వాడుకరి:Purushotham9966/ఒంగోలు వెంకటరంగయ్య
ఒంగోలు(వొంగోలు) వెంకటరంగయ్య నెల్లూరు రంగనాయకులపేటలో 1867 అక్టోబరు మాసంలో అక్షయ, ఆశ్వయుజ బహుళ పంచమినాడు జన్మించాడు. తల్లి సీతమ్మ, తండ్రి శేషాచాలపతిరావు. ఇతను నెల్లూరులో ప్రసిద్ధ న్యాయవాది. నిరంతరం స్థానిక చరిత్రమీద పరిశోధన చేసేవాడు. భారతి, త్రిలింగ, సుబోధిని, గృహలక్ష్మి వంటి పత్రికలలో వందల వ్యాసాలు రచించాడు. సుబోధినిలో "కొందరు నెల్లూరు గొప్పవారు" శీర్షికతో రాసిన వ్యాసాలు 13 పుస్తకాలుగా ప్రచురించ బడ్డాయి. నెల్లూరు స్థానిక చరిత్రకు ఈ వ్యాసాలే నేడు ఆధారాలు. నెల్లూరు జిల్లా సర్వస్వం సంపాదకుడు ఎన్.ఎస్.కృష్ణమూర్తి వీరి శిష్యరికంలో గొప్ప స్థానిక చరిత్రకారులుగా తయారయ్యాడు. ఇతని రచనలు:1. శుక్రనీతిసారం( వివరణ గ్రంథం) 2. తాండవ లక్షణము(భరత నాట్యశాస్త్రం) 3. రామాయణ విమర్శనము. 4. చరిత్ర గ్రంథములు(పరిశోధన వ్యాసాలు). ఇతను 82 వ ఏట 1949 లో మరణించాడు. మూలాలు: విక్రమసిహాపురి మండల సర్వస్వం, సంపాదకుడు : యన్. యస్.కె, నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ, 1964. 2.ఒంగోలు వెంకటరంగయ్య కొందరు నెల్లూరు గొప్పవారు సంపుటాలు. 3జమీన్ రయతు పత్రిక సంపుటాలు, 2. సుబోధిని పత్రిక సంపుటాలు.