వాడుకరి:Veeven/లిప్యంతరీకరణలో n, m లకు సున్నా లేదా సంయుక్తాక్షరం
ప్రస్తుతం లిప్యంతరీకరణ టైపింగు పద్ధతిలో, పదం మధ్యలో n లేదా m అక్షరాల తర్వాత హల్లు వస్తే దాన్ని సున్నాగా మారుస్తున్నాం. ఉదాహరణకు andam
, అని టైపు చేస్తే అన్దం అనికాకుండా అందం అని మారుస్తాం. అయితే, కొన్ని సార్లు (ముఖ్యంగా పరాయి భాషా పదాలను తెలుగులో టైపించేప్పుడు) ఇది వికటిస్తుంది. వికటించే ఉదాహరణ: aamlam
అన్నప్పడు ఆమ్లం అని కాకుండా ఆంలం అని వస్తుంది. ఇలాంటి చోట్ల సున్నా రాకుండా ఉండటానికి, m
తర్వాత & గుర్తుని aam&lam
అని వాడవచ్చు.
నిర్ణీత నియమాల ద్వారా ఈ అనవసరమైన చోట్ల సున్నాను కాకుండా చూడవచ్చేమో తెలుసుకోడానికి ఈ ప్రయత్నం. (ఈ క్రింది నియమాలకు అందని లేదా విరుద్ధమైన పదాలను చర్చాపేజీలో వ్రాయండి.)
క ఖ గ ఘ
మార్చుఈ వర్గంలోని అక్షరాలకు సున్నా స్థానంలో ఙని పలుకుతాము. nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.
కావలసిన పాఠ్యం | ప్రస్తుత వికల్పాలు | ప్రతిపాదన తర్వాత | గమనికలు |
---|---|---|---|
కుంక | kunka, kumka | kunka | |
చమ్కీ | cam&kee, can&kee | camkee | mని సంయుక్తాక్షరాలకు కేటాయించాం కాబట్టి & అక్కరలేదు. |
చ ఛ జ ఝ
మార్చుఈ వర్గంలోని అక్షరాలకు సున్నా స్థానంలో ఞని పలుకుతాము. nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.
కావలసిన పాఠ్యం | ప్రస్తుత వికల్పాలు | ప్రతిపాదన తర్వాత | గమనికలు |
---|---|---|---|
కంచె | kance, kamce | kance | |
గంజి | ganji, gamji | ganji |
ట ఠ డ ఢ ణ
మార్చుఈ వర్గం లోని అక్షరాలు అన్నింటికీ సున్నా స్థానంలో ణ్ అని పలుకుతాము. కాబట్టి, nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.
కావలసిన పాఠ్యం | ప్రస్తుత వికల్పాలు | ప్రతిపాదన తర్వాత | గమనికలు |
---|---|---|---|
పంట | panTa, pamTa | panTa | (ఎవరైనా pamTa అని టైపు చేసేవారున్నారా?) |
అంటే | ant'ea, amt'ea | ant'ea | |
ఆమ్టే | aam&t'ea, aan&t'ea | aamt'ea | mని సంయుక్తాక్షరాలకు కేటాయించాం కాబట్టి & అక్కరలేదు. |
బండ | band'a, bamd'a | band'a | |
లామ్డా | laam&d'aa, laan&d'aa | laamd'aa |
త థ ద ధ న
మార్చుఈ వర్గం లోని అక్షరాలు అన్నింటికీ సున్నా స్థానంలో న్ అని పలుకుతాము. కాబట్టి, nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.
కావలసిన పాఠ్యం | ప్రస్తుత వికల్పాలు | ప్రతిపాదన తర్వాత | గమనికలు |
---|---|---|---|
ముంత | munta, mumta | munta | (ఎవరైనా mumta అని టైపు చేసేవారున్నారా?) |
కంద | kanda, kamda | kanda | (ఎవరైనా kamda అని టైపు చేసేవారున్నారా?) |
ప ఫ బ భ మ
మార్చుఈ వర్గం లోని అక్షరాలు అన్నింటికీ సున్నా స్థానంలో మ్ అని పలుకుతాము. కాబట్టి, mని సున్నాకు nను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.
కావలసిన పాఠ్యం | ప్రస్తుత వికల్పాలు | ప్రతిపాదన తర్వాత | గమనికలు |
---|---|---|---|
గంప | gampa, ganpa | gampa | |
క్యాంపు | kyaampu, kyaanpu | kyaampu | |
కాన్పు | kaan&pu | kaanpu | nని సంయుక్తాక్షరాలకు కేటాయించడం వల్ల & ని అదనంగా టైపు చెయ్యాల్సిన పనిలేదు. |
ఇన్ఫో | in&fO, im&fO | infO | డిటో |
ఇంఫాల్ | imphaal, inphaal | imphaal | m వాడటం వల్ల సున్నాకి ఇబ్బంది లేదు. |
అంబు | ambu, anbu | ambu | |
అన్బు | an&bu | anbu | |
రంభ | rambha, ranbha | rambha |