వాడుకరి:Purushotham9966/రాహుల్ సాంకృత్యాయన్ తిబ్బత్ లో15 నెలలు
రాహుల్ సాంకృత్యాయన్ పండితుడు, బహుగ్రంథకర్త, పత్రికారచయిత, బహుభాషాకోవిదుడు, భోజ్ పురి నాటకకర్త, విశ్వయాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ 1929-30 ప్రాంతంలో టిబెట్ ముఖ్యపట్టణం ల్హాసాలో 15నెలలు ఉన్నాడు. ఈ దుర్గమమైన మార్గంలో చేసిన యాత్రను, టీబెట్ ప్రజల జీవనవిధానాన్ని ఆయన హిందీలో పుస్తక రూపంలో తెచ్చి ఎంతోకాలమైంది. విదుషి, బహుగ్రంథ రచయిత్రి, శ్రీమతి పారనంది నిర్మల చాలా సమర్ధవంతంగా ఈ యాత్రాచరిత్రను తెలుగు చేస్తే, విశాలాంధ్రసంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం చదవడం గొప్ప అనుభవం. ప్రాచీన కాలంలో జ్ఞానతృష్ణతో యాత్రలు చేసిన మహనీయుల మాదిరే సాంకృత్యాయన్ తిరుగు ప్రయాణంలో అపూర్వమైన టీబెట్ రాతప్రతులను కంచర గాడిదలమీద వేసుకొని భారతదేశం చేరాడు. ఏ రాజాశ్రయం లేకుండా, ప్రకృతి వనరులు లేకుండానే అంత అతిశీతల భూమిలో నివసించిన బౌద్ధ భిక్షువులు వందలాది సంస్కృత రచనలను, బౌద్ధ తత్వ గ్రంథాలను భోటియా భాషలోకి అనువాదం చేసుకొని, మఠాలలో గ్రంథసంపదను కాపాడుకొన్నారు. అటువంటి పండితులే సాంకృత్యాయన్ కూడా. ఆధారాలు: "తిబ్బత్ లో15 నెలలు", రచయిత రాహుల్ సాంకృత్యాయన్, తెలుగు అనువాదం: పారానంది నిర్మల, విశాలాంధ్ర ప్రచురణ.