వాడుకరి:ReddyPochha/ప్రయోగశాల1

రాహుల్ సిప్లిగూంజ్, హైదరాబాద్ పాప్ సింగర్


తెలంగాణ భాష, సంస్కృతిని ప్రతిభింబించేలా కుర్రకారును ఉర్రుతలూగిస్తూ పాటలు పాడటంలో రాహుల్ దిట్ట. చిన్నప్పటినుండి హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగిన రాహుల్ ఇక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలను ఒడిసిపట్టుకున్నాడు. నాకు పాటలు పాడటం కంటే కూడా నా కులవృత్తి అంటే నాకు ఇష్టం. ఆ పనిచేయడానికి గర్వపడతా అని ఒకే ఒక్క డైలాగ్‌తో ఆయా వర్గాలను కట్టిపడేశాడు. తన నేటివిటీని ఒరిజినాలిటీని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్. మెల్లమెల్లగా సినిమా పాటలు పాడటంతో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ తెలుగు సీసన్-3 లో అవకాశం రావడం, ఆ షో విన్నర్ అవడంతో ఒక్కసారిగా స్టార్ సెలబ్రేటీ అయ్యారు.