వాడుకరి:Purushotham9966/సొలా బాలసుబ్రమణ్యం

శీర్షిక పాఠ్యం మార్చు

సోలా బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులో ఇన్కమ్ టాక్స్ ప్రాక్టీషనర్. జననం 24-02-1915, ఆయన సొంతవూరు రేపల్లె. పూర్వం రేపల్లె సమీపంలో సోలా అనే గ్రామంలో వారి పూర్వీకులు నివాసం ఉండేవారట! సముద్రం ఆవూరిని, తీరాన్ని కోస్తూ తనలో కలుపుకొన్న తరువాత, ఆ కుటుంబం రేపల్లెలో స్థిరపడింది, ఊరిని కడలి మింగి తనలో కలుపుకున్నా ఇంటిపేరులో మాత్రం సోలా మిగిలింది. బాలసుబ్రహ్మణ్యం తండ్రి పౌరోహిత్యం చేసి కుటుంబాన్ని పోషించాడు.

బాలసుబ్రహ్మణ్యం రేపల్లెలో ఎస్. ఎస్. ఎల్. సి చదివి, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ మీడియట్ , డిగ్రీ చదివారు. కాలేజీలో చేరడానికి డబ్బులేకపోతే అత్తగారు తన మెడలో 13 సవరల దండ తీసిచ్చి కాలేజీలో చేరమని ప్రోత్సహించిందట. ఆయన జీవితాంతం ఈ విషయం కృతగ్జతతో చెప్పేవాడు.

రేపల్లెనుంచి రోజూ రైల్లో గుంటూరులో కాలేజీకి వెళ్ళేవారు. పేదరికం వల్ల రైలు టికెట్ ఒక్కొక సారి కొనలేక పోయేవాడు. ఒకసారి, తెనాలిలో స్టేషన్ మాస్టర్ టికెట్ లేదని రైలునుంచి దింపివేసినా, కాలేజీ విద్యార్థిఅని విని తన క్వా ర్టర్స్ కు తీసుకొనివెళ్ళి, భోజనం పెట్టించి, కొత్త పంచెలు ఇచ్చి పంపించాడట.

ఆర్థిక శాస్త్రంలో బాలసుబ్రహ్యమణ్యం విశ్వవిద్యాలయంలో మొదటి స్థానంలో నిలవడంతో ఆయనకు డిగ్రీ చదవడానికి నెలకు 8/రూపాయలు స్కాలర్షిప్ యూనివర్సిటీ అందించింది. ఆ స్కాలర్షిప్ సహాయంతో ఆయన బి. ఏ చదివారు. వెంటనే ఆయనకు సాల్ట్ డిపార్ట్మెంట్ లో గుమాస్తా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాకముందే ఉద్యోగం వచ్చినట్లు జాబు సృష్టించి, మామగారిని భార్యను కాపరానికి పంపమని కోరాడు. ఆయన మామ అసాధ్యలు, ఆ ఉత్తరం నకిలీదని పసిగట్టి కుమార్తెను పంపించలేదు.

నెల్లూరు జిల్లా ఇస్కపల్లెలో సాల్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నపుడు ఇన్స్పెక్షన్ జరిగినది. తన పైఅధికారి తనుచేసిన తప్పును బాలసుబ్రహ్యమణ్యం మీదతోసి చీవాట్లు తప్పించుకొన్నా, బాలసుబ్రహ్మణ్యం ఆత్మాభిమానంతో ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి, నెల్లూరు రంగనాయకులాపేటలో భాష్యం అయ్యంగారి వద్ద ఇన్కమ్ టాక్స్ లెక్కలు రాసిపెట్టే సహాయయకుడుగా చేరి, రెండేళ్ల తర్వాత నెల్లూరులో సొంతంగా ఇన్కమ్ టాక్స్ కన్సల్టెంట్ గా జీవితం ఆరంభించి, అయిదారేళ్లలో జిల్లాలో మెదటి స్థానానికి చేరుకున్నాడు.

