వాడుకరి:Purushotham9966/మా మహారాజుతో దూరతీరాలు

మా మహారాజుతో దూర తీరాలు" అనే యాత్రా చరిత్రరచయిత కురుమెళ్ళ వెంకటరావు. పిఠాపురం జమీందారు దంపతులవెంట యూరపు, అమెరికా పర్యటించిన సంస్థాన ఆశ్రితుల్లొ కురుమెళ్ళ వెంకటరావు కూడా ఉన్నాడు. ఆయన పిఠాపురంలో తన ఆత్మీయ మిత్రులు పెనుమత్స వెంకట్రావుకు ఉత్తరాలలో తన యాత్రా విశేషాలు తెలియజేస్తూ వచ్చాడు. లేఖా రచయిత భావుకుడు, గొప్ప రచనాశక్తి ఉన్న సహృదయుడు.

లేఖల్లో తాను చూసిన ప్రదేశాలు, కలిసిన మనుషులు, అనుభవించిన అనుభవాలు అన్నీ హృద్యంగా, కవితాత్మకంగా రాశాడు. 1930 దశాబ్ది భావకవిత్వానికి పట్టంకట్టినకాలం. రచనంతా కవిత్వంగా సాగింది.

రచయిత ఏడు నెలలు జమీందారు వెంట అమెరికా, యూరోపు పర్యటించి, పిఠాపురం తిరిగి వచ్చిన తర్వాత ఆయన మిత్రులు పెనుమత్స వెంకట్రావు ఆ ఉత్తరాలను తిరిగి లేఖారచయితకి ఇచ్చివెస్తే, రచయిత దాదాపు 35 సంవత్సరాల తరువాత ఈ లేఖావళిని ముద్రించాడు.

యాత్రా చరిత్రలలో ఈ 164పుటల రచన ఎన్నదగినది.

నిడదవోలు వెంకటరావు, తదితరులు రాసిన పరిచయాలు పోగా 100 పుటలకు మించని రచన. , మూలాలు:మా మహారాజుతో దూరతీరాలు:రచయిత కురుమెళ్ళ వెంకటరావు, 1966 లో ముద్రించబడింది.