వాడుకరి:Purushotham9966/శ్రీమతి జయతి పుస్తకం అడవినుంచి అడివికి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
శ్రీమతి జయతి "అడవినుండి అడవికి" ఒంటరి అడవిదారుల్లో, కొండల్లో, పొలాల్లో, ప్రకృతిమధ్య జ్ఞాపకాలకు అక్షరరూపం. నిసర్గ ప్రకృతిలో తన అంతరంగ స్పందనలకు కవితారూపం. హిమాలయాల్లో జీవితమంతా సంచరిస్తూ తన అనుభూతులను స్కెచ్.లరూపంలో, వర్ణచిత్రాలరూపంలో, పోర్ట్రెయిట్ల రూపంలో వ్యక్తీకరించారు రామనాథ్ పస్రీచా. జయతి, రామనాథ్ ఇద్దరూ "మినిమలిస్టు"లు. ఎవరేదిపెట్తే అదితిని, ఏతరుచ్ఛాయకిందో, ఏగుడిసెలోనో విశ్రమిస్తూ తిరిగారు. రామనాథ్ జీతకాలంలో హిమాలయాల్లో నాలుగు వేలమైళ్ళుపైగా కాలినడకన సంచరించారు. క్షణంలో మారిపోయే అస్తమయాలరంగులనూ, ఆకాశాన్ని ఆక్షణంలోనే స్కెచ్ లలో బంధిస్తే, జయతి నోట్సురాసి పుస్తక రూపంలో మనముందుంచారు. జయతి యాత్రాకథనం చదువుతున్నపుడు చలం, ఆచంట జానకిరాం మనసులో తళుక్కుమంటారు. జయతి రచన నా పన్నెండేళ్ళ మనమరాలు వర్షా కూడా చదివి వినిపిస్తూ చాలా ఆనందించింది. "లోహి ఎప్పుడూ ఆమెను వదిలిపెట్టి పోడు ఎందుకో తెలుసా?" మా పాప ప్రశ్నవేసి, తనే జవాబు చెప్పింది. "ఆమెను వదిలేస్తే మళ్ళీ మెట్లెక్కి కొండమీదికి పారిపోతుంది." అన్నది. అవును జయతి లోకం, అడవులు, కొండలే. అకులో ఆకునై..అడవిదారుల్లో జయతి, లోహి ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారు. మూలాలు : జయతి లోహితాక్షన్ రచన "ఆడవినుంచి అడవికి", మట్టిమనుషులు ప్రచురణ, 2018.