బి. ఏ లో తన సహ విద్యార్థి, ఆత్మీయ మిత్రుడు సింగయ్య ఇబ్బందులలో ఉంటే, ఆయనను తన టాక్స్ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకొన్నాడు. ఇద్దరి మిత్రుల స్నేహం వారి జీవితాంతం కొనసాగింది.

తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఒరిస్సా విశ్వవిద్యాలయంలో ప్రైవేటుగా బీ.ఎల్ పాసయి, టాక్స్ వ్యవహారాలలో హై కోర్టులో తన కేసులు స్వయంగా వాదించుకొనేవాడు. ఎప్పడూ టాక్స్ అధికారులతో రాజీపడే విధానాన్ని అనుసరించలేదు. అన్యాయం జరిగితే అపీలుకు వెళ్ళేది. రూపంలో చిన్నవాడేగాని, గొప్ప వ్యవహారవేత్త. రేబాల లక్ష్మీ నరసారెడ్డి, దొడ్ల సుబ్బారెడ్డి, లంగరు చుట్టల కంపెనీ యజమానులు, వాకాటి సంజీవిశెట్టి వంటి నెల్లూరు ప్రముఖులందరు ఆయన వద్ద టాక్స్ లెక్కలు రాయించుకొనేది.

బాలసుబ్రహ్యమణ్యం కుమారులు మోహనరావు టాక్స్ సలహాదారు వృత్తిలో పేరుతెచ్చుకొని సీనియర్ అయిన తర్వాత, 70వ పడిలో బాలసుబ్రహ్మణ్యం న్యాయవాదవృత్తిలో ప్రవేశించాడు. ఎందులో అయినా ఆయన నిశిత బుద్ధివల్ల పేరు తెచ్చుకొనేవాడు.

బాలసుబ్రహ్మణ్యానికి అనేక విషయాల్లో ప్రవేశం ఉండేది. పద్యాలు అల్లేవాడు. సంస్కృత గ్రంథాలు పండితుల సహాయంతో చదివి ఆనందించేవాడు. అమరుకకావ్యం వంటివి తెలుగు పద్యాలలో అనువదించాడు. చివరి రోజుల్లో భగవద్ గీత పద్యాలలో అనువాదానికి పూనుకొన్నాడు. తనకు చిత్రలేఖనంతో పరిచయం ఉంది. యవ్వనంలో చిత్రించిన వర్ణచిత్రాలు కొన్ని వారి వారసులవద్ద ఉన్నాయి. క్లయింట్లు మాట్లాడుతూ ఉంటే వారికి తెలియకుండా పెన్సిల్ డ్రాయింగ్ ఊరకనే వేసుకొనేది. పాయింట్లు నోట్ చేసుకొంటున్నాడని ఎదురుగా కూర్చున్నవారు అనుకొనేది. బాలసుబ్రహ్మణ్యం హాస్య సంభాషణా ప్రియుడు. వృద్ధాప్యంలో క్రికెట్ మ్యాచ్.లు టివిలో చూచి ఆనందించడం వ్యసనంగా మార్చుకున్నాడు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేగుణం ఆయనది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన మనీషి.

84 ఏళ్లు వచ్చినా బాలసుబ్రహ్మణ్యం రోజూ 16 గంటలకు తక్కువ కాకుండా పని చేసేవాడు. టాక్స్ సలహాదారుగా పనిచేస్తూ 84 వ ఏట 4-10-1996నాడు ప్రమాద వశాత్తు వర్షపు నీటిలో జారిపడి, తొంటివిరిగి చనిపోయాడు.

మనస్తత్వశాస్త్రం అంటే బాలసుబ్రహ్యమణ్యానికి ఇష్టం. ఫ్రాయిడ్,హెవలాక్ ఎల్లిస్ వంటి వారి గ్రంథాలన్నీ అధ్యయనం చేసి, 1941 లో ఇంగ్లీషులో Sexorgans Explained పుస్తకం రచించి పంచిపెట్టాడు. మూలాలు: 1.Sola Balasubramanyam, Sexorgans Explained,1941. 2.జమీన్ రయితు వారపత్రిక, నెల్లూరు.