమ్మలి ఏమీఅడగలేదే! సీనియర్ సభ్యులు/పెద్దలయెడల అగౌరవంగా హేలణగా వ్యంగ్యంగా మాట్లాడడము మీకు వికీపీడియాలోను బైటకూడ అలావుటువున్నదని గమనించాను. తాజావుదాహరణగా మీరు "మాకథాన్ రోడ్దు" అన్నదానికి మీరిచ్చిన సమాధానమే ఉదాహరణ. దానికే మిగతాగౌరవ సభ్యులు కూడా సమాధానం ఇచ్చారు. వారిసమాధానము ఎంతహుందాగావుందో మీసమాధానము ఎంత వ్యూంగ్యంగా వున్నదో గమనించగలరు. అందుకేఅన్నారు అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను-- అని పెద్దలన్నారు. మరొక్కమాట--మీరేసొంత నెట్టు సొంత సమయము వాడుతున్నట్టు చెప్పారు. అంటే? మిగతావాడుకరులు పక్కింటివారి నెట్టు వాడు;తున్నట్టా? ఎందుకీవ్యంగ్య ధోరణి మాటలు. మీ ఎడిట్లు వందల్లోవున్నా, లక్షల్లో వున్నా నాకనవసరం. నాకెందుకు చెపుతునారీసంగతి. నాఎడిట్లు ఎన్ని వున్నాయో చూసుకొనే సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. నేనెప్పుడూచూసుకోలేదు. సీనియర్ సభ్యులను/పెద్దలను మీవ్యంగ్యధోరణి మాటలతో వెంటాడి వేటాడి వారిని మనోవ్యధకు గురిచేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి ధోరణి వికిపీడియాకు చీడపురుగు లాంటిది. ఈవ్యంగ్యధోరణి ఇకనైనామానుకుంటే వికీపీడియాలో మాపనులు మేముచేసుకుంటాము. అనవసరంగా నన్ను కెలికారు గనుక నాసమయం వృధాచేసుకుని ఇదంతా చెప్పవలసి వచ్చినది. మీరు నిర్వాహకుడు గనుక నిర్వాహకత్వం నిలుపుకోవడానికి ఏదోఒకటి కెలకాలి గనుక వూరుకున్నవారిని కెలుతున్నట్లున్నది. ఇకపైనైనా మీరు నాజోలికి రాకుంటే సంతోషిస్తాను. వూరుకున్నవారిని కూడ కెలికి రచ్చబండలొకి లాగి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నది. మీసమాధానం నాకేమీఅవుసరం లేదు.

AWB ప్రస్తుతం వాడుతున్నది నేనే. దానిపై మార్పుల సంఖ్య పెంచుకోదానికి అని కెలికింది మీరే. మీరు నా గురించి చాలా గమనించారు. అందుకే వికీధాన్‌లో అందరు సభ్యులు కృషి చేస్తున్నపుడు మీరొక్కరే ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. మిమ్మల్ని ఎవరూ కించపరచనక్కరలేదు. అగౌరవంగా మాట్లాడనక్కరలేదు. మీకు అల్పుడిగా కనిపించే నేను. పంజాబ్ వెళుతున్నపుడు సిమ్లా వెల్ళినపుడు తిరుగు ప్రయాణంలోనూ అనేక ఫోన్లు చేస్తూ మీకు సహాయపడవలసి వచ్చినదని మరచిపోవద్దు. నేను ఎవరితోనైనా మంచిగానే ఉంటాను. మీరు కెలికితేనే నేను జవాబు ఇచ్చాను. వ్యక్తిగత కక్షలను ఇక్కడ దయచెసి ప్రదర్శించకండి..వయసు పెద్దదో చిన్నదో అనేవి మీకనవసరం. నిర్వహకులు ఎప్పుడూ ఏదో ఒకటి గెలుకుతూ ఉంటారనుకొనే మీకు ఏం చెప్పాలో తెలియడం లేదు..--Viswanadh (చర్చ) 10:18, 20 ఆగష్టు 2016 (UTC)

Viswanadh గారూ AWB వాడుతున్నది చాలామంది వేలసం ఖ్యలో చేస్తున్నారు ప్రతిరోజు. వికీధాన్ లో ఏమిటి ఎప్పుడు ఏమిచేస్తున్నానో అందరికీ తెలుసు దానిని మీరు చెప్పవలసిన అవుసరంలేదు. ప్రయాణంలో మీరుచేసిన సహాయం తోటి వికీపీడియన్లు గమనిస్తూనేవున్నారు. కాదని ఎవరన్నా అంటేనేకదా మీరు మీపనిని సమర్ధించుకోవలసిన అవుసరం. వయసు చిన్నాపెద్దా అనే మాట ఎవరన్నారు? మీరు నిర్వహకులనేవిషయం ఇప్పుడు మీరుచెప్పేవరకు నాకుతెలియదు. ఇది అసందర్భప్రస్థావన.

--Nrgullapalli|చర్చ]])