ఉచిత AI యాప్ "గూగుల్ జెమిని"లాంఛ్.. దీని ప్రత్యేకతలు సూపరో సూపర్

మార్చు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ మేధస్సుకు ప్రతిరూపం. భవిష్యత్తులో, AI మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది. చాలా వరకు రోబోట్‌లు AI ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది మానవులను సోమరిగా చేస్తుంది. AI యొక్క లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. వాస్తవానికి, ఇది మానవుని జీవితాన్ని చేస్తుంది. వైద్య శస్త్రచికిత్సల వంటి అనేక కఠినమైన రంగాలలో సులభంగా.ప్రస్తుతం అంతా ఆర్టిఫియల్స్ ఇంటెలిజెన్స్(AI)యుగం నడుస్తోంది. ఏఐ రంగంలో దూసుకెళ్తున్న గూగుల్ కంపెనీ తాజాగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఏఐ ఆధారిత యాప్ “గూగుల్ జెమినిని(Google ‎Gemini AI APP)” భారతదేశంలో ప్రారంభించింది. ఈ యాప్  తెలుగు సహా  9 భారతీయ భాషలతో అందుబాటులో ఉంది. దీంతో ఇప్పుడు మీకు నచ్చిన భాషలో జెమినీ AI యాప్ ను యాక్సెస్‌ చేయొచ్చు. గూగుల్ ప్లేస్టోర్​ నుంచి జెమిని ఆండ్రాయిడ్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. కాగా, గతేడాది చివర్లో గూగుల్ కంపెనీ.. జెమిని (Gemini AI) పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ AI టూల్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు దానికి పలు ఫీచర్లను యాడ్ చేస్తోన్న గూగుల్.. తాజాగా జెమిని ఆండ్రాయిడ్​ మొబైల్‌ యాప్‌ను భారత్‌లో లాంఛ్ చేసింది. త్వరలో ఐఫోన్​ యూజర్లకు కూడా ఈ యాప్​ను అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ తెలిపింది.


జెమినీ యాప్​లో మీకు నచ్చిన ఏ అంశం గురించి అయినా సెర్చ్ చేయవచ్చు. దీని కోసం మీ ప్రశ్నను టైప్‌ చేయొచ్చు లేదా వాయిస్‌ అసిస్టెంట్‌ను ఉపయోగించవచ్చు. లేదా ఫొటో సాయంతో కూడా సెర్చ్​ చేసుకునే సదుపాయం ఉంది. అయితే ఒక వేళ యూజర్లకు మరిన్ని అదనపు ఫీచర్లు కావాలంటే జెమిని అడ్వాన్స్‌ ప్రీమియం వెర్షన్​ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫైల్‌ అప్‌లోడ్‌, డేటా అనలైజ్‌ వంటి ఫీచర్లు వంటి కొత్త ఫీచర్లు కూడా లభిస్తాయని గూగుల్‌ చెబుతోంది.


Google CEO సుందర్ పిచాయ్..“భారతదేశం మాకు ముఖ్యమైన మార్కెట్. ఇక్కడి వినియోగదారులకు అత్యాధునిక టెక్నాలజీని అందించడానికి కట్టుబడి ఉన్నాం. Google జెమిని యాప్ ద్వారా AI శక్తిని ప్రతి ఒక్కరి చేతుల్లోకి తీసుకురావాలనుకుంటున్నాము జెమినిలో స్థానిక భారతీయ భాషలను జోడించాం. ఇప్పుడు గూగుల్‌ మెసేజెస్‌లో కూడా జెమినీ ఏఐను వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని సరికొత్త ఫీచర్లను దీనికి జోడించనున్నాం” అని ఎక్స్‌ ప్లాట్​ఫామ్​లో పోస్ట్‌ చేశారు.


గూగుల్ జెమిని 5 ప్రత్యేకతలు

-వ్యవహారిక భాషలో సంభాషణ: ఈ యాప్ మీకు సాధారణ వ్యావహారిక భాషలో ప్రతిస్పందిస్తుంది, తద్వారా మీరు దాని అభిప్రాయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులు ప్రశ్నలకు ఖచ్చితమైన, తక్షణ సమాధానాలను కూడా పొందుతారు.

-పర్శనల్ అసిస్టెంట్: ఇది మీ కోసం రిమైండర్‌లు, అలర్ట్ లు, అనేక ఇతర పనులను నిర్వహించగలదు.

-కంటెంట్ వెరైటీ: ఇది టెక్స్ట్,ఆడియో సమాధానాలను అలాగే ఇమేజ్, మల్టీమీడియా కంటెంట్‌ను రూపొందించగలదు.

-భాషా వైవిధ్యం: 9 ప్రధాన భారతీయ భాషలలో అందుబాటులో ఉంది.


-భద్రత, గోప్యత: వినియోగదారుల గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని Google తెలిపింది. యాప్‌లో అధునాతన భద్రతా ఫీచర్‌లు చేర్చబడ్డాయి, ఇవి వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచుతాయి.