వాడుకరి:Purushotham9966/మేరీ టెయిలర్ భారత దేశంలో నాజైలు జీవితం
మేరీటైలర్ ఆంగ్ల రచన "my yeaars in an indian prison"ను తెలుగులో కి'సహవాసి' అనువాదం చేశారు. చేయని తప్పులకు నిరపరాధులను ప్రభుత్వం ఇనుపచట్టాల యంత్రంలో తోసి ఎట్లా బాధలకు గురిచేసిందో ఈ రచన ఒక నిదర్శనం.
ఇది కల్పితగాధ కాదు. ఒక విదేశీ యువతి విషాదగాధ.
మేరీకి అమలేందు అనే బెంగాలి విద్యార్థి పరిచయం అవుతాడు. అతను ఇంగ్లాండులో ఇంజనీరింగ్ విద్యార్థి. పరిచయం స్నేహంగా మారుతుంది. అతను సెలవులకు కలకత్తా వస్తూంటే మేరి అతనివెంట ఇండియా చూడడానికి వస్తుంది.
కలకత్తా పరిసర గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూంటే, ఆరంభంలోనే ఇద్దరినీ నక్షలైట్లు అని అనుమానించి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారు.
మేరి విచారణ లేకుండా ఏడేళ్ళు కలకత్తా జైల్లో గడుపుతుంది. చట్టానికి కళ్ళూ హృదయం ఉండవు. శ్రీ శ్రీ "నిరపరాధులై చెరసాలల్లో మగ్గేవాళ్ళు" అన్న చరణం ఆమెకు సరిపోతుంది.
చివరకు అంతర్జాతీయ జోక్యంతో, వత్తిడితో ప్రభుత్వం మేరీని విడిచిపెట్టింది. అమలేందు తర్వాత ఎప్పుడు విడుదలయ్యాడో తెలియదు.
ఆరోజుల్లో self-styled "సూడో దేశభక్తులు" "ఏమీ నేరం చెయ్యకుండా ప్రభుత్వం మేరీని ఊరకే నిర్బంధించదు" అని వాదించారు.
మేరి జైల్లో తన కష్టాలు కాదు, సాటి బంధితుల కన్నీటి గాధలను రికార్డు చేసింది.
సోర్స్:"my yeaars in an indian prison, 1978.